Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సూర్య బర్త్‌డే స్పెషల్‌.. ‘కరుప్పు’ టీజర్ రిలీజ్‌

    సూర్య , త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’.  ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘నా పేరు సూర్య.. నాకు ఇంకోపేరు కూడా ఉంది’, ‘ఇది మన టైమ్‌’ అంటూ సూర్య తన వింటేజ్‌లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. టీజర్‌ ఆధారంగా చూస్తే ఇందులో మాస్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది.

     

  • ప్రతి ఒక్కరూ ప్రేమవివాహం చేసుకోవడం అసాధ్యం: నిత్యామీనన్


    విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్  ప్రేమ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. “అందరికీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు, ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు ” అని పేర్కొన్నారు.

     

  • ప‌వ‌న్ ఇకపై సినిమాలు చేయ‌డా.. ఆందోళ‌న‌లో అభిమానులు

    ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో “భవిష్యత్తులో రాజకీయాలా, సినిమాలా?” అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ‘‘రాజకీయాలకే నా తొలి ప్రాధాన్యత. అయితే, నటుడిగా కాకపోయినా, నిర్మాతగా సినిమాల్లో కొనసాగుతా’’ అని తెలిపారు. అయితే, పవన్ తాజా వ్యాఖ్యలు ఆయన అభిమానులను కొంత నిరాశపరిచాయి. గతంలో కూడా పవన్ ఇటువంటి ప్రకటనల తర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  • ప్లీజ్.. హెల్ప్ చేయండి.. నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు

    సినీ నటి తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

  • ఓవర్సీస్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘హరి హర వీరమల్లు’

    పవన్‌ కల్యాణ్‌  హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్లు తెలుగు రాష్ట్రాల్లో  హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే, ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదల విషయంలో ఇటీవల చిన్న గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ ప్రింట్‌ అందలేదని విదేశీ నిర్మాణసంస్థ పోస్ట్‌ పెట్టింది. దీంతో కొందరు అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా లైన్‌క్లియర్‌ అయిందని తెలుపుతూ సదరు సంస్థ పోస్ట్‌ పెట్టింది. ఓవర్సీస్‌లో అన్ని లోకేషన్లకు ప్రింట్‌లు వచ్చేశాయని పేర్కొంది.

  • తిరుపతిలో “కింగ్‌డమ్‌” టైలర్‌ లాంచ్‌.. ఎప్పుడంటే

    గౌతమ్‌ తిన్ననూరి డైరెకక్షన్‌లో నటుడు విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం “కింగ్‌డమ్‌.  సంగీత దర్శకుడు అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించిన ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. తిరుపతి వేదికగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరుగుతుందని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది.

  • విచారణకు హాజరుకాలేను: నటుడు రానా

    బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు విచారణకు రావాలంటూ ED జారీ చేసిన నోటీసులపై నటుడు రానా స్పందించారు. వరుస షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఈరోజు విచారణకు హాజరు కాలేనని EDకి తెలియజేశారు. విచారణకు హాజరయ్యేందుకు కొంత గడువు కావాలని EDని కోరారు. రానా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. రానాతో పాటు ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మిలకు ED నోటీసులు జారీ చేసింది.

  • రజనీకాంత్‌.. ‘పవర్‌’ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది!

    రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ‘కూలీ’. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సాంగ్స్‌ను రిలీజ్‌ చేసిన చిత్ర బృందం.. మూడో పాట ‘పవర్‌హౌస్‌’ను మంగళవారం విడుదల చేసింది.

  • నేడు వైజాగ్‌లో హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్!

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నేడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుక వైజాగ్‌లో జరగనుంది. బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌తో పాటు చిత్రయూనిట్ మొత్తం హాజరవుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • చంద్రబాబు సినిమా చూస్తారా?.. పవన్ ఏమన్నారంటే?

    AP: అమరావతిలో జరిగిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక విలేకరి మీ సినిమాను సీఎం చంద్రబాబు చూస్తారా? అని ప్రశ్నించగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం నన్ను రోజూ చూస్తున్నారు. ఒకవేళ ఆయన సినిమా చూసినా అయితే ఐదు నిమిషాలు చూస్తారేమో. ప్రస్తుతం CM బిజీగా ఉన్నారు’’ అని పవన్ పేర్కొన్నారు.