Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘హరి హర వీరమల్లు’ కథ ఇదే: పవన్‌ కళ్యాణ్‌

    కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్‌ వజ్రం హైదరాబాద్ సుల్తానుల వద్దకు ఎలా వచ్చింది? దాని ప్రయాణం ఎటు వెళ్లిందనే నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’  సినిమా కథ పుట్టినట్లు పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ‘దీనికి పునాది వేసిన దర్శకుడు క్రిష్‌కు ధన్యవాదాలు. నిధి అగర్వాల్‌ ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తుంటే నాకే సిగ్గేసింది. అందుకే నేనే ప్రమోషన్‌ కోసం వచ్చా’అని చెప్పారు.

     

  • బిజినెస్‌లోకి రష్మిక ఎంట్రీ ..!

    టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మంధాన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అంటూ ‘డియర్ డైరీ’ పేరుతో ఓ ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ని లాంచ్ చేసింది. ఇది ఓ బ్రాండో లేదంటే ఫెర్ఫ్యూమో కాదని.. ఇది తనలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధర రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి.

     

  • నటి ప్రెటా గిల్ కన్నుమూత

    ప్రముఖ గాయని, నటి, వ్యాపారవేత్త ప్రెటా గిల్ కేన్సర్‌తో చికిత్స పొందుతూ కన్ను మూసింది. తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్నిఉర్రూత లూగించిన ఆమె, 2023 జనవరిలో పేగు కేన్సర్‌ బారిన పడింది. కేన్సర్‌తో పోరాటం చేసి చివరికి న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. దీంతో సంగతం ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

  • మండుటెండల్లో 57 రోజుల పాటు క్లైమాక్స్ తీశాం: పవన్

    పవన్‌కల్యాణ్ న్యూ మూవీ ‘హరి హర వీరమల్లు’జులై 24న విడుదల కానుంది. ఈసందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేశాం. చాలా కాలం తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశా. ఈ సినిమా క్లైమాక్స్ సీన్లు అందరికీ ప్రేరణ కలిగిస్తాయి’’ అని పవన్ చెప్పుకొచ్చారు.

     

  • నేను యాక్సిడెంటల్ యాక్టర్​ని: పవన్​ కల్యాణ్

    తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. తానొక యాక్సిడెంటల్ నటుడిని అని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్​ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీర మల్లు మూవీ ఈ సినిమా జూలై 24న గ్రాండ్​గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశారు.

  • ‘పోడియం లేకపోతే ఏంటో నగ్నంగా ఉన్నట్టు ఉంటుంది’

    ‘హరి హర వీరమల్లు’ మూవీ ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘పోడియం లేకుండా మాట్లాడటం కష్టంగా ఉంది. పోడియం లేకపోతే ఏంటో నగ్నంగా ఉన్నట్టు ఉంటుంది” అని అన్నారు . ఈ మూవీ జులై 24న పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. కాగా, ఈ చిత్రానికి క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.

  • ‘మండల మర్డర్స్‌’ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

    బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్న సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘మండల మర్డర్స్‌’. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జులై 25వ తేదీ నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. శతాబ్దాల కిందట చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. గోపి పుత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.

  • సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి: పవన్‌ కల్యాణ్‌

    పవన్‌కల్యాణ్ న్యూ మూవీ ‘హరి హర వీరమల్లు’ జులై 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు తెలియదు. దీనికోసం ఇంత కష్టపడ్డాం అని చెప్పడం నాకు మొహమాటంగా ఉంటుంది. సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి’’అని పవన్‌ చెప్పారు.

     

  • రాజమౌళి నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే ?

    నటుడు మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబి 29’. ఈ సినిమా షూటింగ్ నెకస్ట్ షెడ్యూల్ కెన్యా అనుకుని మళ్లి లోకేషన్ మార్చి టాంజానియాలోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో  షూటింగ్ నిర్వహించేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • ‘కాంతార చాప్టర్‌ 1’ గ్లింప్స్‌ రిలీజ్

    కన్నడ నటుడు రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’. గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. రిషభ్‌ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ‘కాంతార జర్నీ’ అంటూ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక శక్తి అంటూ రిషభ్‌ తన జర్నీని వివరించారు. అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు.