Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పాపులర్ హీరోయిన్లు వీళ్లే!

    2025 జూన్​కు సంబంధించి పాపులర్ నటీనటుల లిస్ట్​ను ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ శుక్రవారం విడుదల చేసింది. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో సమంత టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. కొంతకాలం నుంచి సినిమాలు చేయకపోయినా, సమంత టాప్​లో ఉండడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రెండో స్థానంలో ఉండగా, దీపికా పదుకొణె మూడో ప్లేస్ దక్కించుకుంది.

  • కరీనా కపూర్ గ్రీస్ వెకేషన్

    బాలీవుడ్ కరీనా కపూర్ గ్రీస్‌లో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. కరీనా తన గ్రీస్ ట్రిప్‌లోని ఫ్యాషన్ స్టైల్‌ను చూపిస్తూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ చేశాను… సరదాగా ఉంది, తప్పకుండా ప్రయత్నించండి” అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.

     

  • ఇండియా నెం 1 హీరోగా ప్రభాస్

    2025 జూన్​కు సంబంధించి పాపులర్ నటీనటుల లిస్ట్​ను  ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌  తాజాగా విడుదల చేసింది. ఈ  లిస్ట్​లో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి నెం.1 గా నిలిచారు.  అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నారు. టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు ఆరో స్థానం దక్కించుకోగా, జూనియన్ ఎన్టీఆర్ 7వ, రామ్​చరణ్ 8వ, నాని 10 ప్లేస్​ల్లో ఉన్నారు.

     

  • కొత్త బిజినెస్ లోకి హీరోయిన్ సమంత !

    టాలీవుడ్  హీరోయిన్ సమంత మరో సరికొత్త బిజినెస్ లోకి  ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లగ్జరీ పెర్ఫ్యూమ్ కొత్త బ్రాండ్ ను  మార్కెట్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపధ్యంలోనే లగ్జరీ పెర్ఫ్యూమ్‌కు  ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.

  • నటుడు, కరుణానిధి పెద్ద కుమారుడు కన్నుమూత

    తమిళనాడు మాజీ ముఖ్యంత్రి దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.ముత్తువేల్(77) ఇవాళ ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ముత్తువేల్ కరుణానిధి మొదటి భార్య పద్మావతి కుమారుడు. ముత్తువేల్ కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు.

     

  • ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ రాలేదు: ఫిష్ వెంకట్ కుటుంబం

    టాలీవుడ్ తీరుపై నటుడు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 100 సినిమాలు చేసిన నటుడు చనిపోయినా పరామర్శించడానికి టాలీవుడ్ నుంచి ఒక్కరూ రావడం లేదంటూ మండిపడుతున్నారు. పేద ఆర్టిస్టు కుటుంబాన్ని ఆదోకోవడానికి ఇండస్ట్రీకి మనసు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. స్టేటస్ ఉన్నవాళ్లు చనిపోతేనే స్పందిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • మొబైల్‌ ఫోన్‌ ‘డ్రగ్‌’లాంటిదేనా?

    మలయాళ దర్శకురాలు రేవతి ఎస్‌ వర్మ రూపొందించిన ‘ఈ వలయం’ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు అతిగా వినియోగిస్తే.. ఎదురయ్యే ఇబ్బందులను ఈ సినిమా కళ్లకు కట్టింది.  మత్తుపదార్థాలకు అలవాటు పడితే ఎంత ప్రమాదమో.. సెల్‌ఫోన్‌ అతి వినియోగంతోనూ అంతే ప్రమాదమంటూ ఆద్యంతం అలరించేలా కథ, కథనాలను తీర్చిదిద్దారు.

     

  • ‘గుంటూరు కారం’ను ఎందుకు ట్రోల్‌ చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు: నాగవంశీ

    మహేశ్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాపై ట్రోలింగ్‌ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై, మిశ్రమ స్పందన పొందినప్పటికీ, బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయినా ఈ మూవీని ఎందుకు ట్రోలింగ్‌ చేశారో అర్థం కాలేదన్నారు. ‘గుంటూరు కారం’ని క్లాస్‌ సినిమాగా ప్రమోట్‌ చేయాల్సిందని నాగవంశీ అన్నారు.

  • RGV సంచలన ట్వీట్.. ఆ సినిమాపైనేనా?

    ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘‘సినిమాలను కనిపెట్టిన వ్యక్తి చనిపోయాడు. ఏ సినిమా హిట్టవుతుందో చెప్పగల వ్యక్తి ఇంకా పుట్టలేదు’’ అని ఆయన రాసుకొచ్చారు. దీంతో ఈనెల 24న రిలీజ్ కానున్న పవన్ కల్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ను ఉద్దేశించే RGV ఈ ట్వీట్ చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

     

  • ఫిష్ వెంకట్ మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

    నటుడు ఫిష్ వెంటక్ మృతి ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసం వద్ద ఆయన కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. కళ్ల ముందే కొడుకు మృతదేహాన్ని చూస్తూ.. ఫిష్ వెంకట్ తల్లి విలపిస్తున్న దృశ్యాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం.