Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    సినిమా టికెట్‌ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినోదపు పన్ను సహా.. రేట్లు రూ.200 మించకుండా ఉండేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అన్ని భాషల చిత్రాలు, సింగిల్‌ స్క్రీన్స్‌తోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ ఇదే వర్తించనుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని కోరింది. మల్టీప్లెక్స్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సీఎం అన్నారు.

  • బ్లాక్ డ్రెస్‌లో శ్రుతిహాసన్ అందాలు!

    శృతి హాసన్ కొన్ని రోజులు నుంచి బ్లాక్ డ్రెస్‌లో డిఫరెంట్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. తాజాగా మరోసారి బ్లాక్ మోడ్‌లో ఫోజులిస్తూ అదరగొట్టింది.

  • టాలీవుడ్ స్టార్ హీరోలపై జెనీలియా ఆసక్తికర కామెంట్స్!

    నటి జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు అని ప్రశంసించింది. మూడు పేజీల డైలాగున్నా కూడా ఒకేసారి చెప్పేస్తాడని… అలాంటి నటుడ్ని ఇంతవరకు చూడలేదని పేర్కొంది. ఇక రామ్‌చరణ్ కూడా అద్భుతమైన నటుడని.. అల్లు అర్జున్‌లో మంచి ఎనర్జీ ఉంటుందని గుర్తు చేసింది. ప్రస్తుతం జెనీలియా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

  • పికాక్‌ మ్యాగజైన్‌పై పింక్ డ్రెస్‌లో విద్యా బాలన్‌

    ప్రముఖ మ్యాగజైన్‌ పికాక్‌ కవర్‌ పేజ్‌పై బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్‌ కన్నుల విందు చేసింది. పింక్ డ్రెస్‌లో ఈ అమ్మడు చూపు తిప్పుకోనివ్వనంతగా ఆకట్టుకుంటోంది.

  • రష్మిక ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’.. రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్!

    రష్మిక-దీక్షిత్‌శెట్టి జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. అయితే రేపు సా.4గంటలకు ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతునట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

  • ‘ఫ్యామిలీ మ్యాన్ 3’.. రాజ్ & డీకే నుండి ఆసక్తికర అప్‌డేట్!

    ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షూటింగ్ పూర్తయిందని ఇప్పటికే మూవీ టీమ్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా, సిరీస్ డైరెక్టర్లు రాజ్ & డీకే ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. మనోజ్ బాజ్‌పేయి, జైదీప్ అహ్లావత్‌లతో ఉన్న ఫోటోను పంచుకుంటూ, “మేము సిద్ధంగా ఉన్నాం.. మీరు ఉన్నారా?” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఈ సీజన్ విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

  • యూత్ మనసు దోచేస్తున్న బోల్డ్ బ్యూటీ!

    బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తన గ్లామర్ ఫోటో షూట్‌తో యూత్ మనసు దోచేసింది. రీసెంట్‌గా ఇన్‌స్టాలో మోడ్రన్ డ్రెస్‌ ధరించిన ఫోటో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

  • ‘వీరమల్లు’ కోసం చార్మినార్‌ సెట్‌ వేశాం: నిర్మాత

    పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఈనెల 24న విడుదలకానుంది. ఈనేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం తాజాగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం చార్మినార్‌ సెట్‌ వేసినట్లు తెలిపారు. ‘‘నిజమైన చార్మినార్‌ దగ్గర షూటింగ్‌ చేయవచ్చు. కానీ మేము అనుకున్నట్లు ఆ సన్నివేశాలు తీయలేం. అందుకే అసలైన చార్మినార్‌ ఎంత సైజ్‌లో ఉంటుందో అంత సెట్‌ వేశాము’’ అని తెలిపారు.

  • ‘SSMB29’ షూటింగ్‌లో స్టార్ హీరో.. వీడియో వైరల్‌!

    మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రీకరణలో తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ భాగం అయ్యారు. ఆయన రీసెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • 34 ఏళ్లకే.. ‘పంచాయత్’ నటుడు ఆసిఫ్ ఖాన్‌కు గుండెపోటు!

    ‘పాతాళ్ లోక్’, ‘పంచాయత్’ వంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన నటుడు ఆసిఫ్ ఖాన్కు 34 ఏళ్ల వయసులోనే గుండెపోటు వచ్చింది. 2రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆసిఫ్ స్పందిస్తూ, “జీవితం చాలా చిన్నది, ఒక్క రోజును కూడా వృథా చేయకండి. ఏ క్షణంలోనైనా అన్నీ మారిపోవచ్చు” అని రాశారు.