Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • విజయ్ దేవ‌ర‌కొండ వీడియో వైరల్

    విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న స్పై యాక్షన్‌ చిత్రం ‘కింగ్డమ్‌’. ఈ చిత్రం  జులై 31న విడుదల కానుంది.  మరోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది.  విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సందులో రెండు కాళ్ల‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ గోడ‌పైకి అవలీల‌గా ఎక్కేస్తాడు. విజ‌య్ డెడికేష‌న్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

     

  • ఓటీటీలోకి కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

    అక్షయ్‌ కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’. జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ స్ట్రీమింగ్ అవుతోంది.

  • ప్రముఖ దర్శకుడు ప్రభాకరన్‌ మృతి

    కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వేలు ప్రభాకరన్‌ (68) మరణించారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదివ్వాస విడిచారు. ఎల్లుండి ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన ఎక్కువగా నాస్తిక, విప్లవాత్మక అంశాలపై సినిమాలు తీశారు. పదుల సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించారు. కెరీర్‌ చివర్లో పలు హిట్‌ సినిమాల్లో నటుడిగా నటించి మెప్పించారు.

  • ‘విశ్వంభర’ స్టోరీలైన్‌ చెప్పేసిన దర్శకుడు

    చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో దర్శకుడు వశిష్ఠ చెప్పారు. హీరోయిన్‌ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తారని వెల్లడించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఆషికా రంగనాథన్‌, సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు.

     

     

  • ఫొటోలు వద్దు.. దీవెనలు ముద్దు..

    నటి కియారా అద్వాణీ , నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. వారికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ నేపథ్యంలో తమ బిడ్డను ఫొటోలు తీయొద్దని ఈ దంపతులు మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. ఫొటోలు వద్దు.. దీవెనలు ముద్దు.. అని సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం కియారా నటించిన ‘వార్‌ 2’ ఈ ఆగష్టు 14న విడుదల కానుంది.

     

  • రన్యారావుకు కష్టకాలం.. బెయిల్ లేనట్లే!

    దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు దొరికిపోయిన కన్నడ నటి రన్యారావుకు బెయిలు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని డీఆర్‌ఐఏ అధికారులు కోరగా, ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే అనుమతించింది. ప్రస్తుతం ఆమె కారాగారంలో ఉందని అధికారులు తెలిపారు.

  • ప్రముఖ నటుడికి గుండెపోటు.. క్లారిటీ ఇదే!

    ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన నటుడు ఆసిఫ్ ఖాన్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనకు ఎప్పుడూ గుండెపోటు రాలేదని ఆసిఫ్ స్పష్టం చేశారు. ‘‘ఇది గుండెపోటు కాదు. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి. లక్షణాలు గుండెపోటులా అనిపించాయి, కానీ నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు.

  • 700 మంది స్టంట్‌ మాస్టర్‌లకు ఇన్సూరెన్స్ చేయించిన స్టార్ హీరో

    బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ స్టంట్‌ మాస్టర్‌ మోహన్‌ రాజు షూటింగ్‌లో మృతి చెందిన ఘటన నేపథ్యంలో.. 650-700 మంది స్టంట్‌ మాస్టర్‌లకు అక్షయ్ వ్యక్తిగతంగా హెల్త్‌, యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ చేయించారు. గాయపడితే వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు, మరణిస్తే రూ.20-25 లక్షల పరిహారం వచ్చేలా పాలసీ చేయించారని యాక్షన్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సింగ్‌ దహియా వెల్లడించారు.

  • ఇవాళ సౌందర్య జయంతి

    సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సౌందర్య జయంతి నేడు. తన అందం, అభినయంతో ఆమె అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. దశాబ్దానికిపైగా తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. దక్షిణాదిలో దాదాపు అందరు టాప్‌ హీరోలతో నటించారు. సౌందర్య దూరమై 22 ఏళ్లు అవుతున్నా ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు.

  • జూనియ‌ర్ మూవీ టాక్ ఇదే!

    గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన ‘జూనియర్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల, జెనీలియా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సినిమా చూసిన కొందరు తమ అభిప్రాయాలను ఎక్స్ ద్వారా పంచుకుంటున్నారు. జూనియర్ మూవీ ఒక్కసారి చూడొచ్చని, వైరల్ వయ్యారి పాట, డీఎస్పీ మ్యూజిక్, కిరీటి నటన బాగున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. సెకాండాఫ్ కాస్త మైనస్ అని కొందరు చెబుతున్నారు.