AP: నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘‘వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం. సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. ఆయన మృతి తెలుగు సినీరంగానికి తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
కోట.. సరిరారు నీకెవ్వరు
కామెడీ విలన్‌గానే ఎక్కువగా గుర్తుండిపోయే కోట శ్రీనివాసరావు… గణేశ్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించారు. ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. గుండుతో, భయంకరమైన కళ్లతో చూస్తేనే వణుకు పుట్టేలా ఉంటుంది. గణేష్ సినిమాలోని పాత్రకు గానూ కోట శ్రీనివాసరావు 1998లో నంది అవార్డు అందుకున్నారు.
-
కోట శ్రీనివాసరావు చివరి మాటలు
నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇటీవల కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కోట.. పలు ఇంటర్వ్యూల్లో తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రస్తుతం అభిమానులు ఆ ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు చివరి మాటలను వింటూ ఆయన నటనను గుర్తు చేసుకుంటున్నారు.
-
పిసినారి లక్ష్మీపతిగా కోట నటనను వర్ణించలేం
కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారు కోట శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆదివారం ఉదయం కన్నుమూశారు. ‘అహ నా పెళ్లంట’ మూవీలో పిసినారి లక్ష్మీపతిగా కోట నటనను ఒక్క మాటలో వర్ణించలేం. అంత అద్భుతంగా నటించారు. బ్రహ్మానందంతో కలిసి లక్ష్మీపతి పంచిన వినోదం ఇన్నేళ్లయినా మనం మరిచిపోలేకపోతున్నాం.
-
కోట శ్రీనివాసరావు భౌతికకాయం ఇదే
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దిగ్భ్రాంతి కలిగించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కోటా భౌతిక కాయాన్ని ఉంచారు. కొంతకాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోటా అంత్యక్రియలు జరగనున్నాయి. కోటా మృతికి సినీ ప్రముఖులు సంతాపంతెలుపుతున్నారు.
-
కోట ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు’ పాటను మరవలేం!
‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు..భర్తగా మారకు బ్యాచిలరు’ అనే పాటతో పెళ్లి వద్దని హితబోధ చేసే అల్లాదీన్‌గా ‘మనీ’ సినిమాలో ఆకట్టుకుంటారు కోట శ్రీనివాసరావు . RGV నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్ ఇంగ్లీష్‌తో ప్రేక్షకులను మనసారా నవ్వించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘మనీ మనీ’లోనూ ఇదే పాత్రతో వచ్చీరాని ఇంగ్లీష్‌తో కామెడీ పండించారు. అందులో పురాణాల మీద, నీతి నిజాయతీల మీద చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
-
వెండితెరపై విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు
పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్‌గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించారు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు.
-
ఇదే కోట శ్రీనివాసరావు చివరి ఫోటో!
నటుడు కోట శ్రీనివాసరావు 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ మూవీలో చివరిగా కనిపించారు. ఆ తర్వాత ఆయన సినిమాలకు, మీడియాకు దూరమయ్యారు. ఈక్రమంలో ఇటీవల నిర్మాత బండ్ల గణేశ్.. కోట ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కోటతో దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అందులో కోటను చూసి అభిమానులు షాక్ అయ్యారు. పూర్తిగా సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారని కామెంట్స్ చేశారు.
-
కోట శ్రీనివాసరావు, బాబు మోహన్.. ఎవర్‌గ్రీన్ కాంబినేషన్
టాలీవుడ్‌లో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లది హిట్ పెయిర్. ఇప్పటికీ ఈ కాంబినేషన్‌ను ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. వీళ్లిద్దరు కలిసి దాదాపు 60కి పైగా సినిమాల్లో జోడిగా నటించారు. ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జోడి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ‘మామ గారు’, చిన రాయుడు సినిమాల్లో వీరి కాంబోకు మంచి ఆదరణ లభించింది.
-
‘హలో బ్రదర్‘ మూవీ తాడి మట్టయ్యగా మెప్పించిన ‘కోట’
నాగార్జున బ్లాక్ బస్టర్ చిత్రం ‘హలోబ్రదర్’లో తాడి మట్టయ్యగా నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టించాడు కోట శ్రీనివాసరావు. ప్రమోషన్ కోసం పడే పాట్లు, అందుకు తన కానిస్టేబుల్‌తో జరిగే కామెడీ మంచి వినోదాన్ని పండించింది. సినిమా అంతా నవ్వించిన కోట..చివరిలో మల్లికార్జున రావు పాత్ర మరణించాక కన్నీళ్లు పెట్టిస్తారు. అలా నవ్విండంలోనైనా, ఏడిపించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించారు.