హరిహర వీరమల్లులో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు (పవన్) ఢిల్లీ బయల్దేరగా.. అడ్డుకునేందుకు ఔరంగజేబు(బాబీ డియోల్) సిద్ధమవుతారు. వీరిద్దరూ కలుసుకోవడంతోనే మూవీని ముగించారు. అంతేకాకుండా చివర్లో ‘యుద్ధ భూమి’ అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్-2పై అంచనాలు పెంచారు. ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు హరిహర వీరమల్లు పార్ట్- 2లో ప్లాన్ చేసినట్లు సమాచారం.