Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పాత్ర ఏదైనా ఆయన మాత్రమే చేయగలడు: చిరంజీవి

    సినీనటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘లెజెండరీ యాక్టర్లి కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ తో ఆయన నేనూ ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం.  కామెడీ, విలన్, సపోర్టింగ్ క్యారక్టర్ ఇలా ఏ పాత్ర అయినా తను మాత్రమే చేయగలడన్న గొప్పగా నటించారు. కోట శ్రీనివాసరావు లేని లోటు చిత్ర పరిశ్రమకి ఎన్నటికీ తీరనిది’’ అని అన్నారు.

     

  • తెలంగాణ యాసతో మినిస్టర్‌ కాశయ్యగా అదరగొట్టాడు

    ‘ప్రతిఘటన’ విజయశాంతి, చరణ్‌రాజ్‌లతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది. ‘నమస్తే తమ్మీ…’ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్‌ కాశయ్యగా  అదరగొట్టారాయన.  సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు  దోహదం చేసిందీ పాత్ర.ఈ సినిమాలో అవినీతి మంత్రిగా, కిరాతకుడిగా ఆయన నటనకు విశేష స్పందన వచ్చింది.

     

     

     

  • విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ నటుడు ‘కోట’: కేసీఆర్‌

    సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం, BRS అధ్యక్షుడు కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ వెండితెర నటుడు అని తెలిపారు. ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని చెప్పారు. కోట మరణంతో సినీరంగం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

     

     

  • మధ్యతరగతి తండ్రి పాత్రలో కంటతడి పెట్టించిన ‘కోట’

    జీవితంలో ఇంకా స్థిరపడని కొడుక్కి మధ్యతరగతి తండ్రి పాత్రలో కంటతడి పెట్టించారు కోట శ్రీనివాసరావు.  ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేశ్‌ నాన్నగా చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు.   పైకి గంభీరంగా కనిపిస్తూనే లోపల ప్రేమను నింపుకొన్న నాన్నగా ఆ పాత్రకు ప్రాణం పోశారాయన.  టాలీవుడ్‌ వెండితెర నాన్న పాత్రల్లో వాస్తవానికి దగ్గరగా ఉండి మనసును మెలిపెట్టిన పాత్రల్లో ఇదొకటి.

  • కోట మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు: జగన్

    AP: నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరం. విల‌క్ష‌ణ‌మైన‌ పాత్ర‌ల్లో న‌టించి, మెప్పించిన ఆయ‌న‌ను ప‌ద్మ‌శ్రీతో పాటు ఎన్నో అవార్డులు వ‌రించాయి. కోట మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ నివాళులు’’ అని ట్వీట్ చేశారు.

  • కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు: రేవంత్‌రెడ్డి

    ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

     

  • నాకు 30 ఏళ్లు.. ఇక అలా చేయాల్సిందే: అనిరుద్

    ప్రస్తుతం ‘జైలర్-2’, ‘కూలీ’ చిత్రాలకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిరుద్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘‘నేను పని ఒత్తిడి వల్ల.. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పుడు నిద్రపోతున్నా.. ఇప్పుడు నాకు 30 ఏళ్లు.. దీని వల్ల నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే నేను వర్కింగ్ స్టైల్‌ను మార్చేయాలి’’ అని  డిసైడ్ అయినట్ల తెలిపారు.

     

  • కోట శ్రీనివాసరావు మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

    కోట శ్రీనివాసరావు మృతదేహానికికి నటుడు బ్రహ్మానందం నివాళుల్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోట శ్రీనివాసరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న నటుడు రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందాన్ని ఓదార్చారు. అనంతరం కోట కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

  • మోనికా పాటలో.. పూజ కంటే సౌబినే హైలైట్‌!

    రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  కాగా,  ఈమూవీలో పూజా హెగ్డే, సౌబిన్‌లపై చిత్రీకరించిన పాట. ‘‘మోనికా పాటను’’ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే,  ఈ పాటలో సౌబిన్‌..  పూజతో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్‌ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

  • సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయింది: తనికెళ్ల భరణి

    కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి.. నటుడు తనికెళ్ల భరణి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయిందన్నారు. సామాన్య మధ్యతరగతిలో పుట్టి అంచలంచెలుగా సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.