Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • 2300 థియేటర్స్‌లో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్!

    పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2300 థియేటర్స్‌లో రిలీజ్‌కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈరోజు రాత్రి 9.40 నుండి షోలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక మొదటి షో నార్త్ అమెరికా, యూకే, యూరోప్, కువైట్‌లో 9.30కి షో స్టార్ట్ అవ్వనుంది. అయితే ఈ సినిమా లాభాల బాట పట్టాలింటే సుమారు రూ.250 కోట్లు వసూలు చేయాలి.

  • రజనీకాంత్‌ ‘పవర్‌హౌస్‌’ సాంగ్‌.. అనిరుధ్‌ లైవ్‌ పెర్ఫామెన్స్‌!

    రజనీకాంత్‌-డైరెక్టర్‌ లోకేశ్‌ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్‌ మూవీ ‘కూలీ’. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘కూలీ’లోని ‘పవర్‌హౌస్‌’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి నిర్వహించారు. అదే పాటను లైవ్‌లో పాడుతూ అతిథులను ఉర్రూతలూగించారు సంగీత దర్శకుడు అనిరుధ్‌. సంబంధిత వీడియో తాజాగా విడుదలైంది.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బోనీకపూర్.. ఫొటో వైరల్!

    బాలీవుడ్ సీనియర్ నిర్మాత, అతిలోక సుంద‌రి శ్రీదేవి భ‌ర్త బోనీకపూర్ షాకింగ్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. 69 ఏళ్ల వయసులో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన ఏకంగా 26 కేజీల బరువు తగ్గారని తెలుస్తోంది. వ్యాయామాలు అలాగే కఠినమైన ఆహారపు అలవాట్లు.. ఫాలో అయి ఏకంగా 26 కేజీలు తగ్గిపోయారు. ప్రస్తుతం బోనీకపూర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటోలు)

  • స్టేజీపై అదిరిపోయే పాట పాడిన పవన్ కల్యాణ్‌

    పవన్‌ కల్యాణ్‌-నిధి అగర్వాల్ జంటగా క్రిష్-జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అయితే ఈరోజు ఏపీలోని విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ఆసక్తికర విషయాలు చెప్పారు. అంతేకాదు ఆయన స్టేజీపై అదిరిపోయే పాటకు కూడా పాడారు. ఆ వీడియో మీ కోసం.

  • ‘వైరల్‌ వయ్యారి’.. హీరో ముందే స్టూడెంట్‌ అదిరిపోయే స్టెప్పులు!

    గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు కిరీటి, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘జూనియర్‌’. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించిన ‘వైరల్‌ వయ్యారి’ పాట అందరినీ ఆకర్షించింది. తాజాగా ఈ పాటకు బళ్లారికి చెందిన పూజ అనే విద్యార్థిని అదిరిపోయే స్టెప్పులేసింది. తన స్వగ్రామానికి చెందిన స్టూడెంట్‌ డ్యాన్స్‌కు ఇంప్రెస్‌ అయిన హీరో కిరీటి ఆమెను అభినందించాడు. (వీడియో)

  • మీకు నేను పెద్ద ఫ్యాన్: హీరోయిన్ నిధి అగర్వాల్

    పవన్‌ కల్యాణ్‌తో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.. మీకు నేను పెద్ద ఫ్యాన్ అని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు. పవన్‌ కల్యాణ్‌-నిధి అగర్వాల్ జంటగా క్రిష్-జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అయితే ఈరోజు ఏపీలోని విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి మాట్లాడారు.

  • ఓటీటీలోకి మోహన్‌లాల్ హిట్ మూవీ!

    2019లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘ఇట్టిమాని:మేడిన్ చైనా’ సినిమా విడుదలై హిట్ అందుకుంది. రూ.12 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.35 కోట్లకి పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

  • ఆ టాలీవుడ్ హీరోలకు నేను అభిమాని: దీపిక పదుకొణె

    బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను టాలీవుడ్‌లో మహేష్‌, తారక్‌ల అభిమానిని. వారిద్దరూ నటనలో మాస్టర్స్‌. వారితో కలిసి నటించాలనుంది’’ అంటూ దీపిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

  • నా కూతురుకు ఫోన్ కూడా లేదు: అభిషేక్ బచ్చన్

    తన కూతురు ఆరాధ్యాకు ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని అభిషేక్ బచ్చన్ అన్నారు. ఆమెకు కనీసం ఫోన్ కూడా లేదన్నాడు. దీనికి కారణం చిన్నప్పటినుండి తన భార్య ఐశ్వర్య రాయ్‌ అని తెలిపాడు. కూతురు పెంపకంలో ఐశ్వర్య పూర్తి క్రెడిట్ తీసుకుంటుంది. నేను ఇంత స్వేచ్ఛగా సినిమాలు తీయడానికి నా కుంటుంబాన్ని ఐశ్వర్య చూసుకుంటుందని వెల్లడించాడు.

  • ‘మెగా157’.. ముచ్చటగా మూడో షెడ్యూల్‌ పూర్తి!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘Mega157’ వర్కింగ్‌ టైటిల్స్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ముచ్చటగా మూడో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు తాజాగా అనిల్‌ రావిపూడి తెలిపారు. ‘‘మన శంకరవరప్రసాద్ గారు’ ముచ్చటగా మూడో షెడ్యూల్‌ని కేరళలో పూర్తి చేసుకుని వచ్చారు’’ అని ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. (వీడియో)