TG: ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి తమ నిర్మాణ సంస్థ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వారి ఉదారతను ముఖ్యమంత్రి అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
బీర్ ఒక ఎమోషన్.. తమన్నా కొత్త సిరీస్ ట్రైలర్!
తమన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘డు యూ వనా పార్ట్‌నర్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కార్పొరేట్ ఉద్యోగాలపై విసుగు చెందిన ఇద్దరు స్నేహితులు బీర్ కంపెనీ ప్రారంభించాలనుకోవడం, ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాలతో ఈ వెబ్‌సిరీస్ ఆసక్తికరంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
-
ఈ వారం ఓటీటీ సినిమాలివే!
ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవెంటో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
- నెట్‌ఫ్లిక్స్: ‘కింగ్డమ్’, ‘మెట్రో ఇన్ డినో’
- అమెజాన్ ప్రైమ్: ‘ది 100’
- ఈటీవీ విన్: ‘భాగ్ సాలే’
- జియో: ‘థండర్‌బోల్ట్స్’
- జీ5: ‘శోధ’
- సోనీలివ్: ‘సంభవ వివరణమ్ నలర సంఘం’
- ఆహా తమిళ్: ‘ది డోర్’
-
రజనీ-సత్యరాజ్ వివాదం.. 18 ఏళ్లకు ముగింపు!
రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ చిత్రంలో విలన్ పాత్రను తాను ఎందుకు తిరస్కరించారో నటుడు సత్యరాజ్ తాజాగా వెల్లడించారు. ఆ సమయంలో తాను హీరోగా కొన్ని సినిమాలు చేస్తుండడం వల్ల విలన్ పాత్ర చేస్తే అలాంటి పాత్రలే వస్తాయని ఆఫర్‌ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. ఈ వివాదంపై 18 ఏళ్లుగా కొనసాగుతున్న చర్చకు దీంతో ముగింపు పడింది. 38 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు ‘కూలీ’ సినిమాలో కలిసి నటించారు.
-
అతను నా భర్త: జాన్వీకపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన స్నేహితుడు ఓర్రీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ఒకసారి లాస్ ఏంజెలెస్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్‌లో వెయిటర్స్‌కి ఓర్రీని చూపిస్తూ.. ‘అతను నా భర్త’ అని సరదాగా చెప్పానని అన్నారు. ఈ విషయం విన్న చాలామంది ఆశ్చర్యపోయారు. కాగా ఓర్రీ ఒక ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. బాలీవుడ్ సెలబ్రిటీలలో చాలామందికి మంచి స్నేహితుడు.
-
నానితో నటించడంపై కోమలి ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్!
‘హిట్ 3’ చిత్రంలో నానితో సహాయక పాత్ర పోషించడంపై నటి కోమలి ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమాలో నటించినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఒక స్టార్ హీరోతో కలిసి పోలీస్ పాత్రలో కనిపించడం చాలా గొప్ప విషయమని.. అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని పేర్కొంది. అయితే ఇకపై విభిన్నమైన పాత్రలు, యాక్షన్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నానని కోమలి ప్రసాద్ వెల్లడించింది.
-
‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ టీజర్ రిలీజ్
జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’. ఓ యువ జోడీ ప్రేమ ప్రయాణం నేపథ్యంలో శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. దసర కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు టీజర్ ఆధారంగా అర్థమవుతోంది.
-
చిరంజీవి కోసం మహిళా అభిమాని సైకిల్ యాత్ర
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే మహిళ.. చిరుపై అభిమానంతో ఆదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. రాజేశ్వరిని కలిశారు. ఆమెకు చీరను బహుకరించి.. ఆమెకు ఆర్థిక సాయం కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ టీమ్ పంచుకుంది.
-
నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్
తమిళ స్టార్ హీరో విశాల్ నిర్చితార్థం తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధనికతో జరిగింది. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధనికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’’ అని విశాల్ ట్వీట్ చేశారు.
-
నాగార్జున బర్త్‌డే స్పెషల్.. మ్యాష్‌అప్ వీడియో చూశారా!
టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలున్నప్పటికీ గ్రీకువీరుడు, మన్మధుడు, కింగ్ అనగానే గుర్తొచ్చేది మాత్రం నాగార్జుననే. 66 ఏళ్ల వయసులోనూ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తున్నాడీ హీరో. నేడు ఈ అక్కినేని హీరో పుట్టినరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ మ్యాష్‌అప్ వీడియోను విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లోని కొన్ని పాత్రల ఫేమస్ డైలాగులతో చేసిన ఈ వీడియో వైరలవుతోంది.