రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే షురూ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే ఉందని తెలుపుతూ.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
సినిమా రివ్యూలపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు!
హీరో విశాల్ సినిమా రివ్యూలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాను బతికించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏదైనా సినిమా విడుదలైనప్పుడు వెంటనే పబ్లిక్ రియాక్షన్స్ తీసుకోవడం సరికాదన్నారు. ఆ పద్ధతిని మానుకోవాలని సూచించారు. కనీసం 3రోజుల పాటు థియేటర్ల ఆవరణలో పబ్లిక్ నుంచి అభిప్రాయం తీసుకోవడానికి యూట్యూబర్స్‌ను అనుమతించొద్దన్నారు. ఈ మేరకు ఆయన ‘రెడ్ ఫ్లవర్’ మూవీ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు.
-
‘Chiyaan64’.. ‘96’ డైరెక్టర్‌తో హీరో విక్రమ్ మూవీ!
‘96’, ‘మెయ్యాళగన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్.సీ తన కొత్త సినిమాను చియాన్ విక్రమ్‌తో ప్రకటించాడు. ‘Chiyaan64’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ విక్రమ్ కెరీర్‌లో 64వ చిత్రంగా రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకుని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
-
నితిన్ ‘తమ్ముడు’ ఓటీటీ డేట్ ఫిక్స్!
హీరో నితిన్ జూలై 4న ‘తమ్ముడు’ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఈమూవీ రిలీజైన 30 రోజులలో లోపే.. ఓటీటీలోకి వస్తోందని సినీవర్గాల సమాచారం. అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుందట. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
-
అనుపమ ‘పరదా’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరదా’. ఈమూవీలోని ‘యాత్ర నార్యస్తు’ సాంగ్ లిరికల్ వీడియో రేపు ఉ.11గంటలకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ సాంగ్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన రష్మిక!
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక-రక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విభిన్నమైన ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా రానుంది. ప్రస్తుతం దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసింది.
-
అమ్మమ్మతో శ్రీలీల ఫన్నీ వీడియో.. వైరల్
గాలి కిరిటీ-శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘జూనియర్’. ఈ సినిమాలో ‘వైరల్ వయ్యారి’ సాంగ్‌తో శ్రీలీల సోషల్‌మీడియాను షేక్ చేసింది. ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట వైరల్ అవుతోంది.
-
హోంబలేతో మూడు భారీ చిత్రాలు.. ప్రభాస్ ఏమన్నారంటే?
హీరో ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ సంస్థతో మూడు భారీ చిత్రాలు చేయనున్నాడు. దీనిపై తాజాగా ప్రభాస్ స్పందించారు. ‘‘విజయ్ కిరంగదూర్ వల్లే హోంబలే సంస్థ ఈ స్థాయికి చేరింది. ‘సలార్’తో మా ప్రయాణం మొదలైంది. మేమంతా ఒక కుటుంబంలా మారాం. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ఆ విషయం నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నా’’ అని తెలిపారు.
-
అందంతో మాయ చేస్తున్న శ్రీలీల
శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తన లేటెస్ట్ ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది.ఈ ముద్దుగుమ్మ శారీలో తన అందంతో మాయ చేస్తోంది.
-
‘వార్-2’.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘వార్-2’. కియారా అద్వానీ హీరోయిన్. ఆగష్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే ఉందని తెలుపుతూ.. మేకర్స్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ అదిరిపోయిందని చెప్పాలి. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.