Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నేను 12 గంటలైనా పని చేయగలను: విద్యాబాలన్‌

    సినీ పరిశ్రమలో పని గంటలపై నటి విద్యాబాలన్ తాజాగా స్పందించారు. ‘‘బిడ్డకు జన్మనిచ్చిన నటీమణులు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. వారికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి అవకాశం ఇవ్వాలంటే కచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సిందే. వారికి అనువైన పని గంటలు ఉండడం చాలా ముఖ్యం. వారితో పోలిస్తే.. నేను 12 గంటలైనా చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను’’ వెల్లడించారు.

  • ‘భద్రకాళి’ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్

    విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తన 25వ చిత్రం ‘భద్రకాళి’. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

  • షూటింగ్‌లో మృణాల్‌, శేష్‌కు గాయాలు!

    ‘సీతారామం’ బ్యూటీ నటి మృణాల్ ఠాకూర్, యువ నటుడు అడవి శేష్‌కు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ‘డెకాయిట్’ షూటింగ్ సమయంలో ఇద్దరూ స్వల్ప ప్రమాదానికి గురైనట్లు టాక్. ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయాలయినట్లు తెలుస్తోంది. అయినా గాయాలతోనే షూటింగ్‌ను పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

  • ‘మిరాయి’ ఫస్ట్‌ సింగిల్‌ డేట్ ఫిక్స్

    తేజసజ్జా-రితికా నాయక్ జంటగా కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిరాయి’. ఈమూవీ ఫస్ట్‌ సింగిల్‌ను జులై 26న విడుదల చేయనున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • పవన్ సినిమాకు వెయ్యి కేజీల పేపర్లతో ఫ్యాన్స్ రచ్చ

    TG : పవర్‌స్టార్ పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కానుంది. ఈక్రమంలో అభిమానుల తాకిడితో ధియేటర్ల వద్ద సందడి మొదలైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ 1000కేజీల పేపర్లను మిషన్ సాయంతో కట్ చేస్తున్నారు. ప్రీమియర్ షో జరుగనున్న విశ్వనాథ్ థియేటర్‌లో షో ప్ర‌సారమయ్యే స‌మ‌యంలో వాటిని విసిరివేసేందుకు రెడీ చేస్తున్నారు.  ఇందుకు సంబంధించిన‌ వీడియో వైరల్ అవుతోంది.

     

  • ‘అల్లు అర్జున్ ఎక్కడున్నావ్’ అంటూ పూజా హెగ్డే పోస్ట్

    ‘దువ్వాడ జగన్నాథం’చిత్ర బృందం ఇటీవల రీ యూనియన్ నిర్వహించింది. రీ యూనియన్‌‌కు సంబంధించిన ఫొటోను హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ అయ్యనక బోస్ ఉండగా.. అల్లు అర్జున్ లేరు. దీంతో ‘అల్లు అర్జున్ ఎక్కడున్నావ్’ అనే క్యాప్షన్​​  రాసుకొచ్చింది. దీనికి స్పందించిన బన్నీ’నెక్స్ట్ టైమ్ ఫర్ షూర్!’అంటూ రిప్లై ఇచ్చారు.

  • పవనన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: లోకేశ్‌

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాపై మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని లోకేశ్‌ తెలిపారు.

  • ఆ టైమ్‌లో యాక్టింగ్‌ ఆపేయాలనుకున్నా: రెజీనా

    నటి రెజీనా సినీ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2015లో నటనను ఆపేయాలనుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని  తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడానికి తాను ఎంతగానో కష్టపడ్డానని, అది తన వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతుందని ఆమె పేర్కొన్నారు.

     

  • హరిహర వీరమల్లు సూపర్‌ హిట్‌ అవ్వాలి: అంబటి

    AP: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్‌ చేశారు. “పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సూపర్‌ డూపర్‌ హిట్ అవ్వాలి , కనకవర్షం కురవాలి, అని Xలో పోస్ట్ చేశారు. దీనిని పవన్‌, నాగబాబును ట్యాగ్‌ చేశారు.

     

  • హౌస్‌ మేట్స్‌’ తొలి సింగిల్‌ విడుదల

    రాజవేల్‌ దర్శకత్వంలో దర్శన్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘హౌస్‌ మేట్స్‌’. ఎస్కే ప్రొడక్షన్స్, ప్లేస్మిత్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం తొలి సింగిల్‌ ‘అక్కలు పక్కలు’ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అర్ష బైజు, కాళి వెంకట్, వినోదిని, దీన తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.