Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఆంధ్రాకింగ్ తాలుకా’.. ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడే!

    రామ్ పోతునేని-భాగ్యశ్రీ బోర్సే జంటగా P.మహేష్ బాబు తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆంధ్రాకింగ్ తాలుకా’. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ ఈనెల 18న రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

  • ట్రెడిషనల్‌ లుక్‌లో రాశి ఖన్నా

    హీరోయిన్ రాశిఖన్నా తాజాగా SMలో తన క్యూట్ ఫొటో షేర్ చేసింది. ఇందులో ఆమె పింక్ కలర్ డ్రెస్సులో ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది. ఈ పిక్ నెట్టింట వైరలవుతోంది.

  • IFFM నామినేషన్స్‌: బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో ఉన్న స్టార్ వీరే!

    ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌(ఐఎఫ్‌ఎఫ్‌ఎం) నామినేషన్స్‌ జాబితా విడుదలైంది. బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో.. మోహన్‌లాల్‌ (ఎల్‌2: ఎంపురాన్‌), అభిషేక్‌ బచ్చన్‌ (ఐ వాంట్‌ టు టాక్‌), ఆదర్శ్‌ గౌరవ్‌ (సూపర్‌బాయ్స్‌ ఆఫ్‌ మాలేగావ్‌), ఇషాన్‌ ఖట్టర్‌ (హోమ్‌బౌండ్‌), విశాల్‌ జెత్వా (హోమ్‌బౌండ్‌), జునైద్‌ ఖాన్‌ (మహారాజ్‌) పోటీ పడుతున్నారు. మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14 నుంచి 24 వరకూ ఈ వేడుక జరగనుంది.

  • ‘విశాల్ 35’కి క్లాప్ కొట్టిన హీరో కార్తి!

    విశాల్ హీరోగా తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై RB చౌదరి నిర్మిస్తున్నారు. రవి అరసు దర్శకత్వం వహిస్తుండగా.. నటి దుషార విజయన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో కార్తి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.

  • ‘కుబేర’.. ‘నాది నాది’ ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌

    ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం‘కుబేర’. ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంలోని ‘నాది నాది’ ఫుల్ వీడియో సాంగ్‌రి మేకర్స రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

  • IFFM నామినేషన్స్‌.. రేసులో ప్రభాస్ ‘కల్కి’

    ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌(IFFM) నామినేషన్స్‌ జాబితా విడుదలైంది. తెలుగు నుంచి ‘కల్కి 2898ఏడీ’ ఉత్తమ చిత్రం విభాగం రేసులో ఉంది. ‘హోమ్‌బౌండ్‌’, ‘ఎల్‌2:ఎంపురాన్‌’, ‘మహారాజ్‌’, ‘స్త్రీ 2’, ‘సూపర్‌బాయ్స్‌ ఆఫ్‌ మాలేగావ్’ తదితర సినిమాలతో పోటీ పడుతోంది. మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)లో ఆగస్టు 14 నుంచి 24 వరకూ ఈ వేడుక జరగనుంది.

     

  • సరోజాదేవి మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

    ప్రముఖ నటి, పద్మభూషణ్ బీ సరోజా దేవి మృతి పట్ల వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ సంతాపం తెలియజేశారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని తెలిపారు. సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు.

  • ఐదేళ్ల తర్వాత చైనాలో జైశంకర్‌ పర్యటన

    భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జైశంకర్‌ ఐదేళ్ల తర్వాత చైనాలో పర్యటించి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈతో కీలకంగా సరిహద్దు సమస్యలు, వ్యాపార పరిమితులు, ప్రజల పరస్పర మార్పిడి, కైలాస్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభంపై చర్చించారు. జైశంకర్‌ ప్రస్తుతం టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సుకు హాజరయ్యారు, ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త దశకు నాంది పలికే అవకాశం ఉంది.

  • ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద హాలీవుడ్‌ సినిమాల హవా!

    గత కొన్ని రోజులుగా అగ్రతారల సినిమాలు.. ఆసక్తికర చిత్రాలు లేక ఇండియన్‌ బాక్సాఫీస్‌ వెల వెలబోతోంది. ఈ అవకాశాన్ని హాలీవుడ్‌ మూవీస్‌ అందిపుచ్చుకున్నాయి. గత మూడు వారాలుగా మూడు హాలీవుడ్‌ సినిమాలు విడుదలై మంచి వసూళ్లతో రాణిస్తుండటం విశేషం. అవేంటో చూద్దాం.

    • ‘ఎఫ్‌ 1’-రూ.67 కోట్లు
    • ‘జురాసిక్‌ వరల్డ్‌:రీబర్త్‌’-రూ.73 కోట్లు
    • ‘సూపర్‌ మ్యాన్‌’-రూ.25.50 కోట్లు

  • కరీనా సైజ్‌ జీరో రహస్యం ఇదే!

    నటి కరీనా కపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డైట్‌ గురించి వెల్లడించారు. ‘‘10-15 రోజులు పప్పు-అన్నం, పెరుగన్నం తింటాను. సా.6 గంటలకు డిన్నర్‌ అయిపోతుంది. రాత్రి 9.30 గంటలకు నిద్ర పోవాల్సిందే. ప్రపంచం నిద్రలేవక ముందే నా వర్కవుట్స్‌ పూర్తవుతాయి’’ అని కరీనా చెప్పుకొచ్చింది.