టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది.భారీ ప్రాజెక్ట్స్‌లో భాగం అయిన శ్రీలీల ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా, శ్రీలీల బాలీవుడ్‌లో ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అట్లీ రెండో ప్రాజెక్ట్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు: గవర్నర్
TG: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతాపం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. తన విలక్షణమైన శైలి, విశేషమైన నటనా నైపుణ్యంతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట అని గవర్నర్ పేర్కొన్నారు.
-
కోటా ఒకే సీన్‌లో ఏడిపించగలరు: చంద్రబాబు
కోటా శ్రీనివాసరావుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూటమి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజాసేవ చేశారు. ఆయన ఒకే సీన్‌లో ఏడిపించగలరు, భయపెట్టగలరు. అలాంటి అరుదైన నటన కోటా సొంతం. పద్మశ్రీ, 7 నంది అవార్డులు రావడానికి ఆయన ప్రతిభే కారణం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ అని తెలిపారు.
-
శ్రీకృష్ణ దేవరాయ బయోపిక్‌లో రిషబ్ శెట్టి?
‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్‌శెట్టి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో కలిసి రిషబ్ ఒక భారీ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం: దిల్‌రాజు
నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని దిల్ రాజు చెప్పారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. తన సంస్థలో ‘మహర్షి’, ‘బృందావనం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారని గుర్తు చేసుకున్నారు.
-
కోట శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు నివాళి
నటుడు కోట శ్రీనివాసరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని కోట శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహాంపై పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-
సినిమాలకు ప్రాణం పోసి వెళ్లిపోయారు!
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్, శరత్ బాబు, ఇప్పుడు కోటా మనల్ని వదిలి వెళ్లిపోయారు. వీళ్లు లీడ్ రోల్ చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే సినిమాలకు ప్రాణం పోశారు. మళ్లీ అలాంటి నటులు ఇండస్ట్రీకి దొరకడం కష్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
-
నటనకు పరిపూర్ణ రూపం కోట శ్రీనివాసరావు: చిరంజీవి
నటనకు పరిపూర్ణమైన రూపం కోట శ్రీనివాసరావు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయనతో తనకు సుధీర్ఘ అనుబంధం ఉందని చెప్పారు. నటుడిగా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేమని చెప్పారు. వ్యక్తిగతంగానూ కోట శ్రీనివాసరావు చమత్కారాలు తనకెంతో ఇష్టమని చెప్పారు. అలాంటి కోట శ్రీనివాసరావును కోల్పోవడం ఎవరూ తీర్చలేని లోటని చిరంజీవి అన్నారు.
-
చనిపోయేంత వరకు నటించాలనుకున్నట్లు కోటగారు చెప్పారు: పవన్
నటుడు కోట శ్రీనివాసరావు మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ‘‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ నుంచి ‘అత్తారింటికి దారేది’ వరకు కోట శ్రీనివాసరావుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. తాను చనిపోయేంత వరకు నటిస్తూనే ఉంటానని కోటగారు నాతో చెప్పారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని పేర్కొన్నారు.
-
కోట శ్రీనివాసరావుకు పవన్ కల్యాణ్ పుష్పాంజలి
నటుడు కోట శ్రీనివాసరావుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. కోట శ్రీనివాసరావు మృతదేహంపై పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవన్ కల్యాణ్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.