Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పాప్‌కార్న్‌ ధర చూసి భయపడ్డా: నిర్మాత నాగవంశీ

    మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్‌ ధరలు సినిమా టికెట్ ధరల కన్నా ఎక్కువగా ఉండటంపై నిర్మాత నాగవంశీ ఆందోళన వ్యక్తం చేశారు. పాప్‌కార్న్ రేటు చూసి తానూ భయపడ్డానని పేర్కొన్నారు. ధరల క్రమబద్ధీకరణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తాను కూడా ప్రభుత్వ పెద్దలను కలవాలని అనుకుంటున్నానని తెలిపారు.

  • నటుడు ఫిష్ వెంకట్‌కు తుది వీడ్కోలు!

    HYD: నటుడు ఫిష్ వెంకట్ అంత్యక్రియలు ముగిశాయి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఆయన బంధువులు, శ్రేయోభిలాషులు, సహ నటులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు వెంకట్‌కు చితి ముట్టించి తుది వీడ్కోలు పలికారు.

  • ట్రెండింగ్‌లో రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ సాంగ్

    రష్మిక మందన్నా, దిక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ మూవీ నుంచి ‘నదివే’ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

  • పెద్దలు తొందరగా పెళ్లి చేసుకోమనడానికి కారణం ఇదే!

    ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బంధంలో మార్పులకు మరింత అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. మన అలవాట్లు, దృఢమైన అభిప్రాయాలు పూర్తిగా స్థిరపడకముందే రాజీ పడటం సులభమని, ఇది బంధాన్ని బలోపేతం చేస్తుందని, అనుకూలతను పెంచుతుందన్నారు. పెద్దలు తొందరగా పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడానికి ఇదే ప్రధాన కారణమని మాధవన్ అన్నారు.

     

  • ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు

    డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. నిర్మాతల అభ్యర్థన మేరకు, సినిమా విడుదలైన మొదటి పది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100, అప్పర్ క్లాస్ టికెట్ ధర రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెరగనున్నాయి. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

  • ‘ఆన్ లైన్ ఎడిటర్స్ ఏం తింటున్నారు…?’ విజయ్ కామెంట్స్!

    తన కొత్త చిత్రం ‘కింగ్ డమ్’ సినిమాపై రూపొందించిన ఫ్యాన్-మేడ్ వీడియోపై విజయ్ దేవరకొండ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సరదాగా స్పందించారు. ఈ వీడియోలలోని క్రియేటివిటీ, ఎడిటింగ్ నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడైన విజయ్, “ఆన్ లైన్ ఎడిటర్స్ ఏం తింటున్నారు…?” అని ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు. ‘కింగ్ డమ్’ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.(వీడియో)

  • జగన్‌తో ఫిష్ వెంకట్.. వీడియో వైరల్

    నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యలతో మృతి చెందారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్ మృతిపై టాలీవుడ్ నుంచి, సినీ ప్రముఖుల నుంచి దక్కాల్సిన రెస్పాన్స్ దక్కలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఫిష్ వెంకట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌తో ఫిష్ వెంకట్ కలిసి నడుస్తున్న వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

  • ‘మెగా 157’ లీక్స్‌.. స్పందించిన నిర్మాణ సంస్థ

    చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వర్కింగ్‌ టైటిల్స్‌ ‘మెగా 157’తో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ స్పందించింది. అనధికారికంగా షూటింగ్‌ రికార్డు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  • విజయ్‌కు పోటీగా శివ కార్తికేయన్ సినిమా.. స్పందించిన డైరెక్టర్

    హీరో దళపతి విజయ్ నటిస్తున్న మూవీ ‘జన నాయగన్’. శివ కార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ సంక్రాంతికి పోటీగా వస్తున్నాయని నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా దీనిపై ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర స్పందించారు. ‘‘రెండు సినిమాలు సంక్రాంతికి పోటీపడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. నాకు వాటి గురించి తెలియదు. పరాశక్తి ఎప్పుడు విడుదల కావాలనేది నిర్మాతలు మాత్రమే నిర్ణయిస్తారని’’ తెలిపింది.

  • గాయపడిన షారుక్‌ ఖాన్‌!

    షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కింగ్’.   అయితే, ‘కింగ్’ సినిమా సెట్స్‌లో షారుఖ్‌కి గాయాలయ్యాయని, ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఆ వార్త‌లు విన్న షారుఖ్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.