కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ పరామర్శించారు. కోట మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ‘‘కోట శ్రీనివాసరావు.. ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహా నటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం’’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఫహద్ ఫాసిల్ ‘మారీసన్’ సినిమా ట్రైలర్ అప్‌డేట్
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న చిత్రం ‘మారీసన్’. తాజాగా ఈ మూవీ నుంచి రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీటీం స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది.
-
‘అఖండ 2’ నుంచి మరో బిగ్ ట్రీట్!
ఈ ఏడాది విడుదలకానున్న చిత్రాల్లో ‘అఖండ 2 తాండవం’ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో మరో టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేందుకే ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
శ్రీలీల సాంగ్‌కు.. శివ రాజ్‌కుమార్ డ్యాన్స్
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా బెంగళూరులో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ మూవీలోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్‌కు హీరో- హీరోయిన్లలతో కలిసి డ్యాన్స్ చేశారు.
-
ఆర్య మూవీ షూటింగ్‌లో విషాదం.. స్టంట్‌మ్యాన్ మృతి
కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. స్టంట్‌మ్యాన్ రాజు ఆదివారం ఉదయం మృతి చెందారు. నటుడు విశాల్ పోస్టుతో ఆ దుర్ఘటన గురించి తెలిసింది. హీరో ఆర్య- డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్‌లో ప్రమాదం జరిగిందని విశాల్ తెలిపారు. కారుతో స్టంట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ రాజు మరణించినట్టు పేర్కొన్నారు. రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించిన విశాల్.. ఆయన కుటుంబానికి అండగా ఉంటానన్నారు.
-
రిలీజైన 10 రోజులకే ఓటీటీ రిలీజ్ గురించి పోస్ట్
గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సినిమా ‘సోలో బాయ్’. రమ్య పసుపులేటి, శ్వేతా అవస్తి హీరోయిన్లు. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 4న విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నట్లు హీరో గౌతమ్ కృష్ణ పోస్ట్ పెట్టాడు. త్వరలో స్ట్రీమింగ్ అప్‌డేట్ ఉంటుందని అన్నాడు. కాగా ఈ సినిమా రిలీజై 10 రోజులు కూడా కాలేదు.
-
‘మహావతార్ నరసింహ’ కోసం గీతా ఆర్ట్స్
హోంబళే ఫిలిమ్స్ ‘మహావతార్ యూనివర్స్’లో భాగంగా ‘మహావతార్ నరసింహ’ను తెరకెక్కిస్తోంది. ఈ యానిమేటేడ్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. కాగా, ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మూవీ జూలై 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
-
కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్య క్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే.
-
కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభం
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర మొదలైంది. కాసేపట్లో హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో కోటా అంత్యక్రియలు జరగనున్నాయి. పైన క్లిక్ చేసి లైవ్‌లో చూడండి.
-
కోట శ్రీనివాసరావు జీవితంలో కోల్పోయినవి ఆ రెండే..!
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు లేరనే వార్త చిత్ర పరిశ్రమతో పాటు, యావత్ తెలుగు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, 40ఏళ్ల సినీ కెరీర్ కలిగిన ఆయన తన జీవితంలో కోల్పోయిన విషయాలు రెండే రెండు ఉన్నాయని ఓ సందర్భంలో గుర్తు చేసుకుని బాధపడ్డారు. ‘‘ ఒకటి సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. ఇక రెండోది- జనరల్ నాలెడ్జ్ లేకుండా పోయింది’’ అని తెలిపారు.