Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఆ సినిమాలాగే ‘Mega157’ ప్రమోషన్స్!

    మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో ‘Mega157’ మూవీ తెరకెక్కుతోంది. అక్టోబర్‌ వరకు సినిమా చిత్రీకరణ పూర్తి చేసి నవంబర్‌, డిసెంబర్‌లో ప్రమోషన్స్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్స్‌ తరహాలో వీడియో సాంగ్స్‌ ముందే రిలీజ్‌ చేసి ప్రమోషన్స్‌ చేస్తారని సమాచారం. దీనికి తగ్గట్లు అనిల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది.

  • ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన జాన్వీకపూర్!

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఆమె తన కొత్త సినిమాను ప్రకటించింది. వరుణ్ ధావన్-జాన్వీ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి’. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకుడు. ఇందులో జాన్వీ తులసి కుమారిగా కనిపించనుంది. అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కాబోతుంది.

  • బాయ్‌ఫ్రెండ్‌తో బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

    బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్‌లో తళుక్కున మెరిసింది. అయితే ఆమెతో తన రూమర్ బాయ్‌ఫ్రెండ్‌ కబీర్ బహియా కూడా కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాదిలో వీరు వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. (ఫొటోలు)

  • రజనీకాంత్‌కు ఆ స్టోరీ రాశా కానీ..: లోకేశ్‌ కనగరాజ్‌

    తాను రజనీకాంత్‌ హీరోగా ముందు ఫాంటసీ స్టోరీ రాశానని డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ తెలిపారు. కథ వినగానే నటించేందుకు రజనీకాంత్‌ కూడా ఆసక్తి కనబరచారని చెప్పారు. మేకింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందనే కారణంతో ఆ ప్రాజెక్టు స్థానంలో ‘కూలీ’ని తెరకెక్కించా అని అన్నారు. ఈమూవీ సెట్స్‌లో రోజూ 700 నుంచి 1000 మంది పని చేసేవారని లోకేశ్‌ తెలిపారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈవిషయాలు వెల్లడించారు.

  • సినిమా రివ్యూలపై స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్!

    హీరో విజయ్ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాపై వచ్చే నెగిటివ్ రివ్వ్యూలు, ట్రోల్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘సినిమాను ప్రజలు ఎంజాయ్ చేయడానికి విడుదల చేస్తాము. కానీ.. సినిమాను వారు ఎలా చూడాలో మేము చెప్పలేము. కాబట్టి ఆ వ్యాఖ్యలు పూర్తిగా వారి అభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రేక్షకుల నుంచి వచ్చిన కామెంట్స్‌తో మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి’’ అని తెలిపాడు.

  • వెరైటీ లుక్‌లో మిల్కీబ్యూటీ

    మిల్కీబ్యూటీ తమన్నా తాజాగా ఇన్‌స్టాలో తన ఫొటోను పంచుకుంది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన ఆమె జుట్టును మరీ పైకి కట్టుకుని వెరైటీ లుక్‌లో కనిపించింది.

  • IFFM నామినేషన్స్‌.. బెస్ట్‌ ఫిమేల్‌ యాక్టర్‌ రేసులో కరీనా, శ్రద్దా!

    ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌(ఐఎఫ్‌ఎఫ్‌ఎం) నామినేషన్స్‌ జాబితా విడుదలైంది. బెస్ట్‌ యాక్టర్‌ ఫిమేల్‌ కేటగిరీ నామినేషన్స్‌ వివరాలివీ. అంజలీ శివరామన్‌ (బ్యాడ్‌గర్ల్‌), భనితా దాస్‌ (విలేజ్‌ రాక్‌స్టార్స్‌ 2), కరీనా కపూర్‌ (ది బకింగహామ్‌ మర్డర్స్‌), శ్రద్దాకపూర్‌ (స్త్రీ 2), తిలోత్తమ షోమ్‌ (షాడోబాక్స్‌) పోటీపడుతున్నరు. కాగా మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14న విజేతల వివరాలు ప్రకటించనున్నారు.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హెబ్బా!

    హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా ఇన్‌స్టాలో తన ఫొటో షేర్ చేసింది. అందులో గుర్తుపట్టని విధంగా చాలా సన్నబడి డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ పిక్ నెట్టింట వైరలవుతోంది.

  • ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్‌.. ఎక్కడంటే?

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా ఈనెల 24న విడుదలకానుంది. అయితే ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో ఈనెల 20న ఈ వేడుక నిర్వహించనునట్లు మేకర్స్ ప్రకటించారు.

  • రజనీకాంత్‌ మాటతో ప్రశాంతంగా నిద్రపోయా: డైరెక్టర్‌

    ‘కూలీ’ సినిమా విషయంలో రజనీకాంత్‌ మాటతో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కూలీ’ మూవీ చూసిన రజనీకాంత్‌.. తనను హగ్‌ చేసుకుని ‘దళపతి’ సినిమాలా ఉంది’ అంటూ కొనియాడారని చెప్పారు. కాగా రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న ఈ మూవీ విడుదలకానుంది.