Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • టొరంటో ఫెస్టివల్‌కు ‘హోమ్‌బౌండ్‌’ : జాన్వీకపూర్‌

    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌ ప్రధానపాత్రల్లో నటించిన “హోమ్‌బౌండ్‌’ టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2025కు ఎంపికైంది. ఈ విషయాన్ని జాన్వీచెప్పుకొచ్చారు. సినిమా టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాను కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు.

  • జెనీలియాపై రాజమౌళి కామెంట్స్ వైరల్

    గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి నటించిన తొలి సినిమా ‘జూనియర్‌’. శ్రీలీల హీరోయిన్‌. జెనీలియా ముఖ్యభూమిక పోషించారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెనీలియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నేళ్లైనా జెనీలియా అందం మాత్రం తగ్గలేదని చెప్పారు.

  • ‘కూలీ’ మూవీకి స్టార్స్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

    ప్రస్తుతం ఇండియన్ మూవీస్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ `కూలీ`. భారీ స్టార్‌ కాస్ట్ ఉన్న చిత్రం కూడా ఇదే. తాజాగా మూవీలోని నటుల పారితోషికాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ మూవీకి రజనీకాంత్‌ రూ. 150కోట్లు, నాగార్జున రూ. 24కోట్లు, ఆమిర్ ఖాన్ రూ. 25 కోట్లు, ఉపేంద్ర రూ. 10 కోట్లు, శృతి హాసన్‌ రూ. 4 కోట్లు, పూజా హెగ్డే రూ. 2కోట్లు తీసుకున్నారట.

  • రాజ‌మౌళికి ఇష్ట‌మైన సినిమా ఇదే!

    గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి నటించిన తొలి సినిమా ‘జూనియర్‌’. శ్రీలీల హీరోయిన్‌. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళితో యాంకర్‌ సుమ చిట్‌చాట్‌ చేశారు. మరి, తాను తెరకెక్కించిన చిత్రాల్లో రాజమౌళికి ఏది బాగా ఇష్టం? మర్చిపోలేని సంఘటనేంటి? వీడియోలో చూసేయండి.

  • జూనియ‌ర్ ఈవెంట్‌లో రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    ‘ఈ అబ్బాయి బాగా చేశాడు’ అని ఎవరి గురించైనా సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ చెబితే.. అతడికి తిరుగుండదని దర్శకుడు రాజమౌళి అన్నారు. అలా వారిద్దరూ కిరీటి గురించి తనకు చెప్పారని తెలిపారు. సినిమాని ఈ నెల 18న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించింది. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • వీడియో: శ్రీలీల, జెనీలియా, దేవిశ్రీ ప్రసాద్‌ డ్యాన్స్‌

    ‘జూనియర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ సినిమా హీరోయిన్‌ శ్రీలీల, కీలకపాత్ర పోషించిన జెనీలియా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సందడి చేశాడు. ఆ చిత్రంలోని ‘వైరల్‌ వయ్యారి’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి అలరించారు. హీరో కిరీటి, యాంకర్‌ సుమ కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. గాలి జనార్దనరెడ్డి కుమారుడే కిరీటి. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ఇది.

     

  • లైట్‌ హౌస్‌ వద్ద చిరు-నయన్ రొమాన్స్!

    మెగాస్టార్‌ చిరంజీవి-నయనతార జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘Mega 157’ సిద్ధమవుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో మొదలైంది. అలప్పుజాలోని లైట్‌హౌజ్ వద్ద చిరు-నయన్‌పై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

  • థియేటర్‌లో డిజాస్టర్‌.. ఓటీటీలో సూపర్ హిట్!

    అనంతిక ప్రధాన పాత్రలో ఫణీంద్ర తెరకెక్కించిన చిత్రం ‘8 వసంతాలు’. ఇటీవలే థియేటర్లలో విడదలైన ఈ సినిమా ఊహించని డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్‌లో చూడని ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఓటీటీలో చూసి మూవీ అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరి థియేటర్లలో పెద్దగా వర్కౌట్ కాకపోయినా.. ఓటీటీ వాళ్లకు మాత్రం గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.

  • కొంటె చూపులతో ఆకట్టుకునేలా కీర్తి!

    హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫొటో యూత్‌ను ఎంతగానో ఆట్టుకుంటోంది. మోడ్రన్ డ్రెస్‌లో కొంటేగా చూస్తున్న ఆమె పిక్ వైరలవుతోంది.

  • ‘మోనికా’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

    రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. హీరోయిన్‌ పూజాహెగ్డే స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ‘మోనికా’ అంటూ సాగే ఈ పాట ఇటీవలే విడుదలై ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించారు.