ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘మారీషన్’. ఈనెల 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇక దొంగ (ఫహాద్).. డబ్బులతో ఉన్న మతిమరుపు వ్యక్తిని(వడివేలు) చూస్తాడు. అతడి దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బు కొట్టేయాలని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ప్రముఖ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు ధీరజ్ కుమార్(79) కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
-
సూపర్ మ్యాన్.. 4 రోజుల్లో భారీ కలెక్షన్లు
జేమ్స్ గన్ తెరకెక్కించిన “సూపర్ మ్యాన్’ విడుదలైన నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.1,950 కోట్లు(227 మిలియన్ డాలర్లు) వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. భారత్‌లో రూ.27 కోట్లు వసూలు చేశాయి.పెద్ద సినిమాలు రిలీజ్‌కు లేకపోవడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముంది. టైటిల్ రోల్‌లో డేవిడ్ కారెన్స్‌వెట్ చేసిన విన్యాసాలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
-
రీ రిలీజ్‌కు సిద్ధమైన ‘భాగ్ మిల్కా భాగ్’
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన ఐకానిక్ చిత్రం భాగ్ మిల్కా భాగ్ మళ్లీ థియేటర్‌లలో సందడి చేయబోతుంది. ఈ సినిమాను జూలై 18, 2025న దేశవ్యాప్తంగా PVR INOX థియేటర్లలో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం 2013లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. దీంతో మరోసారి ప్రేక్షకుల ముందకు రానుంది.
-
వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు.. పరిస్థితి విషమం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు ధీరజ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా కారణంగా కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ధీరజ్ కుమార్‌కు చికిత్స అందిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ICUలో వెంటిలేటర్ సహాయంతో ఆయన ప్రాణాల కోసం పోరాడుతున్నారని చెప్పారు.
-
నటుడు చిరంజీవి దరఖాస్తును చట్టప్రకారం పరిష్కరించండి : హైకోర్టు
HYD: జూబ్లీహిల్స్‌లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ సినీనటుడు చిరంజీవి చేసిన దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని GHMCకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. GHMC చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ దరఖాస్తుపై చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని GHMCని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణ మూసివేశారు.
-
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నాగవంశీ ఏమన్నారంటే?
నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్టు ‘రామాయణ’ మూవీని మించేలా అనౌన్స్‌మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, దేవుడి గురించి తీసే సినిమా కావడంతో దేశం మొత్తం మాట్లాడుకునేలా చర్చ ఉండాలన్నారు. అందుకే టైమ్ తీసుకుంటున్నామని, షూటింగ్ 2026 ద్వితీయార్థంలో మొదలవుతుందని చెప్పారు. ఈ సినిమాలో కార్తికేయ స్వామిగా NTR కనిపిస్తారని సమాచారం.
-
‘సంజయ్ దత్ సమాచారమిస్తే ముంబయి పేలుళ్లు జరిగేవి కావు’
ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై పేలుళ్లకు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. 1993లో ఆయుధాల వ్యాన్ గురించి నటుడు సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే పేలుళ్లు జరిగేవి కాదని ఉజ్వల్ అన్నారు. అయితే ఈ టాడా కేసులో సంజయ్ దత్ నిర్దోషిగా విడుదలయ్యారు. అయినప్పటికీ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా తేలారు.
-
పవన్‌తో కచ్చితంగా సినిమా చేస్తా: మెహర్ రమేశ్
తనకు పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉందని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు. భవిష్యత్‌లో పవన్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని పేర్కొన్నారు.
-
సంజయ్ దత్ కామెంట్స్‌పై స్పందించిన లోకేశ్ కనగరాజ్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేసిన కామెంట్స్‌పై దర్శకుడు లోకేశ్ కనకరాజ్ స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. లోకేశ్ తన సమయాన్ని వృథా చేశాడని చెప్పారు. దీనిపై స్పందించిన లోకేశ్.. సంజయ్‌తో మరో సినిమా తీసి తప్పు సరిదిద్దుకుంటానని స్పష్టం చేశారు.