Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మహేశ్‌‌బాబు ఎమోషనల్ పోస్టు

    ‘ఈ బర్త్‌డేకి నిన్ను మిస్‌ అవుతున్నా’ అంటూ తన కుమారుడు గౌతమ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. గౌతమ్‌ పుట్టినరోజున తాను అందుబాటులో లేకపోవడంపై కాస్త ఎమోషనల్‌ అయ్యారు. గతంలో దిగిన ఫొటోను పంచుకుంటూ.. 19వ వసంతంలోకి అడుగుపెట్టిన తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’’ అని ట్వీట్ చేశారు.

  • అబ్దుల్‌ కలాం బయోపిక్‌.. ధనుష్‌పై ఓంరౌత్‌ ప్రశంసలు

    మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జీవితాధారంగా ‘కలాం’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్‌  టైటిల్‌ పాత్ర పోషించనున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ ఓంరౌత్‌ మాట్లాడుతూ.. కలాం బయోపిక్‌ కోసం ధనుష్‌ కన్నా బెటర్‌ యాక్టర్‌ తనకు దొరకరేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనుష్‌ అంగీకారం తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఆయనతో వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

  • పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్!

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అమ్మమ్మ కనకరత్నమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మైసూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. శనివారం అంత్యక్రియలు ముగిసిన అనంతరం చరణ్ తిరిగి మైసూరుకు పయనమయ్యారు. అక్కడ ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ ముఖ్యమైన పాట షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఐకాన్ స్టార్‌!

    వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ట్వీట్‌కు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఐకాన్ స్టార్ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘‘మీ సంతాపానికి చాలా ధన్యవాదాలు. మీ దయగల మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని పేర్కొన్నారు.

  • అల్లు అర్జున్ నివాసానికి పవన్ కళ్యాణ్ (వీడియో)

    సినీ నిర్మాత అల్లు అరవింద్‌ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. శనివారం రాత్రి అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్న పవన్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అల్లు అర్జున్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

  • సినీ కార్మికుల వేతనాల పెంపు!

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటించింది. 22.5 శాతం వేతనాలు పెంచుతూ నూతన వేతన కార్డును నిర్ణయించినట్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ వెల్లడించింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా చేసి ‘ఏ’ కేటగిరిలో రూ.1,420, బి కేటగిరిలో రూ.1,175, సీ కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470 చెల్లించనున్నారు.

  • కనకరత్నమ్మ కళ్లు డొనేట్ చేశాం: చిరంజీవి

    అల్లు అరవింద్ తల్లి, తన అత్తమ్మ అల్లు కనకరత్నమ్మ కళ్లను డొనేట్ చేసినట్లు చిరంజీవి తెలిపారు. ‘‘ఈరోజు తెల్లవారుజామున మా అత్తగారు చనిపోయారని తెలిసింది. ఆర్గాన్ డొనేషన్ గురించి గుర్తొచ్చి బెంగళూరులో ఉన్న అరవింద్‌కు ఫోన్ చేసి మాట్లాడా. ఆయన ఓకే చెప్పారు. గతంలో కనకరత్నమ్మ కూడా తాను డొనేట్ చేసేందుకు సిద్ధం అని నాతో అన్నారు. అందుకే కళ్లు డొనేట్ చేశాం’’ అని చెప్పారు.

     

  • అభిమానికి మాటిచ్చిన మాళవిక.. పోస్ట్ వైరల్!

    హీరోయిన్ మాళవిక మోహనన్ రీసెంట్‌గా తన సోషల్‌మీడియా వేదికగా ‘ఆస్క్ మాళవిక’ అంటూ చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలో ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధిచి ఎన్నో విశేషాలు పంచుకుంది. ఇందులో భాగంగా.. ఓ అభిమాని ‘డార్లింగ్ ప్రభాస్‌తో సెల్ఫీ ఫొటో షేర్ చేయండి’ అంటూ అడిగాడు. దీనిపై స్పందించిన మాళవిక.. ‘పాటల షెడ్యూల్ సమయంలో నేను ఒకటి తీసుకొని మీతో పంచుకుంటాను.. ఇది నా ప్రామిస్’ అని తెలిపింది.

  • వారిపై బాలీవుడ్ హీరోయిన్ ఆగ్రహం

    బాలీవుడ్ నటి షెఫాలీ జారివాలా మరణంపై వస్తున్న పుకార్లపై హీరోయిన్ జరీన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, మీడియా వారి కుటుంబాన్ని వేధించడం బాధాకరమని పేర్కొంది. అసలు కారణం తెలియకుండా, వైద్యుల నుంచి ఎటువంటి సమాచారం లేకుండా ఊహాగానాలు చేయడం సరికాదని మండిపడింది. షెఫాలీ కుటుంబానికి సానుభూతి అవసరమని, పుకార్లను ఆపి ఆమె ఆత్మకు శాంతినివ్వాలని జరీన్‌ఖాన్ ఎమోషనల్‌గా వ్యాఖ్యానించింది.

     

  • ‘మీకు బాలయ్య.. నాకు ముద్దుల మావయ్య’

    ప్రముఖ నటుడు బాలకృష్ణ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అందులకున్నారు. శనివారం జరిగిన ఈ వేడుకకు ఏపీ మంత్రి నారాలోకేశ్‌ హాజరై మాట్లాడారు. ఒక చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరిగి రాయాలన్న ఒక్క బాలయ్య బాబుతోనే సాధ్యమని లోకేశ్‌ అన్నారు. అందరికీ బాలయ్యబాబు అయితే, తనకు ముద్దుల మావయ్య అని పేర్కొన్నారు. 50ఏళ్లు సినిమా రంగంలో.. అదే విధంగా రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి అని కొనియాడారు.