మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మెగా గుడ్‌న్యూస్. ఆయన నటించిన స్టాలిన్ సినిమా 2006లో రిలీజై బాక్సాపీసుల వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని 4K వెర్షన్‌లో థియేటర్లలో రీరిలీజ్ కానుంది. 2006లో ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేయగా, నాగబాబు నిర్మించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నేడు HHVM ప్రెస్‌మీట్.. హాజరుకానున్న పవన్!
పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ‘హరిహర వీరమల్లు(HHVM)’ ఈ నెల 24న రిలీజ్ కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. అందులో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
-
నెగిటివ్ పాత్రలు పోషించడానికైనా సిద్ధమే: హీరోయిన్
విభిన్నమైన పాత్రల్లో నటించినప్పుడే చిత్ర పరిశ్రమలో నటిగా ఎదుగుదల ఉంటుందని అంటోంది బాలీవుడ్ నాయిక త్రిప్తి డిమ్రి. ‘‘ప్రస్తుతం నటీనటులు కంటెంట్ బాగుంటే పాత్రతో సంబంధం లేకుండా నటిస్తున్నారు. నెగిటివ్ పాత్రలు పోషించడానికైనా సిద్ధమే. అప్పట్లో నెగిటివ్ పాత్రలను విలన్లుగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం వీటిని ఎవరైనా పోషించవచ్చు. ఇలాంటి పాత్రల్లో ఒదిగిపోవడం సవాలే. కానీ కష్టమైనా నేర్చుకోవడానికే ఇష్టపడతా’’ అని పేర్కొన్నారు.
-
‘గరివిడి లక్ష్మి’గా ఆనంది.. గ్లింప్స్ సూపర్!
1990ల్లో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేసిన గరివిడి లక్ష్మి జీవితాధారంగా ‘గరివిడి లక్ష్మి’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో ఆనంది నటిస్తున్నారు. నరేష్, శరణ్యా ప్రదీప్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరీ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఆనంది రోల్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
-
HHVM ప్రీరిలీజ్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే అనుమతి!
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు జులై 24న విడుదలవుతోంది. నేడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే మెగా సూర్య ప్రొడక్షన్స్ అభిమానులకు ఒక విజ్ఞప్తి చేసింది. ‘‘సరైన పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. పాస్‌లు లేనివారు వేదిక వద్ద గుమిగూడవద్దు’’ అని కోరింది. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకుడు. ఏఎం రత్నం నిర్మించారు.
-
రేపు ‘‘హరిహర వీరమల్లు’’ ప్రెస్ మీట్.. పవన్ రాక!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మరో 4 రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా రేపు (జూలై 21) హైదరాబాద్‌లో మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
-
విజయ్ దేవరకొండ నయా లుక్.. మీకు ఎలా అనిపిస్తోంది?
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కు విజయ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
-
హీరో అజిత్‌కు ప్రమాదం
తమిళ స్టార్ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ కార్ రేసింగ్‌లో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కానీ ఈ పోటీల నుంచి అజిత్ తప్పుకోవాల్సి వచ్చింది.
-
‘భళ్లాలదేవ’గా నేనే చేయాల్సింది: జయసుధ తనయుడు
‘బాహుబలి’లో భళ్లాల దేవుడి పాత్ర కోసం జయసుధ కొడుకు నిహార్ కపూర్ ఎంపికయ్యారట. ‘‘మొదట ఆ పాత్రను రానానే చేయాల్సింది. ఆయన డేట్స్ కుదరకపోవడం వల్ల నన్ను సంప్రదించగా.. ఓకే చెప్పాను. నాలుగు వారాలు ట్రైనింగ్ సెషన్స్‌లోనూ పాల్గొన్నా. ఆ తర్వాత రానా చేస్తానని చెప్పారు. మీరు కాలకేయ పాత్ర చేస్తారా అని చిత్రబృందం అడిగింది. మొదటి సినిమాలో ముఖం కనిపించకపోతే బాగోదని వదిలేశా’’ అని చెప్పుకొచ్చారు.
-
ఆ హీరోతోనే శేఖర్ కమ్ముల కొత్త మూవీ!
ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రీసెంట్‌గా ‘కుబేర’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. తదుపరి చిత్రాన్ని నానితో చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నానికి ఉన్న లైనప్ దృష్ట్యా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో శేఖర్ ఓ లవ్ స్టోరీని సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఇప్పటికే ఈ కథపై కసరత్తులు ప్రారంభించినట్లు టాక్.