Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశీ ఖన్నా- ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

    పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా జాయిన్ అయిందన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో కెమెరాతో, అందమైన నవ్వుతో క్యూట్​ లుక్స్​తో రాశీ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈ సినిమా రాశి ఖన్నా ‘శ్లోకా’ అని పాత్రలో నటిస్తోంది.

  • లేజర్ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్న ఏంజెలీనా జోలీ

    హలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలీనా జోలీ  అందంతో ఆకట్టుకుంటోంది. అయితే ఆమె లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుందనే వార్తలు వైరల్‌గా మారాయి. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎడింగ్టన్ సినిమా ప్రీమియర్ సందర్భంగాస్పెషల్ అట్రాక్షన్‌గా ఏంజెలీనా జోలీ నిలిచారు. ‘‘ సూర్యుడి నుంచి తన చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. తన అందం కోసం రెండు తీవ్రమైన లేజర్ చికిత్సలు చేయించుకుంది’’ అని అక్కడ సంస్థలు తెలిపాయి.

     

  • ‘రాజాసాబ్‌’లో నాది దెయ్యం పాత్ర కాదు: నిధి అగర్వాల్‌

    ప్రభాస్‌, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం రాజాసాబ్‌’. ఈ సినిమాలోని ఇంకొన్ని సాంగ్స్‌, షూటింగ్‌ పూర్తి కావాల్సి ఉందని హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఈ చిత్రంలో నన్‌, ఏంజెల్‌ రోల్స్‌లో కనిపిస్తానని చెప్పారు. అయితే దెయ్యం పాత్రలో తాను చేయట్లేదని వెల్లడించారు. కాగా, ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌ 5న విడుదల కానుంది.

     

  • తలైవన్‌ తలైవికి U/A సర్టిఫికేట్

    సత్యజ్యోతి ఫిలిమ్‌ పతాకంపై పాండిరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, నిత్యామేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘తలైవన్‌ తలైవి’. ఈ చిత్రానికి సంతోశ్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ఈ నెల 25న చిత్రంరిలీజ్ కానుంది. ఇందులో భాగంగా మూవీ మేకర్స్ ప్రమోషన్‌ పనులు ముమ్మరంగా చేపట్టాయి.  ఈ నేపథ్యంలో చిత్రానికి సెన్సార్‌ బోర్డు U/A సర్టిఫికేట్ అందించింది.

  • చెన్నై ఫైల్స్‌ – ముదల్‌ పక్కం ఆడియో ఆవిష్కరణ

    అనీశ్‌ అష్రాఫ్‌ దర్శకత్వంలో నటుడు వెట్రి ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘చెన్నై ఫైల్స్‌ – ముదల్‌ పక్కం’. ఈ చిత్రానికి ఏజీఆర్‌ సంగీతం సమకూర్చారు. ఈమూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఆడియో ఆవిష్కరణను చెన్నై నగరంలో నిర్వహించారు. చిత్ర నిర్మాత మహేశ్వరన్‌ దేవదాస్, సహ నిర్మాత శాండి రవిచంద్రన్‌ సంయుక్తంగా ఆడియోను విడుదల చేయగా చిత్రబృందం సభ్యులు, సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు.

  • స్టంట్‌ మాస్టర్‌ కుటుంబానికి శింబు సాయం

    ఒక స్టంట్‌ సన్నివేశం చిత్రీకరణలో పాల్గొ న్న స్టంట్‌ మాస్టర్‌ మోహన్‌రాజ్‌ (52) మృతి చెందారు. ఆయన కుటుంబానికి సినీరంగ ప్రముఖులు కొందరు ఆర్థిక సాయం అందించారు. . అదే వరుసలో నటుడు శింబు ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించి రూ.లక్ష బ్యాంకు చెక్‌ను అందించారు.

  • వీరి వల్లే ‘HHVM’ సాధ్యమైంది: క్రిష్

    ‘హరి హర వీరమల్లు(HHVM)’ సినిమా భారీ విజయం సాధించాలని దర్శకుడు క్రిష్ ఆకాంక్షించారు. ‘పవన్ కళ్యాణ్‌, నిర్మాత ఏఎం రత్నం వల్లే HHVM సాధ్యమైంది. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించేవాడిగా ఈ చిత్రం నాకెంతో ఇష్టం’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రానికి తొలత క్రిష్ దర్శకత్వం వహించారు. తర్వాత పలు కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.

     

     

  • రజనీకాంత్‌ను నేను అలా పిలుస్తా: మోహన్‌బాబు

    నటుడు మోహన్‌బాబు తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘రజనీకాంత్‌ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. మా ఇద్దరి మధ్య 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. నేను అతడిని ‘హేమ్‌ బ్లడీ తలైవా’ అని ముద్దుగా పిలుస్తాను’’అని తెలిపారు.

  • దేశభక్తికి అసలైన అర్థమదే..: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

    సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌  నటించిన  ‘సర్‌జమీన్‌’ చిత్రం జులై 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ దేశభక్తి గురించి మాట్లాడారు.  ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పడమే నిజమైన దేశభక్తి అని  అన్నారు.

  • ‘అవతార్‌ 3’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. ట్రైలర్‌ ఎప్పుడంటే!

    ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ (avatar 3) సినిమా అప్‌డేట్స్ కోసం  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో బ్రిటిష్‌ నటి ఊనా చాప్లిన్‌ పోషించిన వరంగ్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమా మొదటి ట్రైలర్‌ కూడా జులై 25న  రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.  ఇక డిసెంబర్‌ 19న ఈ ‘అవతార్‌-3’ విడుదల కానుంది.