బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ తన తనయుడు అభిషేక్‌బచ్చన్ నటనపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఒక ఏడాదిలో ‘ఐ వాంట్ టు టాక్’, ‘హౌస్‌ఫుల్-5’, ‘కాళీధర్ లాపత’ లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించాడు. ఆ చిత్రాల్లో అభిషేక్‌బచ్చన్ కనిపించలేదు. కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది. నటుడిగా నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియజేశావు. ఒక తండ్రిగా నా తనయుడిని ప్రశంసించడాన్ని ఎవరూ ఆపలేరు’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
రవితేజ కుటుంబానికి పవన్ కల్యాణ్ సానుభూతి
ప్రముఖ టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ‘రాజగోపాల రాజు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రవితేజకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
-
‘వార్-2’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన NTR
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘వార్-2’. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘త్వరలో ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరపడుతుంది. 30 రోజుల్లో యుద్ధం ప్రారంభమవుతుంది. ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వార్-2 విడుదలవుతుంది’’ అని ట్వీట్ చేశారు.
-
పోలీసుల అదుపులో బెంగాలీ నటి
పశ్చిమ బెంగాల్‌లోని పుర్చా బర్ధమాన్ జిల్లాలో రోడ్ల వెంట మాసిన బట్టలతో తిరుగుతున్న సుమి హర్ చౌదరిని అనే నటిని పోలీసులు గుర్తించారు. ఆమెను సంరక్షించి, షెల్టర్ హోమ్‌కు తరలించారు. పోలీసులు ఆమె కుటుంబాన్ని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మానసిక సమస్యలతోబాధపడుతున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. సుమి పలు బెంగాలీ సినిమాలు, సీరియళ్లలో నటించారు. ఆమె దీనస్థితికి రావడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
-
25న కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం
మక్కల్‌నీది మయ్యం అధినేత , సినీ నటుడు కమలహాసన్ ఈనెల 25వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. కమల్‌కు రాజ్యసభ అవకాశాన్ని DMK కల్పించింది. ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిస్థితులలో పెద్దలసభలో కమల్ ప్రమాణ స్వీకారం తేదీ గురించి ఆ పార్టీ కార్యాలయంలో ప్రకటించడం గమనార్హం.
-
‘బాహుబలి’ రన్‌టైమ్ రూమర్స్.. స్పందించిన రానా
బాహుబలి సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రాజమౌళి దీని రెండు భాగాలను ఒకే పార్ట్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీని నిడివి 5 గంటలకు పైగానే ఉంటుందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా దీనిపై నటుడు రానా స్పందించారు. ‘‘రన్‌టైమ్ ఎంతనేది నాకు తెలియదు. అది రాజమౌళికి మాత్రమే తెలుస్తుంది. నాకైతే ఆయన ఏం చెప్పలేదు’’ అని అన్నారు.
-
సెలబ్రిటీల కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన దుండగుడు..
ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఓ నివాస భవనంలోకి ఆగంతకుడు ప్రవేశించాడు. భారీ రాళ్లను ఉంచి అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోనే నటి కృతి సనన్, జావేద్ జాఫ్రీ సహా పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఈ సంఘటన జూన్ 19 తెల్లవారుజామున జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు.
-
రవితేజ తండ్రి మృతిపై చిరంజీవి సంతాపం
హీరో రవితేజ తండ్రి రాజగోపాల్‌రాజు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ‘‘సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్‌రావు మరణ వార్త విని చాలా బాధపడ్డాను. అయనను చివరిసారిగా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సెట్స్‌లో కలిశాను. ఎంతో ఆదరణగా, సాదాసీదాగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
-
‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్‌పై దర్శకుడు కామెంట్స్
సల్మాన్ ఖాన్ హీరోగా 2015లో వచ్చిన సినిమా ‘బజరంగీ భాయిజాన్’.ఈ హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 10 ఏళ్లు పూర్తయింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు కబీర్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని డైరెక్టర్ తెలిపారు.