హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ జులై 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా పవన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం తన సినిమాలను తొక్కి పెట్టాలని చూసినా, తాను భయపడలేదన్నారు. ‘‘వైసీపీ చేస్తున్న బాయ్‌కాట్ ట్రెండ్ ఈ సినిమాకు నడవదు. ఇది ప్రేక్షకుల ఛాయిస్. ప్రత్యర్థులు ఏం చేస్తారో చేయనీయండి’’ అని అన్నారు.