Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • దర్శన్‌కు బెయిల్‌.. ‘సుప్రీం’ అభ్యంతరం

    రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము ఏకీభవించలేకపోతున్నామని తెలిపింది. బెయిల్‌ ఉత్తర్వుల విషయంలో తాము ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలియజేయాలంటూ నటుడి తరఫు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

  • ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌ దేవరకొండ

    టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఆస్పత్రిపాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. విజయ్‌ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన కొత్త చిత్రం కింగ్‌డ‌మ్. గౌతం తిన్న‌నూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 31న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భాగ్య‌శ్రీ బోర్సే, స‌త్య‌దేవ్ న‌టించారు.

  • అందుకే 13 ఏళ్ల సినిమాలకు దూరంగా: జెనీలియా

    ‘జూనియర్‌’ చిత్రంతో 13 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు నటి జెనీలియా. కిరీటి రెడ్డి-శ్రీలీల జంటగా నటించిన చిత్రమిది. జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జనీలియా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  • ఎట్టకేలకు విడుదలైన ‘జనకి వీ vs స్టేట్ ఆఫ్ కేరళ’

    గ‌త కొన్నిరోజులుగా వివాదంలో నిలిచిన మ‌ల‌యాళం చిత్రం ‘జనకి వీ vs స్టేట్ ఆఫ్ కేరళ’ ఎట్ట‌కేల‌కు థియేటర్‌లో విడుద‌లైంది. ఎటువంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ఈ సినిమాను మ‌ల‌యాళంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు మేక‌ర్స్. పాన్ ఇండియా వైడ్‌గా గ‌త నెల జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు వ‌ల‌న వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

  • స్టార్ హీరో బర్త్ డే.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

    హీరో సూర్య-త్రిష జంటగా ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న మూవీ ‘కరుప్ప’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం 2026లో విడుదల కాబోతుంది. తాజాగా ‘కరుప్పు’కు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య పుట్టినరోజున(జులై 23) మూవీ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘కరుప్పు’ టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి?

    టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షోయబ్ మాలిక్‌తో విడిపోయిన ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంది. అయితే ఈ భామ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ హీరోతో సెకండ్ మ్యారేజ్ జరగబోతుందని.. త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరనేది తెలియాల్సివుంది.

  • ‘అమ్మాయి సినిమా అంటే ఎవరూ ముందుకురారు’

    తాను నటించిన ‘పరదా’ సినిమాకి మంచి విడుదల తేదీ దొరకడానికి ఆరు నెలలు పట్టిందని నటి అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. ఆమె కీలక పాత్రలో ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం ‘పరదా’. ఆగస్టు 22న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడారు. ‘‘ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు’’ అని అనుపమ అన్నారు.

     

  • శ్రీలీల క్యూట్ స్మైల్‌కు యూత్ ఫిదా!

    టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ‘జూనియర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెరిసింది. రెడ్ కలర్ చీరలో ఆమె క్యూట్ స్మైల్‌కు యూత్‌ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరలవుతోంది.

  • ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్!

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఈనెల 24న విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూలై 21న సా.6గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈమేరకు ఓ సరికొత్త పోస్టర్ వదిలారు.

  • అనుపమ ‘పరదా’కు రిలీజ్ డేట్ ఫిక్స్!

    అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం ‘పరదా’. ఆగస్టు 22న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.