Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అలనాటి అతిలోక సుందరి .. బి.సరోజాదేవి

    అలనాటి కథానాయికలలో సావిత్రికి ఎదురుండేది కాదు. గ్లామర్ పరంగా జమున .. కృష్ణకుమారికి తిరుగుండేది కాదు. అలాంటి సమయంలోనే అందం .. అభినయం రెండూ కలగలిసిన నాయికగా బి.సరోజాదేవి ఎంట్రీ ఇచ్చారు. కనురెప్పలను టపటపలాడిస్తూ తెరపై ఆమె చేసిన చూపుల విన్యాసాలు చూసి, అప్పటి కుర్రాళ్లు ఆమె అభిమానులుగా మారిపోయారు. కొంటె నవ్వులతో .. ముద్దుముద్దు మాటలతో .. పడుచు హృదయాలపై పదనిసలు పలికించారు బి.సరోజాదేవి.

  • హిట్ సినిమాలు.. కేంద్ర ప్రభుత్వ అవార్డులు

    దివంగత నటి బి.సరోజాదేవి నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులు సైతం వరించాయి. 5 భాషల్లో 200 సినిమాలకు పైగా నటించిన ఆమెను పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. శ్రీకృష్ణార్జున యుద్ధం, దానవీర శూరకర్ణ, పవిత్ర ప్రేమ, ఇంటికి దీపం ఇల్లాలే, ఆత్మబలం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

  • బి.సరోజా దేవి సినీ ప్రస్థానం ఇదే

    అలనాటి హీరోయిన్ బి.సరోజాదేవి 1942,జనవరి 7న బెంగుళూరులో జన్మించారు. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్రకథానాయకుల సరసన సుమారు 180 పైగా చిత్రాలలో నటించారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం “పాండురంగ మహత్యం”.  తెలుగులో “జగదేకవీరుని కథ”లో NTRతో కలిసి నటించారు.

  • సినిమా కోసం బరువు తగ్గిన శింబు

    వెట్రిమారన్‌ దర్శకత్వంలో హీరో శింబు నటించనున్నారు. ఇది ‘వడ చెన్నై’ తరహా చిత్రంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈమూవీ కోసం శింబు 10కిలోలు బరువు తగ్గినట్లు సమాచారం.

     

  • ప్రముఖ నటి కన్నుమూత

    ప్రముఖ నటి, అలనాటి హీరోయిన్ బి.సరోజాదేవి(87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాలతో అలరించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్‌తో సినిమాలు చేశారు. వయసురీత్యా వచ్చే సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, నిన్ననే టాలీవుడ్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన సంగతి తెలిసిందే.

  • ‘666 ఆపరేషన్‌ డ్రిమ్‌ థియేటర్‌’

    హీరో శివరాజ్‌కుమార్‌ ‘666 ఆపరేషన్‌ డ్రిమ్‌ థియేటర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్తలుక్‌లో కనపడుతున్నారని దర్శకుడు హేమంత్‌ ఎం.రావు తెలిపారు.

  • పూజాహెగ్డేతో సౌబిన్‌ డ్యాన్స్‌

    నటుడు రజనీకాంత్‌.. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ మూవీలో  ‘మోనికా మై డియర్‌ మోనికా’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. ఆ స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ పూజాహెగ్డేతో సౌబిన్‌ షాహిర్‌ చేసిన డ్యాన్స్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘సౌబిన్‌లో ఇంతటి డ్యాన్సర్‌ ఉన్నాడా?’ అంటూ ఆయన అభిమానులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంటే ఎంతగా మెస్మరైజ్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు.

     

  • ప్రభాస్‌పై ‘కన్నప్ప’ బ్యూటీ ప్రశంసలు

    ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన ప్రీతి ముకుందన్, ఆయనతో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రభాస్‌ చాలా స్వీట్‌ పర్సన్‌ అని, పెద్ద స్టార్‌ అయినప్పటికీ మామూలుగా ఉంటారని తెలిపారు. సెట్‌లో ఆయన పాజిటివ్‌ వైబ్‌ తెస్తారని, సందేహాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.

  • విశాఖలో హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

    పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కాబోతుండగా, వచ్చే వారం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ జరపనుంది. విశాఖలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమౌళి, త్రివిక్రమ్‌ ఈ వేడుకకు హాజరు కానున్నారు. అయితే వారణాసిలో ఈవెంట్‌ క్యాన్సల్‌ చేసినట్లు సమాచారం. వైజాగ్‌ వేడుకల్లోనే మేకింగ్‌ వీడియో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ప్రమోషన్లు జోరుగా ప్రారంభించబోతున్నారు.

     

  • SSMB29.. నెగిటివ్‌ పాత్రలో బాలీవుడ్ భామ

    రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న SSMB29 మూవీలో ప్రియాంక చోప్రా నెగిటివ్‌ రోల్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కనిపించబోతుంది. దీంతో, మహేశ్‌ సరసన నటించే మరో భామ ఎవరన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. హాలీవుడ్‌ హీరోయిన్‌ అనేది ఇండస్ట్రీ  టాక్‌. మూవీలో అత్యంత కీలకమైన ఓ పాటను ప్రియాంకతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.