Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘హరిహర వీరమల్లు-2’పై పవన్‌ ఆసక్తికర కామెంట్స్!

    ‘హరిహర వీరమల్లు:పార్ట్‌2’ షూటింగ్‌ 20-30శాతం పూర్తయిందని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు:పార్ట్‌-1’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ‘పార్ట్‌-2’ను వచ్చే డబ్బులు, తనకున్న సమయాన్ని బట్టి చేస్తామని చెప్పారు. అందుకు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలని సమాధానమిచ్చారు.

  • ‘కూలీ’ ప్రమోషన్స్.. హైదరాబాద్‌కు అనిరుధ్-లోకేష్

    సూపర్ స్టార్ ర‌జనీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగ‌ష్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి రెండు పాట‌ల‌ను విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా హైదరాబాద్ వేదిక‌గా మూడో పాట‌ను వ‌ద‌ల‌నుంది. అయితే ఈ వేడుకలో పాల్గోన‌డానికి ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్‌తో పాటు అనిరుధ్ హైదరాబాద్‌కి వ‌చ్చారు. (వీడియో)

  • ఫోన్ ఆఫ్‌ చేయడమే పరిష్కారం:గూగుల్ మాజీ సీఈఓ

    రోజురోజుకూ పుంజుకుంటున్న టెక్నాలజీ, సోషల్ మీడియా, నోటిఫికేషన్లు యువత ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. దీనిపై గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ స్పందించారు. “మైండ్‌ను పక్కదారి పట్టించే అంశాల మధ్య పనిచేయడం ఎలా?” అని యువత తనను అడిగారని, దానికి తాను చెప్పే సమాధానం “మీ ఫోన్‌ను ఆఫ్‌ చేయండి” అని ఆయన సలహా ఇచ్చారు. ఇదే డిజిటల్ Ablenism నుండి బయటపడే మార్గమని పేర్కొన్నారు.

  • SK ‘పరాశక్తి’లో టాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్!

    శివ కార్తికేయన్-శ్రీలీల జంటగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరాశక్తి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన షూటింగ్‌లో పాల్గొన్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీలీలతో పాటు రానా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాడు. (వీడియో)

  • పింక్ శారీలో మెరిసిన ప్రగ్యా!

    టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పింక్ కలర్ చీరలో మెరిసింది. ఈ బ్యూటీ తాజాగా సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలో వయ్యారాలు ఒలకబోస్తూ ఆకట్టుకుంది.

  • ‘సైయారా’ మూవీ చూసి ఏడ్చేస్తున్నారు!

    అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం ‘సైయారా’ చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు. క్లైమాక్స్ చూసి ఏడ్చేస్తూ స్పృహ కోల్పోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొందరైతే సెలైన్ బాటిల్‌తో థియేటర్‌కు వెళ్లారు. ఇవన్నీ ఫేక్ అని, పబ్లిసిటీ స్టంట్ అంటూ పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ మూవీకి మాత్రం భారీగా స్పందన వస్తోంది. ఇప్పటివరకు రూ.120+కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

  • ‘వార్-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

    ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వార్-2’. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్‌కానుంది. ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించనున్నారని సమాచారం. ఈ వేడుకను ఆగస్టు రెండో వారంలో జరిపేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

  • ‘సన్ ఆఫ్ సర్దార్-2’.. ఆకట్టుకునేలా సరికొత్త ట్రైలర్!

    బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్-2’. విజ‌య్ కుమార్ అరోరా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. మృణాల్ థాకుర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీ జూలై 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి కొత్త ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ‘దుజా’ అనే పేరుతో విడుదలైన ఈ ట్రైల‌ర్‌ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

  • హనీమూన్ హత్య కేసు ఆధారంగా ఆమిర్ మూవీ!

    హీరో ఆమిర్‌ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఆధారంగా ఆయన ఓ చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ, భావోద్వేగాలు ఆమిర్‌ను విపరీతంగా ఆకర్షించాయని సమాచారం. ఈ మిస్టరీని స్క్రీన్‌పై ఆసక్తికరంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడట ఆమిర్. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సివుంది.

  • కింగ్డమ్’ ట్రైలర్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

    ‘విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ మూవీ ట్రైలర్‌ను ఈనెల 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు పోస్టర్ వదిలారు.