Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అతడు నన్ను అసభ్యంగా తాకాడు: హీరోయిన్

    బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ గతంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను ఇబ్బందికరంగా తాకాడు. నాకెంతో కోపం వచ్చి అతడిని కొట్టాను. ఆ వ్యక్తి కూడా నన్ను తిరిగి కొట్టాడు. తప్పు చేసినప్పటికీ అతడు కోపంతో నన్ను తిరిగి కొట్టడం నన్నెంతో బాధించింది’’ అని ఆమె చెప్పింది.

  • నన్ను మోసం చేశారు.. అనసూయ ఆవేదన

    ఇటీవలికాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా యాంకర్, నటి అనసూయ మోసానికి గురయ్యారు. ఈ భామ ఇటీవలే ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. అయితే, వస్తువులుగానీ, మనీ రిఫండ్‌గానీ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాలో స్టోరీని షేర్ చేసింది.

  • 18న రాబోతున్న ‘మై బేబి’

    అధర్వ మురళీ హీరోగా నటించిన ‘DNA’ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై హిట్ అందుకుది. ఇప్పుడా సినిమా తెలుగులో ‘మై బేబి’ టైటిల్‌తో ఈనెల 18న రిలీజ్‌కానుంది.

  • రెడ్ డ్రెస్‌లో బ్యూటీఫుల్‌ రకుల్!

    హీరోయిన్ రకుల్ తాజాగా SMలో పోస్ట్ చేసిన హాట్ ఫొటో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇందులో రెడ్ డ్రెస్‌లో బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ వైరలవుతోంది.

  • Video: పిచ్చి నా కొ*కులు అంటూ.. స్టార్ నటుడు కామెంట్స్!

    ప్రముఖ నటుడు జగపతిబాబు తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఓ ప్రోగ్రాం చేయబోతున్నట్లు వెల్లడించారు. అందులో తనను ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చని నెటిజన్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్నారు. అయితే ఇందులో ‘‘చాలామంది పిచ్చి నా కొ*కులు కాంట్రవర్సీ చేయడానికి రెడీగా ఉన్నారు’’ అంటూ జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (వీడియో)

  • రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’.. ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్!

    రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈమూవీలోని ‘నదివే’ ఫస్ట్ సాంగ్‌ను ఈనెల 16న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ వదిలారు.

  • ఆంధ్ర రాజకీయాలపై ‘మయసభ’.. ఆసక్తిగా టీజ‌ర్‌

    ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుల‌పై ఒక వెబ్‌సిరీస్ రాబోతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను ఆధారంగా 1990లో ఉన్న ఆంధ్రరాజకీయాలపై ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా ‘మయసభ’ అనే వెబ్‌సిరీస్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ఆది పినిశెట్టి, చైత‌న్యరావు ప్రధాన పాత్రలు పోషిస్తున్నాడు. సోనిలివ్‌లో ఈ సిరీస్ ఆగ‌ష్టు 7నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతుండ‌గా.. తాజాగా టీజ‌ర్‌ను విడుద‌లచేశారు.

  • అందుకే నాని ఆ మూవీ నుంచి త‌ప్పుకున్నాడు : దిల్ రాజు

    నితిన్‌తో ద‌ర్శ‌కుడు వేణు ‘ఎల్ల‌మ్మ’ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మొద‌ట‌గా హీరోగా అనుకున్న నాని.. త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని దిల్ రాజు వెల్లడించారు. ‘ఎల్ల‌మ్మ’ చిత్రాన్ని మొద‌ట నానితోనే అనుకున్నాం. కానీ నాని అప్ప‌టికి ‘ప్యార‌డైజ్’ సినిమా చేస్తున్నాన‌ని తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ చాలారోజులు ప‌డుతుంద‌ని చెప్ప‌డంతో నాని ప్లేస్‌లో నితిన్‌ను తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

  • ఇకపై రొమాంటిక్‌ సినిమాలు వదిలేస్తానేమో: మాధవన్

    నటుడు ఆర్‌.మాధవన్‌ తాజాగా చేసిన కామెంట్స్ సినీఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారాయి. ‘‘ఆప్‌ జైసా కోయి’ సినిమాను ప్రారంభించినప్పుడు నేను రొమాంటిక్‌ సినిమాల్లో నటించగలను అనే భావనలో ఉన్నాను. అందుకే ఈ వయసులోనూ ఆ కథను అంగీకరించాను. ఇప్పుడు నా ఏజ్‌కు తగిన సినిమాలనే ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఇకపై రొమాంటిక్‌ సినిమాలను పూర్తిగా వదిలేస్తానేమో’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి.

  • విశాఖలో హీరోయిన్ శ్రీలీల సందడి!

    AP: విశాఖలో హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. నగరంలోని జగదాంబ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ క్లాత్ షో రూంను ప్రారంభించిన ఆమె.. పలు డిజైనర్‌ వస్త్రాలతోపాటు అగ్గిపెట్టె పట్టుచీరను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో అగ్గిపెట్టె పట్టుచీరను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.