Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • వేశ్యగా మారనున్న స్టార్ హీరోయిన్..

    హీరోయిన్ కయాదు లోహర్ టాలీవుడ్‌లో మరో ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాత్ర చాలా స్కిన్ షోతో పాటు కొన్ని బోల్డ్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుందట. కయాదు ఈ చిత్ర షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

  • స్టంట్‌మ్యాన్‌ మృతి.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!

    ఆర్య హీరోగా దర్శకుడు పా.రంజిత్‌ ‘వేట్టువం’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణలో స్టంట్‌మ్యాన్‌ రాజు (52) గుండెపోటుతో మృతి చెందాడు. రాజు మృతి పట్ల పా.రంజిత్‌ విచారం వ్యక్తం చేస్తూ.. భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. ‘‘జులై 13న స్టంట్‌ ఆర్టిస్ట్‌ మోహన్‌రాజ్‌ను కోల్పోయాం. ఆయన మరణ వార్త తెలియగానే మా హృదయం బద్దలైంది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని అన్నారు.

  • ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’పై ప్రముఖ నటుడు కామెంట్స్!

    ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ అలరించడానికి సిద్ధమైంది. ఇందులో కీలకపాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్‌ తాజాగా ఈ సిరీస్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్ మొదలుపెట్టినప్పుడు ఇంతటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుందని అనుకోలేదు. నా కెరీర్‌లో ఎన్నో హిట్‌ సిరీస్‌లలో నటించినప్పటికీ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మాత్రం వాటన్నిటికంటే ముందు వరుసలో ఉంటుంది’’ అని తెలిపారు.

  • జాన్వీకపూర్ అందాల మెరుపులు

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ అదిరిపోయే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె అందాల విందుతో నెటిజన్లను ఆకట్టుకుంది.

  • ‘SSMB29’పై స్టార్ సినిమాటోగ్రాఫర్‌ ఆసక్తికర కామెంట్స్!

    రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘SSMB29’ సినిమాపై సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌ కుమార్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈమూవీకి ఆయన వర్క్‌ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి కొత్త వాళ్లకే అవకాశం ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే తాను ఈ ప్రాజెక్ట్‌కు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయడం లేదన్నారు.

  • రజనీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

    సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. పాన్‌ఇండియా లెవెల్‌లో ఈ ఆగస్టు 14న సినిమా విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో ‘కూలీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 2న విడుదల చేయడం కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

     

  • గొప్ప మనసు చాటుకున్న మెగా కోడలు

    మెగా కోడలు ఉపాసన మరోసారి గొప్ప మనసు చాటుకుంది. ఆమె 150కిపైగా ఓల్డేజ్ హోమ్స్‌ను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్య సంరక్షణ, పోషకాహారం, ఎమోషనల్ సపోర్ట్, తీర్థయాత్రల సౌకర్యం కల్పించనుంది. వృద్ధులను దైవంగా భావించి ఈ సేవలు అందిస్తున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ఆమె నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని జనాలు కోరుకుంటున్నారు.

  • నేత్రదానం చేసిన నటి సరోజా దేవి

    దివంగత నటి సరోజా దేవి మరణం తర్వాత కూడా ఇద్దరికి చూపునివ్వనున్నారు. ఆమె ఐదేళ్ల క్రితం నేత్రదానం చేసేందుకు తన పేరును నమోదు చేసుకున్నారు. ఆమె కోరిక మేరకు కార్నియా తీసి భద్రపరిచామని, త్వరలోనే ఇతరులకు అమర్చుతామని బెంగళూరులోని నేత్రాలయ వైద్యులు తెలిపారు. సరోజా దేవి, తన 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి, అభినయ సరస్వతిగా పేరు పొందారు.

  • ‘F1’ చూసిన రెబల్‌స్టార్ ప్రభాస్.. ఫొటో వైరల్!

    హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన ‘F1:The Movie’ మూవీ ఇటీవల రిలీజై సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. అయితే హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించాడు. సినిమా చూసిన అనంతరం మల్టీప్లెక్స్‌ సిబ్బందితో డార్లింగ్ ఫొటో దిగాడు. ఈ పిక్ సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.

  • ఆమిర్‌ఖాన్‌తో సినిమా.. స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!

    బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్టు డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇండియన్‌ సినిమా ఆడియన్స్‌నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించేలా ఆ మూవీ ఉండనుందని చెప్పారు. అది బిగ్గెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌ అని.. కొన్నాళ్ల క్రితమే ఆ స్టోరీని రాశానని లోకేశ్‌ వెల్లడించారు.