విజయ్ దేవరకొండ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘కింగ్‌డమ్’లోని ‘అన్నా అంటూనే’ సాంగ్‌ను ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి రీక్రియేట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా చిత్రం ‘కింగ్‌డమ్’ జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (వీడియో)
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
VIDEO: కేరళలో Mega157 షూటింగ్ లీక్!
మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటిస్తున్న Mega157 సినిమా షూటింగ్ లీక్ అయిన వీడియోలు కేరళలోని అలప్పుళలో కలకలం రేపుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ నుండి చిరు, నయనతారలపై చిత్రీకరిస్తున్న ఓ రొమాంటిక్ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్ జూలై 23న ముగియనుంది. సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
-
Home Tour: సోనూసూద్ ఇళ్లు చూశారా?
తన యూట్యూబ్ ఛానల్ వేదికగా బాలీవుడ్ దర్శకురాలు, నటి ఫరాఖాన్ కొంతకాలంగా సినీ ప్రముఖుల హోమ్‌టూర్ చేస్తున్నారు. తన వంట మనిషితో కలిసి వెళుతూ, ఆయా సెలబ్రిటీల ఇంట్లో కొత్త వంటకాలను రుచి చూస్తున్నారు. తాజాగా నటుడు సోనూసూద్ ఇంట సందడి చేశారు. ఆ ఇంట్లో షూ కలెక్షన్ చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలో సోనూ భార్య, కుమారులూ కనిపించారు.
-
రామ్ పోతినేని రాసిన లిరికల్ పాట విడుదల
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలుకా’. మహేశ్ బాబు.పి దర్శకుడు. ఈ మూవీ నుంచి ‘నువ్వుంటే చాలే’ అనే పాట లిరికల్ వీడియోను మూవీటీం తాజాగా విడుదల చేసింది. అనిరుధ్ పాడిన ఈ సాంగ్‌ను యువ నటుడు రామ్ పోతినేని రాయడం విశేషం.
-
‘SIIMA’ ఈవెంట్.. డేట్స్ ఫిక్స్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుక తేదీలు ఖరారయ్యాయి. దుబాయ్‌లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ వేడుక దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రదర్శనలను సత్కరించనుంది.
-
5 నెలల తర్వాత ఓటీటీలోకి ‘గార్డ్’ మూవీ
ఓటీటీలోకి కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కుబేర, భైరవం మాత్రమే ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజైన వాటిలో కొత్త సినిమాలు. వీటితో పాటు ‘గార్డ్’ అనే తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది.
-
‘ఛావా’ను అధిగమించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’!
విక్కీకౌషల్ హీరోగా వచ్చిన బాలీవుడ్ సినిమా ‘చావా’ను ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా లాభాల్లో బీట్ చేసినట్లు సమాచారం. రూ.90 కోట్లతో రూపొందిన ఈ సినిమా 800 శాతం లాభాలతో రూ.800కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కేవలం రూ.7 కోట్లతో రూపొంది.. 1200 శాతం లాభాలతో రూ.90 కోట్లు రాబట్టిన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
-
నా పెళ్లి అప్పుడే..: శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఇటీవలే ఈ బ్యూటీ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా జరుపుకుంది. ఆ సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట అలజడి సృష్టించాయి. శ్రీలీల పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం జరిగింది. మరుసటి రోజే దానిపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు ఇంకా 23 ఏళ్లే. 30ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను’’ అని చెప్పుకొచ్చింది.
-
ఆ క్షణంలో చనిపోతాననుకున్నా: మనీషా కొయిరాలా
ప్రముఖ నటి మనీషా కొయిరాలా ఇటీవల తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు తాను చనిపోతానని భావించానని ఆమె చెప్పారు. ‘‘నాకు క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పినప్పుడు నేను చనిపోతానని అనుకున్నాను. కానీ దేవుని దయవల్ల, నేను చనిపోలేదు. నేను మళ్ళీ జీవించడం నేర్చుకున్నాను’’ అని పేర్కొన్నారు.