బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను టాలీవుడ్‌లో మహేష్, తారక్‌ల అభిమానిని. వారిద్దరూ నటనలో మాస్టర్స్. వారితో కలిసి నటించాలనుంది’’ అంటూ దీపిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నా కూతురుకు ఫోన్ కూడా లేదు: అభిషేక్ బచ్చన్
తన కూతురు ఆరాధ్యాకు ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని అభిషేక్ బచ్చన్ అన్నారు. ఆమెకు కనీసం ఫోన్ కూడా లేదన్నాడు. దీనికి కారణం చిన్నప్పటినుండి తన భార్య ఐశ్వర్య రాయ్ అని తెలిపాడు. కూతురు పెంపకంలో ఐశ్వర్య పూర్తి క్రెడిట్ తీసుకుంటుంది. నేను ఇంత స్వేచ్ఛగా సినిమాలు తీయడానికి నా కుంటుంబాన్ని ఐశ్వర్య చూసుకుంటుందని వెల్లడించాడు.
-
‘మెగా157’.. ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘Mega157’ వర్కింగ్ టైటిల్స్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తాజాగా అనిల్ రావిపూడి తెలిపారు. ‘‘మన శంకరవరప్రసాద్ గారు’ ముచ్చటగా మూడో షెడ్యూల్‌ని కేరళలో పూర్తి చేసుకుని వచ్చారు’’ అని ఎక్స్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. (వీడియో)
-
పవన్ సినిమాకు కన్నడ ఎఫెక్ట్.. ప్లెక్సీల చింపివేత
పవన్ కల్యాణ్ సినిమా హరిహరవీరమల్లుకు సైతం కన్నడ భాష ఎఫెక్ట్ తగిలింది. బెంగుళూరులోని సంధ్య థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీ కన్నడలో లేదని కన్నడీకులు ఆందోళన చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చింపివేశారు. ఈ క్రమంలో అభిమానులు కన్నడీకుల మధ్య గొడవ జరిగింది. ఘటనాస్థలంలో ఉధ్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని అదుపుచేశారు.
-
‘సూర్య 46’.. అదిరిపోయే ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో సూర్య దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 46’ అంటూ రాబోతున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే నేడు సూర్య బర్త్‌డే కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
-
షాహిద్ కపూర్‌తో ఆ బయోపిక్ రద్దు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ విమర్శలు!
‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్‌లో నటుడు షాహిద్‌కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని అమిత్ రాయ్ తెరకెక్కిచనున్నట్లు పలు కథనాలు వెల్లువడయ్యాయి. అయితే తాజాగా ఈమూవీ రద్దయినట్లు దర్శకుడు ప్రకటించాడు. ఈక్రమంలో బాలీవుడ్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమలో జరిగిన అనుభవం తనకు ఒక పాఠం నేర్పించిందని.. అందుకే తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నానని అమిత్ తెలిపారు.
-
హీరో రానాకు మళ్లీ ఈడీ సమన్లు
బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలంటూ హీరో రానా ఈడీని కోరారు. ఆయన బుధవారం ఈడీ ఎదుట హాజరుకావాల్సివుంది. అయితే షూటింగ్‌ల వల్ల విచారణకు హాజరు కాలేనని, తనకు కొంత గడువు కావాలని రానా.. ఈడీని కోరారు. ఆయన చేసిన అభ్యర్థనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించి.. ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలంటూ మళ్లీ సమన్లు పంపించారు.
-
సైమా అవార్డ్స్ 2025: నామినేషన్లతో టాప్‌లో నిలిచిన చిత్రాలివే!
సైమా అవార్డ్స్ 2025 నామినేట్ అయిన సినిమాల జాబితాను కమిటీ ప్రకటించింది. తెలుగులో.. ‘పుష్ప2’(11 నామినేషన్స్), ‘కల్కి2898ఏడీ’ 10, ‘హనుమాన్’10 దక్కించుకుంది. తమిళంలో.. ‘అమరన్’ 13, ‘లబ్బర్ పందు’ 8, ‘వాళై’ 7 నామినేషన్స్ దక్కించుకోగా.. కన్నడలో.. ‘భీమా’ 9, కృష్ణ ప్రణయ సఖి’ 9, ‘ఇబ్బని తబ్బిడ ఇలియాలి’ 7 కేటగిరిల్లో పోటీ పడుతున్నాయి. మలయాళంలో.. ‘ఆడుజీవితం’ 10, ‘ఏఆర్‌ఎం’ 9, ‘ఆవేశం’ 8 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి.
-
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘F1’ హవా
హాలీవుడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘F1’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచే ఇండియాలో విపరీతమైన క్రేజ్ లభించింది. తాజాగా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.
-
హీరో సూర్యకు బర్త్ డే విషెస్ చెప్పిన ‘కరుప్పు’ టీమ్
హీరో సూర్య బర్త్ డే సందర్భంగా ఆయనకు ‘కరుప్పు’ చిత్రబృందం విషెస్ చెప్పింది. ఈమేరకు సూర్య వింటేజ్‌లుక్‌లో ఉన్న పోస్టర్‌ను పంచుకుంది. ఈమూవీకి RJ బాలాజీ దర్శకుడు.