హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నాటు నాటు పాటతో ప్రపంచం ఉర్రూతలూగించారు కీరవాణి. ఆయన మ్యూజిక్ వింటే నాకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ఈ సినిమా కోసం బలంగా, ఆత్మ విశ్వాసంతో ఉన్నామంటే కారణం ఆయనే. కీరవాణి మ్యూజిక్ లేకపోతే హరి హర వీరమల్లు లేదు’’ అని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
వీడియో.. పవన్ మూవీ టైటిల్స్‌తో స్పెషల్ సాంగ్!
పవన్ కల్యాణ్ అభిమానులకు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సర్‌ప్రైజ్ ఇచ్చారు. పవన్ సినిమాల పేర్లతో ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దాన్ని రివీల్ చేశారు. కీరవాణి ఆధ్వర్యంలో పలువురు గాయకులు ఆ పాటను ఆలపించి, అలరించారు. పవన్ హీరోగా తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’కు కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
-
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పవన్
రికార్డులు కోసం తానెప్పుడూ సినిమాలు చేయలేదని, సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప తనకేమీ కోరికలూ లేవని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసుశాఖ వారికి ధన్యవాదాలు. ఇది డబ్బు కోసమో.. రికార్డులు కోసమో కాదు.. ఇది ధైర్యం కోసం.. సాహసం కోసం.. న్యాయం కోసం’’ అని అన్నారు.
-
ఔరంగజేబు లాంటి వ్యక్తిని పవన్ ఓడించారు: రఘురామ
ఆంధ్రప్రదేశ్‌లోని ఔరంగజేబులాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ ఓడించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘సినిమా విడుదలకు ముందే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఔరంగజేబులాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించారు పవన్ కల్యాణ్. రియల్ లైఫ్‌లో తన సత్తా చాటి.. ఇప్పుడు తెరపై హరి హర వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు’’ అని పేర్కొన్నారు.
-
మన సత్తా చూపిద్దాం: పవన్ కళ్యాణ్
హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానితో పరిచయాలున్నా డబ్బు రాదు. ‘భీమ్లా నాయక్’ టికెట్ రూ.10-15 పెట్టినా నేను అభ్యంతర పెట్టలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది. మన సత్తా చూపిద్దాం. నా దగ్గర ఆయుధాలు, గుండాలు లేరు. కానీ నా గుండెల్లో మీరున్నారు’’ అని ప్రసంగించారు.
-
‘ఛత్రపతి శివాజీలాంటి యోధుడు పవన్‌కల్యాణ్’
ప్రతి శతాబ్దంలో ఛత్రపతి శివాజీలాంటి యోధుడు పుడతాడని, 21వ శతాబ్దంలో మనకు పవన్‌కల్యాణ్ ఉండటం అదృష్టమని దర్శకుడు జ్యోతికృష్ణ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ జులై 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఇందులో దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడారు.
-
వీడియో.. పడిపడి నవ్విన పవన్ కల్యాణ్!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ జూలై 24న విడుదల కానుంది. శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం హాజరై.. పవన్ కల్యాణ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనను ప్రశంసించారు. మీ ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవాలని ఉంది అని బ్రహ్మానందం అనడంతో పవన్ పడిపడి నవ్వారు.
-
చిట్‌ఫండ్ కేసులో నటుడికి ఊరట!
బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడేకు చిట్‌ఫండ్ మోసం కేసులో సుప్రీంకోర్టు అరెస్ట్ నుండి మధ్యంతర రక్షణ కల్పించింది. సోమవారం జస్టిస్‌లు నాగరత్న, విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పలు ఎఫ్‌ఐఆర్‌లను కలిపి లక్నోకు బదిలీ చేయాలన్న తల్పడే పిటిషన్‌పై ఆగస్టు 29న తదుపరి విచారణ జరుపుతుంది. ‘ది లోని అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ ద్వారా కోట్లాది రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
-
‘హరిహర వీరమల్లు’ సక్సెస్ కావాలని జనసైనికుల మొక్కులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఘన విజయం సాధించాలని జనసైనికులు తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అలిపిరి శ్రీవారి పాదాల వద్ద సోమవారం సాయంత్రం కొబ్బరికాయలు కొట్టారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’ అని… ఈసినిమా సక్సెస్‌లో జనసేన శ్రేణులు, మెగాఫ్యాన్స్ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు.
-
మెగాప్రిన్స్ ‘VT15’ నుంచి క్రేజీ అప్‌డేట్!
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్-మేర్లపాక గాంధీ కాంబోలో ‘VT15’ వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. తాజాగా మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుపుతూ వరుణ్ తేజ్, తమన్ ఉన్న ఫొటో షేర్ చేశారు. ‘VT15 మ్యూజిక్ కోసం సిద్ధం అయ్యారు.. టైటిల్, ఫస్ట్‌లుక్ త్వరలో విడుదలకానుంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు.