Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రష్మి కీలక నిర్ణయం

    యాంకర్, నటి రష్మి గౌతమ్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమవుతున్నారు. “ఏదీ శాశ్వతం కాదు, ఈ కాలం కూడా గడిచిపోతుంది” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒడిదొడుకుల కారణంగా ఒక నెల రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ తీసుకుంటున్నానని తెలిపారు. మరింత బలంగా తిరిగి వస్తానని, ఆత్మపరిశీలన చేసుకోడానికి ఈ సమయం అవసరమని రష్మి పేర్కొన్నారు.

  • హాట్‌ కేకుల్లా ‘వీరమల్లు’ టికెట్ల సేల్స్!

    పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. జులై 24న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం నుంచి టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో బుక్‌ మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌ వేదికల ద్వారా బుకింగ్స్‌ మొదలవగా ప్రీమియం సీట్లు కొద్దిసేపటికే సోల్డ్‌ అవుట్‌ చూపిస్తున్నాయి.

  • న్యూ టాక్ షోతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీస్!

    బాలీవుడ్ బ్యూటీస్ కాజోల్-ట్వింకిల్ ఖన్నాలు హోస్ట్‌లుగా సరికొత్త టాక్ షోను స్టార్ట్ చేయనున్నారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే పేరుతో రాబోతున్న ఈ షో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాజోల్ తన సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. ఈ షోలో బాలీవుడు స్టార్స్ ఆమిర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ వంటి ప్రముఖులు రాబోతున్నట్లు తెలుస్తోంది.

  • ఈడీ విచారణకు సమయం కోరిన దగ్గుబాటి రానా

    బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న దగ్గుబాటి రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, రేపు (జూలై 23న) విచారణకు హాజరుకావాల్సిన రానా, షూటింగ్ ఉన్నందున మరో రోజు సమయం కోరారు.

  • ‘8 వసంతాలు’.. డైలాగ్స్ జ్యూక్ బాక్స్ రిలీజ్

    గత నెలలో థియేటర్లలో రిలీజైన ‘8 వసంతాలు’ సినిమా.. కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. ప్రేమకథ బాగుంది, డైలాగ్స్‌ సూపర్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో సీరియల్‌లా ఉందని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే డైలాగ్స్, వాటిలోని సాహిత్యం చాలామందిని ఆకట్టుకున్నాయి. కొందరు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు జ్యూక్‌బాక్స్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • ‘హరిహర వీరమల్లు’ టికెట్ బుకింగ్స్ షురూ!

    పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈక్రమంలో మూవీ టికెట్ బుకింగ్స్ మొదలైనట్లు మేకర్స్ ప్రకటించారు.

  • ‘వార్-2’ ట్రైలర్‌ డేట్ ఫిక్స్

    జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌గా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘వార్-2’. ఆగస్టు 14న విడుదల కానుంది. మేకర్స్ తాజాగా మూవీ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. ‘వార్-2’ ట్రైలర్‌ను మేకర్స్ ఈనెల 25న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇండియన్ సినిమాలో ఇద్దరు ఐకాన్స్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ 25ని లాక్ చేసి చేసినట్టు చెబుతున్నారు.

  • ‘అలా చెప్పడంలో ఓ గర్వం ఉంటుంది’

    దర్శకనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేశభక్తి గురించి మాట్లాడారు. ‘‘దేశభక్తికి నా దగ్గర ఒక్కటే అర్థంఉంది. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని చెప్పడమే దీనికి నిజమైన అర్థం. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ‘మీరు ఎక్కడినుంచి వచ్చారని’ ఎవరైనా అడిగితే భారత్‌ నుంచి వచ్చానని చెబుతాను. అలా చెప్పడంలో ఓ గర్వం ఉంటుంది’’ అని తెలిపారు.

  • ఈ ఇద్దరూ హీరోలు ట్రెండ్‌ సెట్టర్స్‌..

    మలయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్  నేటికీ నటనలో కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నారు. మోహన్‌లాల్‌ ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో వజ్రాభరణాలు ధరించి, స్త్రీల హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిస్తే.. 2023లో విడుదలైన ఓ సినిమాలో గే పాత్రను పోషించి మమ్ముట్టి అందరినీ విస్మయానికి గురిచేశారు.  ఇలా వీరిద్దరూ.. ‘మేం ట్రెండ్‌ను ఫాలో అవ్వం.. ట్రెండ్‌ను సెట్‌ చేస్తాం’ అని చాటి చెబుతున్నారు.

  • ఈ పాట వింటే మళ్లీ కాశీకి వెళ్ళాలనిపిస్తుంది – తనికెళ్ల భరణి

    TG: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మ్యూజికల్స్ లో ‘కైలాసవాసా శివ’ పాటను నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. ఈవేడుక హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. తనికెళ్ల భరణిమా్టాడుతూ.. “ఈపాట వింటే కచ్చితంగా కాశీకి వెళ్లాలనిపిస్తుంది. ఈపాట విన్న తర్వాత నాకే మళ్లీ ఒకసారి కాశీకి వెళ్లాలనిపించింది. కాశీ వెళ్లాలంటే శివుడి ఆజ్ఞ, మన సంకల్పం రెండు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు.