Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రముఖ నటి కన్నుమూత

    దక్షిణ కొరియా నటి కాంగ్ సియో హా (31) కన్నుమూశారు. క్యాన్సర్‌తో చాలా కాలంగా పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె అకాల మరణ వార్తను స్థానిక మీడియా ఇవాళ ధృవీకరించింది. కాంగ్ సియో హా అంత్యక్రియలు ఈనెల 16న బాన్పో-డాంగ్‌లోని సియోల్ సెయింట్ మేరీస్ హాస్పిటల్‌లో ఉన్న శ్మశానవాటికలోని రూమ్ 8లో జరుగుతున్నాయి.

  • కిరణ్ ‘కె-ర్యాంప్’ గ్లింప్స్ రిలీజ్‌

    కిరణ్ అబ్బవరం-యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కె-ర్యాంప్’. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. గ్లింప్స్ చూస్తే.. సినిమా అంతా కేరళలో షూట్ చేశారు. గ్లింప్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే కిరణ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ అక్టోబరు 18న సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • నటి సరోజాదేవి మృతికి ప్రధాని మోదీ సంతాపం

    అలనాటి నటి సరోజాదేవి మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. నటి సరోజాదేవి మరణం బాధాకరమైన విషయమని.. భారతీయ సినిమా రంగానికి, సంస్కృతికి ఆమె ఒక ఉన్నతమైన ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. ఆమె తన అద్భుతమైన నటనా పటిమతో కొన్ని తరాల సినీ ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

  • ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ పూర్తి.. రన్‌‌టైమ్‌ ఇదే!

    పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఈనెల 24న విడుదలకానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఇక ఈ మూవీ రన్‌టైమ్ 2గంటల 42 నిమిషాలు ఉన్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

  • ‘ప్రేమంటే’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌

    ప్రియదర్శి , ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్‌ ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను హీరో నాగచైతన్య సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. లవ్‌, కామెడీ, థ్రిల్లింగ్‌ అంశాతో రూపొందుతోంది.

  • జాన్వీకపూర్ మూవీ వాయిదా.. పోస్ట్ వైరల్!

    సిద్ధార్థ్ మల్హోత్రా-జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 25న విడుదలకానుంది. అయితే తాజాగా ఈ మూవీ వాయిదా పడినట్లు పలు వార్తలు వస్తున్నాయి. పలు కారణాల వల్ల ఈ సినిమా ఆగస్టు 29న రాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (పోస్ట్)

  • మా అమ్మకు వీడ్కోలు: నటుడు కమల్‌హాసన్

    సీనియర్‌ నటి సరోజాదేవి మృతిపట్ల నటుడు కమల్‌హాసన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌‌మీడియాలో పోస్ట్ పెట్టారు.‘‘సరోజాదేవి నన్ను ఎప్పుడు చూసినా ప్రేమగా పలకరించేవారు. నాకు తల్లితో సమానం. ఆమె ఇక లేరనే వార్త విన్నప్పటినుంచి కన్నీరు ఆగడం లేదు. నేను మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకున్న మా అమ్మకు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను’’ అని కమల్‌ అన్నారు.

  • హాట్ లుక్‌లో మెహ్రీన్

    హీరోయిన్ మెహ్రీన్ తాజాగా ఇన్‌స్టాలో తన హాట్ పిక్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు గ్రీన్ కలర్ డ్రెస్సులో హాట్‌గా కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది.

  • ‘ఉద‌య్‌పూర్ ఫైల్స్’ చిత్రం స్టేపై విచార‌ణ

    ‘ఉద‌య్‌పూర్ ఫైల్స్’ చిత్రం రిలీజ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ స్టేను స‌వాల్ చేస్తూ నేడు చిత్రనిర్మాత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అత్య‌వ‌స‌రంగా త‌మ పిటీష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. అయితే ఆ స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది. బుధ‌వారం ‘ఉద‌య్‌పూర్ ఫైల్స్’ సినిమా స్టేపై విచార‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్లు జ‌స్టిస్ సూర్య కాంత్‌, జోయ్‌మ‌ల్యా బ‌గ్చీతో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొంది.

  • ‘వార్ 2’ ఫస్ట్ సింగిల్‌పై లేటెస్ట్ బజ్!

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘వార్ 2’. మరి ఈమూవీ విడుదలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. అయితే ‘వార్ 2’ నుంచి ఫస్ట్ సింగిల్‌గా ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుందని బజ్ ఉంది. ఈ సాంగ్ ఈ వారమే వస్తున్నట్టుగా వినిపిస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది.