Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సూర్య ‘కరుప్ప’ నుంచి టీజర్ వచ్చేస్తోంది!

    సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ తెరకెక్కిస్తోన్న తమిళ చిత్రం ‘కరుప్ప’. ఈ మూవీ టీజర్ ఈనెల 23న రాబోతున్నట్లు మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు

    డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. నిర్మాతల అభ్యర్థన మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100, అప్పర్ క్లాస్ టికెట్ ధర రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెరగనున్నాయి. ప్రీమియర్ షో టికెట్టు ధరను రూ. 600గా నిర్ణయించింది.

      

  • 70ఏళ్ల హీరోతో యంగ్ బ్యూటీ రొమాన్స్.. పోస్ట్ వైరల్!

    హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ స్టార్ హీరో కమల్‌హాసన్ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. కమల్-అన్‌బరీవ్ కాంబోలో రాబోతున్న మూవీలో కళ్యాణి నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్ పోయి పోయి 70 ఏళ్ల హీరోతో నటించడం ఏంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో ఆమె హీరోయిన్‌గా నటిస్తుందా? లేక ఇతర పాత్రలో కనిపించనుందా అనేది తెలియాల్సివుంది.

  • పవన్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా?

    ‘హరిహర వీరమల్లు’ ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘Eberhard & Co’ సంస్థకు చెందిన ఈ వాచ్ ధర సుమారుగా రూ.1,85,148 అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాక‌, సినీ ప్రియులు కూడా ఈ గడియారంపై ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇప్పటికే నెట్టింట విపరీతంగా షేర్ అవుతోంది.

  • ప్రభాస్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ?

    ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆమెతో చిత్రబృందం చర్చలు కూడా జరపగా.. వామికా నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

  • నేహాశెట్టి అందానికి కుర్రకారు ఫిదా!

    హీరోయిన్ నేహాశెట్టి తాజాగా బ్లాక్‌లో మెరిసింది. ఇందులో ఆమె లుక్స్‌ చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం నేహా ఫోటో సోషల్‌‌మీడియాలో వైరలవుతోంది.

  • ధనుష్ ‘ఇడ్లీ కడై’ ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్!

    కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఇడ్లీ కడై’. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఈనెల 27న రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.

  • ఆ హీరోలతో నటించడం వేస్ట్: నిత్యామీనన్

    హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా బడా హీరోలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో నటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నిత్య చెప్పింది. చిన్న హీరోల సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని.. కిక్ ఉంటుందని తెలిపింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పింది. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్నానని వెల్లడించింది.

  • నువ్వు నటుడివా?.. అంటూ విమర్మించారు: నవాజుద్దీన్‌

    బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తనకెరీర్‌లో ఎదురైన విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘నువ్వు నటుడివా?, యాక్టర్‌లా కనిపించట్లేదే’ అని నా కెరీర్‌ ప్రారంభంలో కొందరు విమర్శించేవారు. తొలుత బాధపడినా.. కెరీర్‌ విషయంలో మాత్రం ఎప్పుడూ భయపడలేదు. నేను రంగు తక్కువైనా ఈ స్థాయికి చేరుకోగలిగా. అయితే నాలాంటివారితో రూ.25 కోట్ల బడ్జెట్‌కు మించి సినిమాలు నిర్మించేందుకు ఎవరూ ముందుకు రారు’’ అని వెల్లడించారు.

  • ‘హరి హర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన అభిమానులు


    పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల తాకిడితో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అడుగడుగునా పహారా కాస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి మాదాపూర్ డీసీపీ వినీత్ స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. ఈవెంట్ జరుగుతున్న ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.