Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఆ హీరోతోనే శేఖర్ కమ్ముల కొత్త మూవీ!

    ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రీసెంట్‌గా ‘కుబేర’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. తదుపరి చిత్రాన్ని నానితో చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నానికి ఉన్న లైనప్ దృష్ట్యా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో శేఖర్ ఓ లవ్ స్టోరీని సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఇప్పటికే  ఈ కథపై కసరత్తులు ప్రారంభించినట్లు టాక్.

  • టీనేజ్‌లోకి అడుగుపెట్టిన సితార.. మహేశ్‌బాబు ఆనందం

    తన కుమార్తె సితారకు నటుడు మహేశ్‌బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సితార టీనేజీలోకి అడుగుపెట్టిందని చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మరో పోస్టులో ‘సైయారా’ మూవీ టీమ్‌ను కొనియాడారు. కథ, నటుల పెర్ఫామెన్స్‌ బాగున్నాయని అన్నారు. అహాన్‌ పాండే, అనీత్‌ పద్ధా తమ పాత్రల్లో ఒదిగిపోయారని ప్రశంసించారు.

  • రెమ్యునరేషన్ పెంచేసిన జాన్వీకపూర్

    నటి జాన్వీకపూర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో జాన్వీ  తన రెమ్యూనేషన్ అమాంతం పెంచేసింది.  దేవర’ సినిమా కోసం జాన్వీ కపూర్ 5 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న  పెద్ది సినిమా కోసం ఏకంగా ఆరు కోట్లు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది.  అయితే భారీ అంచనాలతో సిినిమా ఉండబోతుందనే మూవీ మేకర్స్  చెప్తున్నారు.

     

  • ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ‘F1’ సినిమా చూసిన రాజ‌మౌళి

    దర్శ‌కుడు రాజ‌మౌళి, తన సతీమణీ రమతో కలిసి  హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఉన్న ‘F1’ సినిమాను వీక్షించారు.  ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమాను న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క‌న్న‌డ స్టార్ ద‌ర్శ‌కుడు కేజీఎఫ్, స‌లార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ వీక్షించారు. కాగా,  రాజ‌మౌళి ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబుతో క‌లిసి ఒక సినిమా చేస్తున్నారు.

  • ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదులు

    నిర్మాత ఏఎం రత్నం పై  ఏషియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌,  మహాలక్ష్మీ ఫిల్మ్స్‌  డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో  ఫిర్యాదులు చేశాయి. నైజాం డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి రెండు సినిమాలకుగానూ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బును ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆరోపించాయి.. రత్నం నిర్మించిన కొత్త సినిమా ‘హరి హర వీరమల్లు’ విడుదలకు ముందు ఆ బాకీ మొత్తం వసూలు చేయడంలో సహాయం చేయాలని అభ్యర్థించాయి.

  • సీఎం రేవంత్‌ను కలిసిన దుల్కర్ సల్మాన్

    TG: సినీ నటుడు దుల్కర్ సల్మాన్ , సినీ నిర్మాత స్వప్న దత్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించి పలు విషయాలు వీరు చర్చించినట్లు సమాచారం.  కాగా, 2022వ సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా దుల్కర్ నటించిన ‘సీతారామం’ గద్దర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.

  • ‘హరి హర వీరమల్లు’లో ఆ ఒక్క సీక్వెన్స్‌.. 56 రోజుల షూటింగ్‌: జ్యోతికృష్ణ

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన  మూవీ ‘హరి హర వీరమల్లు’ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘ఈమూవీలో ఓ ఫైట్‌ ఎపిసోడ్‌ను పవనే డిజైన్‌ చేశారు. బ్రూస్‌లీ ‘ఎంటర్‌ ది గ్రాడన్‌’ని తలపించే భారీ ఫైట్‌ అది. 56 రోజులపాటు చిత్రీకరించాం. ఆ ఫైట్ చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి’’అని పేర్కొన్నారు.

     

  • అఖండ 2.. ఐటమ్ సాంగ్‌లో ఎవరంటే?

    హీరో బాలక‌ష్ణ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 మూవీ షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది. అయితే ఈ చిత్రంలో ఐటమ్‌సాంగ్ కోసం సంయుక్త మీనన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోందది. అయితే దీనికి  ఈ భామా ఓకే చెప్పినట్లు సమాచారం.

  • పవన్‌కల్యాణ్‌కి జోడీగా రాశీఖన్నా

    పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్స్‌కి చోటున్న ఈ కథలో మరో పాత్ర కోసం రాశీ ఖన్నాని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఆమె సెట్‌లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. పవన్‌కల్యాణ్‌తోపాటు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

     

  • ఉత్త చేతులతో పామును పట్టుకున్న సోనూసూద్‌

    ముంబయిలో తాను నివసించే సొసైటీలోకి వచ్చిన పామును ఉత్త చేతులతో పట్టుకుని సోనూ సూద్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, ఆ పాము ర్యాట్‌ స్నేక్‌ అని, విషపూరితం కాదని వివరించారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు.  పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు నిపుణులైన వారిని పిలిపించి మాత్రమే పట్టుకోవాలన్నారు.  దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు సోనూ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.