సోషల్ మీడియాలోనూ నటుడు కోట శ్రీనివాసరావు ఇంపాక్ట్ కనిపించింది. మీమ్స్ రూపంలో ఆయన డైలాగ్స్, హావభావాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యో సూస్కోబడ్లా, మనకి కావాల్సింది కూడా అదే లేమ్మా, అదీ పాయింటే, జోకులు బాగా వేస్తావే, వద్దూ.. నాకీ బతుకొద్దు’’ వంటివి డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. కామెడీ, సీరియస్, సందేహం ఇలా సందర్భమేదైనా యువత ఆయన మీమ్స్ షేర్ చేస్తున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం: వెంకయ్యనాయడు
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోట భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఆయన విలక్షణ నటుడు, మానవతావాది. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని వెంకయ్యనాయుడు తెలిపారు.
-
నటన ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు ఉంటారు: బ్రహ్మానందం
నాలుగు దశాబ్దాలుగా తనకు కోట శ్రీనివాసరావుతో అనుబంధం ఉందని నటుడు బ్రహ్మానందం అన్నారు. అలాంటి కోట ఇక లేడూ అంటే నమ్మలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నటన ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు ఉంటారని చెప్పారు. కోటా శ్రీనివాసరావు మరణం భారతదేశ నటనా లోకానికి తీరని లోటని చెప్పారు.
-
తెలుగు భాష.. యాస తెలిసిన నటుడు ‘కోట’: పవన్‌కల్యాణ్
కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష… యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది’’ అని అన్నారు.
-
‘నువ్వే కావాలి’ అంటున్న తమన్నా ఫ్యాన్స్
రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో ‘వా నువ్వు కావాలయ్యా‘ అనే ప్రత్యేక పాటలో తమన్నా డ్యాన్స్ తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఈ సాంగ్ ఆడియో, వీడియో కలిపి 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా జైలర్–2 చిత్రం కోసం ‘నువ్వు కావాలయ్యా 2.0’ పాట లోడింగ్ అవుతున్నట్లు తెలిసింది. దీంతో తమన్నా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
-
Jr.NTR తర్వాతే ఎవరైనా: కోట శ్రీనివాసరావు
ఈ తరం నటుల్లో తనకు ఇష్టమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని కోట శ్రీనివాసరావు తెలిపారు. నటన, నృత్యం.. ఇలా అన్ని విభాగాల్లో తారక్ తన సత్తా చాటుకున్నాడని అన్నారు. ఎంతమంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ అంటేనే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా మంచి నటులేనని, కానీ వారంతా ఎన్టీఆర్ తర్వాతే అన్నారు.
-
బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు వీరేనా?
సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్‌ను కూడా నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈసారి హౌస్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని, నవ్య, ఇమాన్యుయేల్, నటుడు సాయికిరణ్, ముఖేష్ గౌడ, శివ్ కుమార్, సుమంత్ అశ్విన్, తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
-
పిసినార లక్ష్మీపతి పాత్ర.. కోటను వరించిందిలా..
‘అహ నా పెళ్ళంట’సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు. అయితే, తొలుత లక్ష్మీపతి పాత్ర కోసం రావుగోపాలరావును అనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు ‘మండలాధీశుడు’ చిత్రం విడుదల కావడంతో జంధ్యాల.. కోట శ్రీనివాసరావుతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారు. నిర్మాత డి.రామానాయుడు తొలుత అందుకు ఒప్పుకోలేదు. కానీ, పట్టుబట్టి ఒప్పించారు.
-
అల్లరి తాతగా నవ్వించాడు (VIDEO)
‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనూ కోటశ్రీనివాసరావు కామెడీ కితకితలు పెట్టిస్తుంది. వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా, మనవడు వచ్చాక చేసే అల్లరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పెళ్లైన కొత్తలో’ తన మనవడి(జగపతి బాబు) దాంపత్యం బంధం బలపడేందుకు కృషి చేసే తాతగా మెప్పించారు. ఇలాంటి తాత పాత్రలే ‘రాఖీ’, ‘బృందావనం’ లాంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. తాతగా ఆయన చేసిన అల్లరి మంచి వినోదాన్ని పంచింది.
-
‘గదైతే నేను ఖండిస్తున్న’
జగపతిబాబు హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా ‘గాయం’. నటుడిగా జగపతిబాబుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాలో కోటశ్రీనివాసరావు గురు నారాయణ్‌గా అదరగొట్టారు. ‘గదైతే నేను ఖండిస్తున్న’ అంటూ తెలంగాణ యాసను ఆయన పలికిన సంభాషణలకు మంచి పేరొచ్చింది. సినిమా ఆద్యంతం కోట విలక్షణమైన నటనతో కట్టిపడేస్తారు. జర్నలిస్ట్‌గా రేవతి అడిగే ప్రశ్నలకు తింగరి సమాధానాలిస్తూ ఆకట్టుకుంటారు. ఇదీ ఆయన కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర.