Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన బన్నీ ఫ్యామిలీ.. పిక్ వైరల్!

    అల్లుఅర్జున్ తాజాగా తన ఫ్యామిలీతో దిగిన పిక్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇందులో బన్నీ, ఆయన భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హ బ్లాక్‌కలర్ డ్రెస్‌లో మెరిశారు.

  • అలరిస్తున్న ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్‌

    విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రల్లో పాండిరాజ్‌ తెరకెక్కించిన సినిమా ‘సార్‌ మేడమ్‌’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ట్రైలర్‌ను గురువారం విడుదల చేసింది. నిత్య, సేతుపతి భార్యభర్తలుగా నటించారు.

  • ప్రియాంక చోప్రాపై నటుడు మాధవన్‌ ప్రశంసలు

    బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అదరగొడుతోన్న ప్రియాంక చోప్రాపై మాధవన్‌ ప్రశంసలు కురిపించారు. ఆమె నటించిన ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ సినిమా గురించి ప్రస్తావించారు. ‘‘ప్రియాంక ఇక్కడినుంచి అక్కడికి వెళ్లి అంత పెద్ద హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రను సులువుగా పోషించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. ఇండియాలో సగం మంది హీరోలు అలాంటి సినిమాల్లో నటించాలని కోరుకుంటారు’’ అని మాధవన్‌ చెప్పారు.

  • రెడ్ శారీలో అందాల నిధి

    హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా నెట్టింట షేర్ చేసిన తన ఫోటో వైరల్‌ అవుతోంది. రెడ్ శారీలో నిజంగా అందాల నిధిలా ఉంది ఈ బ్యూటీ.

  • పవన్‌ ‘ఓజీ’పై ‘వీరమల్లు’ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు!

    పవన్‌‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రానికి ప్రేక్షకాదరణ బాగా ఉండటంపై ‘హరిహర వీరమల్లు’ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు. కరోనా కారణంగా మా సినిమా ఆలస్యమైంది. అదే సమయంలో ‘ఓజీ’ మొదలైంది. ఆ సినిమా ప్రోమోలు అద్భుతంగా ఉన్నాయి. అదొక విభిన్నమైన యాక్షన్‌ కథా చిత్రం. ముంబయి బ్యాక్‌డ్రాప్‌, గన్స్‌, గ్యాంగ్‌స్టర్‌ చిత్రమది. దాంతో ప్రేక్షకులకు ఆ సినిమాపై ఆదరణ పెరిగింది’’ అని తెలిపారు.

  • ‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోతే.. రానా పోస్ట్‌కు ప్రభాస్‌ రిప్లై!

    ‘బాహుబలి:ది ఎపిక్‌’ విడుదల సిద్ధమవుతోంది. ఈక్రమంలో ప్రభాస్‌-రానాల మధ్య సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది. ఒకవేళ ‘బాహుబలిని కట్టప్ప చంపకపోతే’ అంటూ ‘బాహుబలి’ టీమ్ అడిగిన ప్రశ్నకు తాజాగా రానా సమాధానం ఇచ్చారు. ‘అదే జరిగితే అతని బదులు నేనే చంపేసేవాడిని’ అని అన్నారు. దీనిపై ప్రభాస్‌ స్పందిస్తూ.. ‘రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ కోసం నేను అదే చేయనిచ్చేవాడినిలే భళ్లా’ అని రిప్లై ఇచ్చారు.

  • జెనీలియాపై హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర కామెంట్స్!

    జెనీలియా ‘జూనియర్‌’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రీలీల అన్నారు. తెలుగు సినిమాల్లో ఆమె ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేశారని అన్నారు. ‘జూనియర్‌’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి సినిమా ఇది. శ్రీలీల కథానాయిక. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 18న విడుదలకానుంది.

  • బరువు తగ్గే ప్రయాణంలో.. మాధవన్ రహస్యాలివే!

    బాలీవుడ్ నటుడు ఆర్. మాధవన్ బరువు తగ్గడానికి అనుసరించిన పద్ధతులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, ఆహారాన్ని 45-60 సార్లు నమలడం, సాధారణ జీవనశైలి మార్పులు వంటివి ఆయన బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ సరళమైన చిట్కాలతో కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గినట్లు ఆయన వెల్లడించారు. బరువు తగ్గాలనుకునేవారికి మాధవన్ అనుభవం స్పూర్తినిస్తుంది.

  • ‘జూనియర్‌’ టీమ్‌తో సుమ ఫన్నీ చిట్‌చాట్

    గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి సినిమా ‘జూనియర్‌’. శ్రీలీల కథానాయిక. జెనీలియా కీలక పాత్ర పోషించారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్‌తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  • VIDEO: బాలయ్య ‘స్క్విడ్‌గేమ్‌’ ఆడితే.. దబిడి దిబిడే!

    వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌గేమ్‌’లో ప్రముఖ నటుడు బాలకృష్ణ ఉంటే ఎలా ఉంటుందో చూపించే ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ టాస్కులో బాలయ్య స్వీట్‌ను విరిగిపోకుండా బయటకు తీయాలి. అయితే బాలయ్య దాన్ని తినేయడంతో, గేమ్ నిర్వహకులు బాలయ్యను తీసుకెళ్తారు. ఇందులో బాలకృష్ణతో, నటి అనసూయ, నటుడు రాజీవ్‌ కనకాల ఉన్నారు. ‘స్క్విడ్‌గేమ్‌’లో హీరో నంబర్‌ 456. బాలకృష్ణ ప్లేయర్‌ నెం.456గా కనిపించారు.(వీడియో)