Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కింగ్ నాగార్జున బర్త్‌డే.. ఫ్యాన్స్ రచ్చ చూశారా?

    టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయన చిత్ర పటానికి పాలాభిషేకాలు చేశారు. కేక్‌ కటింగ్‌లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన స్పెషల్‌ వీడియోను నాగార్జున పంచుకున్నారు. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

  • అనుష్క ‘ఘాటి’ నుంచి మరో సాంగ్ రిలీజ్

    అనుష్క శెట్టి, విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రల్లో దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన సినిమా ‘ఘాటి’. సెప్టెంబర్ 5న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ చిత్రంలోని మూడో పాట లిరికల్‌ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ‘సిరిమర సిరిమర’ అంటూ సాగే ఈ పాటకు సాగర్‌ నాగవెల్లి సంగీతం అందించగా.. సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి, లిప్సిక, మన్వితా నాగవెల్లి ఆలపించారు.

  • బాలయ్య డైలాగ్‌ చెప్పిన రజనీ.. స్పెషల్‌ వీడియో పోస్ట్

    నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుందని అన్నారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు. ‘‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు. కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. ఇలాంటి పంచ్‌ డైలాగ్‌లు కేవలం బాలకృష్ణ చెబితేనే బాగుంటుంద’’ అని తలైవా అన్నారు.

  • మెగాస్టార్ వాయిస్‌.. ‘రామాయణ’ ఫస్ట్‌ పార్ట్‌కు ముగింపు అదే!

    బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. అయితే ఈ భాగం ‘జటాయువు’ మరణంతో ముగుస్తుందని చిత్రబృందం తెలిపింది. జటాయువు పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ సన్నివేశంతో రాముడికి సీతాదేవిని ఎవరు అపహరించారో తెలుస్తుంది. అసలు యుద్ధం రెండో భాగంలో ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.

     

  • అరుదైన గౌరవం అందుకున్న హీరో బాలకృష్ణ

    హీరో బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆయన పేరు చేరింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య నిలిచారు. ఆయన సినీ కెరీర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో బాలకృష్ణ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఏపీ మంత్రి నారాలోకేశ్‌ తదితరులు హాజరయ్యారు.

  • పింక్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న కన్నడ బ్యూటీ!

    హీరోయిన్ రుక్మిణి వసంత్ తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకు మతిపోగొడుతోంది. తాజాగా ఆమె తన ఫొటో సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

  • అనుష్క మూవీకి యు/ఎ సర్టిఫికెట్‌

    అనుష్క శెట్టి ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న మూవీ యు/ఎ సర్టిఫికెట్‌ అందుకున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • హీరోగా స్టార్ డైరెక్టర్.. హీరోయిన్ ఎవరంటే?

    ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కూలీ సినిమా ఫేమ్ కన్నడ నటి రచితా రామ్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో లోకేశ్, రచితా రామ్‌తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

  • ముగ్గురికి జన్మనిస్తా: జాన్వీకపూర్‌

    తన లక్కీ నంబర్ 3 అని.. పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిస్తా హీరోయిన్ జాన్వీకపూర్ గతంలో వెల్లడించింది. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందించింది. ‘‘ఇద్దరు పిల్లలు గొడవ పడినప్పుడు మూడో బిడ్డ ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలని, తన బిడ్డలందరూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారని చెప్పింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తన అభిమానులను ఆకట్టుకుంటోంది.

     

  • ఫుల్‌ఫన్నీగా ‘లిటిల్ హార్ట్స్’ ట్రైలర్

    మౌళి తనుజ్-శివాని నాగరం జంటగా నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగిందంటూ ఫన్నీగా ట్రైలర్‌ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.