టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కోట శ్రీనివాసరావు ఇకలేరు. అయితే, ఆయన చివరిగా 2023లో రిలీజైన ‘సువర్ణ సుందరి’ మూవీలో కనిపించారు. కాగా, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో ఈ లెజండరీ నటుడు ఓ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నేడు మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (83) అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
-
కన్నీటి పర్యంతమైన బాబుమోహన్
కోట శ్రీనివాసరావు, తాను సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవాళ్లమని నటుడు బాబుమోహన్ అన్నారు. హైదరాబాద్‌లో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు. రెండు రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి ఆయన లేడు’’ అని బాబు మోహన్ కన్నీటి పర్యంతమయ్యారు.
-
నా సూపర్‌హిట్స్ అన్నింటిలో.. ‘కోట’ మామ ఉన్నారు: రాజేంద్ర ప్రసాద్
కోట శ్రీనివాసరావుకు సినీ పరిశ్రమలో ఉన్న ప్రత్యేకత అజరామరం అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్న నటుడు కోట అని కొనియాడారు. కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘అహ నా పెళ్లంట సినిమా నుంచి మా సహచర్యం మొదలైంది. ‘ఆ నలుగురు’, ‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’.. ఇలా నా సూపర్‌హిట్స్ అన్నింటిలోనూ కోట మామ ఉన్నారు’’అని గుర్తు చేసుకున్నారు.
-
తెలుగు నటులకు అవార్డులు.. కోట శ్రీనివాసరావు ఏమన్నారంటేే!
తెలుగు నటులకు అవార్డులు రావడం లేదనే అంశంపై గతంలో నటుడు కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు వాళ్లకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. తెలుగు నటుల విద్వత్‌ను ఉపయోగించుకోవడం లేదని చెప్పారు. RRR లాంటి సినిమా తీసిన రాజమౌళికి తెలుగు సినీ పరిశ్రమలో తగిన గౌరవం దక్కలేదని పేర్కొన్నారు.
-
‘కోట’ మీ పాత్రలు బతికే ఉంటాయి: RGV
కోట శ్రీనివాసరావు మృతి పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV) సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సినీ రంగంలో ఉన్న అతి కొద్దమంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనతో నా సినిమాలు ‘శివ’, ‘గాయం’, ‘మనీ’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ మరింత ప్రభావవంతంగా వచ్చాయి. అది వెలకట్టలేనిది. కోట శ్రీనివాసరావు గారు మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఉండవచ్చు. కానీ, ’’ అని ట్వీట్ చేశారు.
-
‘కోట శ్రీనివాసరావు మరణ వార్త నన్నెంతో కలచివేసింది’
కోట శ్రీనివాసరావు మృతి పట్ల దర్శకుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. ‘కోట శ్రీనివాసరావుగారి మరణ వార్త నన్నెంతో కలచివేసింది. నటనలో నిష్ణాతుడు, పోషించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన లెజెండ్. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ట్వీట్ చేశారు.
-
కోట శ్రీనివాసరావుకు బాలకృష్ణ, NTR నివాళి
నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నందమూరి బాలకృష్ణ, NTRలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేగా ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు’’అని బాలకృష్ణ కొనియాడారు. ‘‘ఎనలేని నటనాచాతుర్యం, ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు కోట శ్రీనివాసరావు’’ అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
-
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో చోరీ
బిగ్ బాస్ 18 కంటెస్టెంట్ కాశీష్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ముంబైలోని అంధేరిలో ఉన్న ఆమె నివాసం నుంచి రూ.4.5 లక్షల నగదు దోపిడీకి గురైంది. దోపిడీ జరిగినప్పటి నుంచి కాశీష్ కపూర్ పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి కనిపించకుండాపోయాడు. ఈ మేరకు సచిన్ తన అల్మారా నుంచి డబ్బు దొంగిలించాడని పోలీసులకు కాశీష్ కపూర్ చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
-
కోట శ్రీనివాసరావు మరణం విచారకరం: వెంకయ్య నాయుడు
నటుడు కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన గొప్ప నటుడు.. మానవతా వాది అని కొనియాడారు. విలక్షణమైన పాత్రలు పోషించి ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు. బీజేపీ నుంచి విజయవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. కొన్ని ప్రమాణాలు.. పద్ధతులు గల గొప్ప నటుడిని సినిమా రంగం కోల్పోయిందని పేర్కొన్నారు.