Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రానా, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు

    ప్రముఖ నటులు రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్‌ కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. రానాను జులై 23న, ప్రకాశ్‌రాజ్‌ను జులై 30న, విజయ్‌ దేవరకొండను ఆగస్టు 5న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్‌లా వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

  • ‘ఉదయ్‌పుర్‌ ఫైల్స్‌’లో కీలక మార్పులు!

    ‘ఉదయ్‌పుర్‌ ఫైల్స్‌’ చిత్రంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సెన్సార్‌ పూర్తయిన ఈ సినిమా విడుదలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దర్శక, నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇటీవల సంబంధిత పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కోరింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఓ కమిటీ కొన్ని మార్పులను సూచించగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ అంగీకరించింది.

     

  • కొనసాగుతోన్న ‘జూనియర్’ హవా!

    కిరీటీ-శ్రీలీల జంటగా నటించిన ‘జూనియర్’ చిత్రం జూలై 18న రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో జెనీలియా ఓ పవర్‌ఫుల్ పాత్ర చేసి టాలీవుడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ కోసం బుక్ మై షోలో ఏకంగా 120K+ పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. దీన్నిబట్టి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అర్థం చేసుకోవచ్చు.

  • అభిమానిపై ఆగ్రహించిన స్టార్ హీరో.. వీడియో వైరల్!

    ఓ అభిమాని చేసిన పనికి హీరో అక్షయ్‌‌కుమార్‌కు కోపమొచ్చింది. ఆయన లండన్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా.. అభిమాని అతడిని వీడియో తీశాడు. ఇది గమనించిన అక్షయ్‌ వీడియో ఎందుకు తీస్తున్నావని.. వెంటనే కెమెరా ఆఫ్‌ చేయమంటూ బెదిరించాడు. అభిమాని ఫోన్‌ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా వీడియో తీసిన ఫ్యాన్‌.. దాన్ని నెట్టింట పంచుకున్నాడు. అయితే మొదట కోప్పడ్డ అక్షయ్‌.. చివరకు అభిమానికి నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు.

  • ఉస్తాద్ భగత్‌సింగ్’.. వారికి మూవీ టీమ్ వార్నింగ్!

    ‘పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా షూటింగ్ ఫొటోలు సోషల్‌మీడియాలో లీక్ అయ్యాయి. తాజాగా ఈ విషయంపై మూవీ టీమ్ స్పందించి కీలక పోస్ట్ చేసింది. ‘‘ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌ నుండి లీకైన పిక్స్ షేర్ చేస్తూ వైరల్ చేయడం మేము గమనించాము. దయచేసి వాటిని షేర్ చేయకండి. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని రాసుకొచ్చారు.

  • ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే!

    ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు చిత్రాలు అలరించానున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.

    • ‘హరిహర వీరమల్లు’ (జులై 24 రిలీజ్)
    • ‘మహావతార్‌: నరసింహ’ (జులై 25 రిలీజ్)
    • నెట్‌ఫ్లిక్స్‌: ‘మండల మర్డర్స్‌’ (జులై 25 స్ట్రీమింగ్‌)
    • జియో హాట్‌స్టార్‌: ‘సర్జమీన్‌’ (జులై 25 స్ట్రీమింగ్‌)
    • అమెజాన్‌ ప్రైమ్‌: రంగీన్‌ (జులై 25 స్ట్రీమింగ్‌)

  • ఆమె కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: స్టార్ నటుడు

    జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తన భార్య ఎంతగానో అండగా నిలిచిందని ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్‌ వెల్లడించారు . అందుకే ప్రతి రోజూ ఆమె పాదాలను తాకి కృతజ్ఞతలు చెప్పనిదే తాను నిద్రపోనని తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన అర్ధాంగి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు.

  • పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అయితే, ఈ అనుమతి కొన్ని కఠిన షరతులతో కూడుకుని ఉంది. ఈ కార్యక్రమానికి వెయ్యి నుండి 1500 మందికి మాత్రమే హాజరు కావడానికి అనుమతి ఉంటుంది. అలాగే, ఈవెంట్ వెలుపల భారీ సంఖ్యలో గుమిగూడే ప్రజలను నిర్మాతలే నియంత్రించాలని పోలీసులు స్పష్టం చేశారు.

  • అతడితో కలిసి డాన్స్ చేసిన సామ్.. వీడియో వైరల్!

    రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రీసెంట్‌గా ఈ మూవీలోని ‘నదివే’ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే తాజాగా హీరోయిన్ సమంత నటుడు వెన్నెల కిశోర్‌తో కలిసి ఈ సాంగ్‌ను రి-క్రియేట్ చేసింది. సేమ్ రష్మిక, దీక్షిత్ శెట్టిలు డ్యాన్స్ చేస్తున్నట్లే వీరు కూడా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించడం నా అదృష్టం: నటి నిధి అగర్వాల్‌

    పవన్‌కల్యాణ్ -నిధి అగర్వాల్‌ జంటగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. ఈ మూవీ జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈసందర్భంగా చిత్రబృందం నిర్వహించిన స్పెషల్‌ ప్రెస్‌మీట్‌లో నిధి అగర్వాల్ మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు నటి నిధి అగర్వాల్‌ చెప్పారు.