Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బాలయ్య ‘అఖండ-2’ సినిమాకి భారీ ధర?

    నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అఖండ-2’. ఈ  సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. జియో హాట్‌స్టార్ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజయ్యే అవకాశం ఉంది.

     

  • అల్లు అర్జున్‌ను ఓదార్చిన పవన్ కల్యాణ్

    హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను పరామర్శించారు. ఇతర కుటుంబ సభ్యులనూ ఓదార్చారు. కాగా అనారోగ్య కారణాలతో కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

  • క్యాన్సర్‌తో ప్రముఖ నటి మృతి

    మరాఠీ సీరియల్స్‌తో పాటు పాపులర్ హిందీ టీవీ సీరియల్స్ ‘పవిత్ర రిష్ట’, ‘కసమ్ సే’లలో నటించి పేరుగాంచిన నటి ప్రియా మరాఠే(38) కన్నుమూశారు. ఆమె గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రియా తన భర్త, నటుడు శాంతను మోఘేతో కలిసి జీవిస్తున్నారు. వీరికి 2012లో వివాహం జరిగింది. ఆమె దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించారు.

  • మహేశ్‌‌బాబు ఎమోషనల్ పోస్టు

    ‘ఈ బర్త్‌డేకి నిన్ను మిస్‌ అవుతున్నా’ అంటూ తన కుమారుడు గౌతమ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. గౌతమ్‌ పుట్టినరోజున తాను అందుబాటులో లేకపోవడంపై కాస్త ఎమోషనల్‌ అయ్యారు. గతంలో దిగిన ఫొటోను పంచుకుంటూ.. 19వ వసంతంలోకి అడుగుపెట్టిన తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’’ అని ట్వీట్ చేశారు.

  • అబ్దుల్‌ కలాం బయోపిక్‌.. ధనుష్‌పై ఓంరౌత్‌ ప్రశంసలు

    మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జీవితాధారంగా ‘కలాం’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్‌  టైటిల్‌ పాత్ర పోషించనున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ ఓంరౌత్‌ మాట్లాడుతూ.. కలాం బయోపిక్‌ కోసం ధనుష్‌ కన్నా బెటర్‌ యాక్టర్‌ తనకు దొరకరేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనుష్‌ అంగీకారం తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఆయనతో వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

  • పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్!

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అమ్మమ్మ కనకరత్నమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మైసూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. శనివారం అంత్యక్రియలు ముగిసిన అనంతరం చరణ్ తిరిగి మైసూరుకు పయనమయ్యారు. అక్కడ ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ ముఖ్యమైన పాట షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఐకాన్ స్టార్‌!

    వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ట్వీట్‌కు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఐకాన్ స్టార్ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘‘మీ సంతాపానికి చాలా ధన్యవాదాలు. మీ దయగల మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని పేర్కొన్నారు.

  • అల్లు అర్జున్ నివాసానికి పవన్ కళ్యాణ్ (వీడియో)

    సినీ నిర్మాత అల్లు అరవింద్‌ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. శనివారం రాత్రి అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్న పవన్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అల్లు అర్జున్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

  • సినీ కార్మికుల వేతనాల పెంపు!

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటించింది. 22.5 శాతం వేతనాలు పెంచుతూ నూతన వేతన కార్డును నిర్ణయించినట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ వెల్లడించింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా చేసి ‘ఏ’ కేటగిరిలో రూ.1,420, బి కేటగిరిలో రూ.1,175, సీ కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470 చెల్లించనున్నారు.

  • కనకరత్నమ్మ కళ్లు డొనేట్ చేశాం: చిరంజీవి

    అల్లు అరవింద్ తల్లి, తన అత్తమ్మ అల్లు కనకరత్నమ్మ కళ్లను డొనేట్ చేసినట్లు చిరంజీవి తెలిపారు. ‘‘ఈరోజు తెల్లవారుజామున మా అత్తగారు చనిపోయారని తెలిసింది. ఆర్గాన్ డొనేషన్ గురించి గుర్తొచ్చి బెంగళూరులో ఉన్న అరవింద్‌కు ఫోన్ చేసి మాట్లాడా. ఆయన ఓకే చెప్పారు. గతంలో కనకరత్నమ్మ కూడా తాను డొనేట్ చేసేందుకు సిద్ధం అని నాతో అన్నారు. అందుకే కళ్లు డొనేట్ చేశాం’’ అని చెప్పారు.