Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కోట శ్రీనివాసరావును వరించిన అవార్డులు ఇవే

    సినీ పరిశ్రమకు విశేష సేవలందించారు. కోట శ్రీనివాసరావు. ఇందుకు గానూ ఆయనకు సినిపరిశ్రమ నుంచి ఎన్నో అవార్డులను కోట అందుకున్నారు. ఉత్తమ విలన్‌గా, కమెడియన్‌గా, సహాయనటుడిగా 9 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారం కూడా కోటను వరించింది. 2015లో కోట శ్రీనివాసరావును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

  • రాజకీయాల్లోనూ కోట శ్రీనివాసరావు మార్క్

    తన కెరీర్‌లో 750కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు కోట శ్రీనివాసరావు సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు. 1999లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

  • నటుడు కోట శ్రీనివాసరావు నేపథ్యమిదే!

    నటుడు కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్‌. డిగ్రీ పూర్తి చేసిన కోట శ్రీనివాసరావు.. కొంతకాలం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేశారు. ఉద్యోగం చేస్తూనే తరచూ నాటకాలు వేసేవారు. 1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో కోట.. సినీరంగ ప్రవేశంచేశారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించారు.

  • కోట శ్రీనివాసరావు కన్నుమూత

    ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. గత కొన్ని రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • ధురంధర్ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన వీడియో!

    రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ చిత్రం ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. ఇటీవల, సినిమా సెట్స్ నుండి రణవీర్ సింగ్ తుపాకీతో ఒక వ్యక్తిని వెంబడిస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో నటుడు షూటింగ్ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ లీక్ అయిన వీడియో నెటిజన్లలో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.(వీడియో)

  • నాకున్న ఏకైక కల అదే: నిధి అగర్వాల్

    హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ను కాదు.. నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితోనే ఎన్నో ఆడిషన్‌కి వెళ్ళాను. నాకు ఉన్న ఏకైక కల నటి కావడం. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. త్వరలో రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో మీ ముందుకు రాబోతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

  • ట్రెండింగ్‌లో ‘మోనిక’ సాంగ్

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్‌గా ఈ సాంగ్‌ను తెలుగు, తమిళ్ సహా హిందీలో కూడా విడుదల చేశారు.నిన్న వచ్చిన ‘మోనిక’ సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా తెలుగులో యూట్యూబ్‌లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

  • లారెన్స్ ‘కాంచన-4’పై బిగ్ అప్‌డేట్!

    రాఘవ లారెన్స్ ప్రధానపాత్రలో నటిస్తూ తెరకెక్కిసున్న చిత్రం ‘కాంచన-4’. పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా కంప్లీటైంది. తాజాగా మహాబలిపురంలో షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇందులో లారెన్స్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి దశ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా.. ఇదే ఈ మూవీకి లాస్ట్ షెడ్యూల్‌గా టాక్.

  • క్యాన్సర్‌తో శివరాజ్‌కుమార్‌ పోరాటం.. డాక్యుమెంటరీ టైటిల్‌ ఇదే!

    కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారిపై ఆయన చేసిన పోరాటాన్ని తెలియజేసేలా ఒక డాక్యుమెంటరీ సిద్ధమవుతోంది. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘సర్వైవర్‌’ పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీకి ప్రదీప్‌ కె శాస్త్రి దర్శకత్వం వహిస్తుండగా.. గీతా శివరాజ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఆగస్టులో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

  • బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా లవ్​ టుడే బ్యూటీ

    లవ్​ టుడే బ్యూటీ ఇవానా తన లేటెస్ట్ ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ డ్రెస్‌లో ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది.