Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఇలాంటి సినిమాకు పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల’

    ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్.. సంభాషణలు లేకుండా కేవలం హావభావాలు, నేపథ్య సంగీతంతో నడిచే ‘ఉఫ్ యే సియాపా’ అనే మూకీ కామెడీ సినిమాకు స్వరాలు సమకూర్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. డైలాగులు లేకుండా కేవలం స్కోర్‌తో నడిచే సినిమా చేయడం ఏ కంపోజర్‌కైనా ఒక కల లాంటిది. అందుకే ఈ అవకాశం రాగానే వెంటనే అంగీకరించాను’’ అని పేర్కొన్నారు.

  • అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్

    తన నానమ్మ అల్లు కనకరత్నం మృతి పట్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మా నానమ్మ ఇప్పుడు స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ప్రేమ, ఉనికిని ప్రతిరోజూ కోల్పోతాము. మాపై ఆప్యాయతతో తమ సంతాపాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.

  • అందుకే ‘హరిహర వీరమల్లు’ నుంచి బయటకు: క్రిష్ జాగర్లమూడి

    ‘హరిహర వీరమల్లు’ మూవీపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరోసారి స్పందించారు. కోవిడ్, వ్యక్తిగత కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తాను బయటకు వచ్చినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్, నిర్మాత ఏ.ఎం. రత్నంపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ‘గమ్యం’ నుంచి ‘ఘాటి’ వరకు తన సినిమాలన్నీ ఆస్వాదించానని వివరించారు. ‘ఘాటి’ని ప్రేక్షకులకు అందించడానికి ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు.

  • సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్‌చరణ్

    గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను రామ్‌చరణ్ కలిశారు.

  • నటి అంజలికి పవన్ సింగ్ క్షమాపణలు

    నటి అంజలి రాఘవ్‌కి భోజ్‌పూరి నటుడు పవన్ సింగ్ క్షమాపణ చెప్పారు. లక్నోలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో స్టేజ్‌పైనే అంజలి నడుమును పవన్ సింగ్ తాకడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ‘‘నాకు మీ పట్ల ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యం లేదు.. నా ప్రవర్తన మిమ్మల్ని బాధపెడితే, నేను క్షమాపణలు కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. దానికి ‘‘నేను అతన్ని క్షమించాను’’ అని అంజలి పోస్ట్ చేశారు.

  • ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతిని దర్శించుకున్న సన్నీలియోన్‌

    గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ముంబై లాల్‌ బాగ్చా మార్కెట్‌లో కొలువుదీరిన మహాగణపతిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీనటి సన్నీలియోన్‌ తన కుటుంబసభ్యులతో కలిసి గణేశుడ్ని దర్శించుకున్నారు. మరోవైపు ఆ విఘ్నేశ్వరుడ్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

  • KGF నటుడికి క్యాన్సర్.. ఎలా అయ్యారో చూడండి

    ‘KGF’ సినిమాలో ‘చాచా’ పాత్రలో కనిపించిన కన్నడ నటుడు హరీశ్‌రాయ్ దయనీయమైన స్థితిలో ఉన్నారు. థైరాయిడ్ క్యాన్స‌ర్‌తో బాధపడుతున్న ఆయన.. చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ కోరుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఆయన చాలా బలహీనంగ, సన్నగా కనిపించారు. హరీశ్ రాయ్ చికిత్సకు ఆస్పత్రి ఖర్చులు భరిస్తానని కన్నడ హీరో ధృవ సర్జా హామీ ఇచ్చినట్లు కన్నడ మీడియా పేర్కొంది.

  • ప్రముఖ నిర్మాత కన్నుమూత

    ప్రముఖ చిత్రనిర్మాత రామానంద్ సాగర్ కుమారుడు, నిర్మాత ప్రేమ్ సాగర్(84) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చాక తుదిశ్వస విడిచారు. ప్రేమ్ సాగర్ సీనియర్ నిర్మాత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్. తన తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థ సాగర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలోని అనేక ప్రాజెక్టులకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

  • ‘కథనార్’ ఫస్ట్‌లుక్ విడుదల

    మలయాళం నటుడు జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కథనార్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. అనుష్క శెట్టి హీరోయిన్‌. రోజిన్ థామస్ దర్శకుడు.

  • మంచి చెప్పినా.. చెడు చెప్పినా విమర్శలు తప్పట్లేదు: నాని

    సినీ నటుడు నాని సోషల్‌ మీడియాలో ఎదురయ్యే నెగెటివిటీపై స్పందించారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం మంచి, చెడు అనే తేడా లేకుండా ప్రతి విషయానికి విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మనసులో ఉన్న మాటను చెప్పకుండా ఉండడం కష్టమని, అందుకే కామెంట్లను పట్టించుకోకుండా, మనకు సరైనది అనిపించింది చేయాలని నాని అన్నారు.