ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ మూవీ సినిమా జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘రంగనాయకి’ సాంగ్ లిరికల్ వీడియో రిలీజైంది. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్ అభిమానులను అలరిస్తోంది. మణిశర్మ ఈ పాటను కంపోజ్ చేశారు. ధనుంజయ్ సీపాన ఆలపించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఆమె జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తి: బాలకృష్ణ
సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూశారు. ఆమె మృతిపట్ల నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలుపుతూ.. సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘దక్షిణ భారత సినీ పరిశ్రమలో ధ్రువతారగా వెలిగిన పద్మభూషణ్ సరోజాదేవి మరణ వార్త అత్యంత బాధాకరం. మా నాన్న ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 20 సంవత్సరాల కాలంలోనే దాదాపు 20 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. సరోజాదేవి జీవితం రాబోయే తరాల వారికి స్ఫూర్తి’’ అని బాలకృష్ణ రాసుకొచ్చారు.
-
బి.సరోజాదేవి మృతిపై పవన్ సంతాపం
తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూశారు. ఆమె మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ‘‘సరోజాదేవి కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి చిత్రసీమపై తనదైన ముద్ర వేశారు. బి.సరోజాదేవి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’అని పవన్ పేర్కొన్నారు.
-
NTRకు ఏమైంది.. ఫ్యాన్స్‌లో ఆందోళన!
దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు కుటుంబాన్ని నిన్న జూ.ఎన్టీఆర్ పరామర్శించారు. ఆ సమయంలో ఆయన బరువు తగ్గి, చాలా సన్నగా కనిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ ముఖంలో కళ లేదని, ఆయనకు ఏమైందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఇది ప్రశాంత్ నీల్‌తో తీసే సినిమా లుక్ అని కొందరు అంటున్నారు.
-
ఒక్క గాసిప్ కూడా లేకుండా జీవితాన్ని గడిపిన బి.సరోజాదేవి
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి అగ్ర కథానాయికగా ఎదిగారు సీనియర్ నటి బి.సరోజాదేవి. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో లీడ్‌రోల్‌లో నటించిన ఏకైక నటిగా సరోజాదేవి చరిత్ర సృష్టించారు. ఒక్క గాసిప్ కూడా లేకుండా కెరీర్ మొత్తం గడవడం తన అదృష్టమని ఆమె గతంలో తెలిపారు. తాజాగా 87 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు.
-
‘కింగ్డమ్’ నుంచి రేపు రెండో పాట
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ఈ మూవీ నుంచి రెండో పాటను మేకర్స్ రేపు సాయంత్రం 5.05 గంటలకు విడుదల చేయనున్నారు.
-
ఈరోజే కిరణ్ అబ్బవరం ‘K-Ramp’ గ్లింప్స్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘K-Ramp’. ఈ మూవీ గ్లింప్స్‌ను ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
-
సౌత్‌లో టాప్ హీరోయిన్ ఆమెనే!
మలయాళ బ్యూటీ మమిత తొలి సినిమా ప్రేమలుతో మమిత కుర్ర కారు క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమాతో పలు భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ గా మమిత ఉంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా చేస్తుంది. అలాగే ధనుష్, సూర్యలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
-
భాష వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కోలేదు: మాధవన్
కొన్ని రోజులుగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో భాషాపరమైన వివాదాలు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈనేఫథ్యంలో భాషా వివాదంపై నటుడు ఆర్.మాధవన్ స్పందించారు. ‘‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో నేనెప్పుడూ భాష కారణంగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. నేను తమిళం, హిందీ రెండూ మాట్లాడగలను. అందుకే నాకు దీనిపై ఎప్పుడూ ఏ సమస్య రాలేదు’’ అని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయని మాధవన్ అన్నారు.
-
60వ దశకంలో ఆమె స్టార్ హీరోయిన్
50వ దశకం ద్వితీయార్ధంలోనే తన ఉనికిని చాటుకున్న సరోజాదేవి, 60వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. ఈ దశకంలో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ సమయంలో వచ్చిన ‘పెళ్లికానుక’ .. ‘జగదేకవీరుని కథ’ ..’ ఆత్మబలం’ .. ‘ శ్రీకృష్ణార్జున యుద్ధం’ .. ‘శకుంతల’ .. ‘అమరశిల్పి జక్కన్న’ వంటి సినిమాలు ఆమె కెరియర్‌లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి.