Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘నాకు ఆ అభద్రతాభావం లేదు’

    నటుడు మాధవన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీకెరీర్‌ గురించి మాట్లాడారు. ఎన్ని సినిమాలు చేస్తామనేది ముఖ్యం కాదన్నారు. గుర్తుండిపోయే కథలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ‘‘మూడు నెలలు షూటింగ్‌ చేయకపోతే మన మార్కెట్‌ను కోల్పోతున్నామని భావిస్తాం. నాకు ఆ అభద్రతాభావం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవాలంటే కథల కోసం మనం నిజంగా కష్టపడాలి’’ అని తెలిపారు.

  • జ్యోతిష్యం గురించి ప్రస్తావిస్తే బయటికి పొమ్మనేవారు: శ్రుతి హాసన్

    తాను నాస్తిక, మతరహిత వాతావరణంలో పెరిగినట్లు శ్రుతి హాసన్ తెలిపారు. తన ఇంట్లో దేవుడిని పూజించడం, మత ఆచారాలు లేవని వెల్లడించారు. తన తండ్రి కమల్ హాసన్ “ప్రాక్టికల్” అని, మతం లేదా దేవుడి గురించి మాట్లాడటానికి ఇష్టపడరని, జ్యోతిష్యం గురించి ప్రస్తావిస్తే బయటికి పొమ్మనేవారని చెప్పారు. అయినప్పటికీ, కమల్ హాసన్ తన వ్యక్తిగత నమ్మకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదని శ్రుతి తెలిపారు.

  • ఆసక్తిగా ‘థీమ్‌ ఆఫ్‌ పరదా’ సాంగ్‌

    అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘పరదా’. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో ప్రవీణ్‌ కండ్రేగుల రూపొందిస్తున్నాడు. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్‌ ఆఫ్ పరదా ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ అనే పాటను విడుదల చేశారు. దీనికి వనమాలి లిరిక్స్‌ అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

  • హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమా అంటే ఎవరూ ముందుకురారు: అనుపమ

    అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. తాజాగా ఈ సినిమా నుంచి ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమా అంటే ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు. అందరూ థియెటర్లకు వచ్చి మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని వెల్లడించింది.

  • అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్

    టాలీవుడ్ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కేర‌ళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామిని ద‌ర్శించుకున్నారు. గురువారం ఉద‌యం త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆల‌యానికి వెళ్లిన సాయితేజ్‌కి ఆల‌య అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంతశయన రూపంలో కొలువై ఉన్న స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.  అనంత‌రం వేద‌పండితులు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

     

  • సెన్సార్‌ కోసం డిక్షనరీ తీసుకెళ్లా: అనురాగ్‌ కశ్యప్‌

    సెన్సార్‌ బోర్డులో ఉన్న భాషా పరమైన వ్యత్యాసం గురించి బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా తొలి చిత్రాన్ని సెన్సార్‌ కోసం పంపించినప్పుడు.. అందులోని ఒక పదం విషయంలో వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. సెన్సార్‌ బోర్డు మహారాష్ట్రలోనే ఉన్నప్పటికీ సభ్యులెవరికీ హిందీ తెలియదు. ఏం చేయాలో అర్థంకాక సినిమా ప్రదర్శించినప్పుడు ఒక హిందీ డిక్షనరీ తీసుకువెళ్లాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు.

  • ఫహద్ ఫాసిల్ చేతిలో కీప్యాడ్ ఫోన్.. ధర రూ.10 లక్షలు

    ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ కీప్యాడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోన్ గురించి అభిమానులు సెర్చ్ చేయగా.. అది UK-ఆధారిత బ్రాండ్ Vertu నుంచి చేతితో తయారు చేసిన లగ్జరీ పీస్ అయిన ‘Vertu Ascent Retro Classic Keypad Phone’గా గుర్తించారు. ఈ ఫోన్ ధర రూ.10.2 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.

     

     

  • నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష

    అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావుకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులైన తరుణ్‌ కొండారు రాజు, సాహిల్‌లకు కూడా ఇదే శిక్ష విధించినట్లు విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ బోర్డు తెలిపింది. వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశంలేదని, ఏడాదిపాటు జైలులో ఉండాల్సిందేనని పేర్కొంది.

  • సెన్సార్‌ బోర్డుపై డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ ఆగ్రహం

    సెన్సార్‌ బోర్డుపై బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుపమ పరమేశ్వరన్‌, సురేశ్‌ గోపి కలిసి నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ విషయంలో సెన్సార్‌ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.‘‘కథలు రాసేటప్పుడే పాత్రలకు పురాణాల్లోని పేర్లు ఉపయోగించవద్దనడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అది చేయొద్దు.. ఇది చేయొద్దు అంటే ఎలా? మన పాత్రలను XYZ, 123, ABC అని పిలవాలా?’’ అని ప్రశ్నించారు.

  • ఆగస్టులో వెంకీ కొత్త మూవీ!

    హీరో వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నువ్వు నాకు నచ్చావ్‌, మళ్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్‌ రచయితగా చేశారు.