బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి వింబుల్డన్ 2025 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. శుక్రవారం లండన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు వారు స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ, శిఖర్ తమ బంధాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, వీరి పబ్లిక్ అప్పియరెన్స్ వారి రిలేషన్‌షిప్‌పై చర్చకు దారి తీస్తున్నాయి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్..!
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. కాగా,దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది.
-
స్టార్ దర్శకుడిపై సంజయ్ దత్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ఈవెంట్‌లో స్టార్ దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు లోకేష్ కనగరాజ్ మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే.. ఆయన నాకు చాలా చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. ‘లియో’ సినిమా ‘ఖైదీ’, ‘విక్రమ్’ల స్థాయిలో ఉంటుందనుకున్నాను. కానీ చివరికి అది పెద్ద డిజాస్టర్ అయింది. ‘లియో’లో ఒక రకంగా నన్ను వృథా చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు.
-
నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
TG: అనారోగ్యంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయినట్లు సమాచారం. గత మూడ్రోజులుగా ఆయన కళ్లు తెరవడం లేదని వార్తలు వస్తున్నాయి. అటు ఫిష్ వెంకట్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు కుటుంబ సభ్యులు చిత్ర పరిశ్రమ సహకారం కోరుతున్నారు.
-
కామెడీగా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ టీజర్
దీక్షిత్ శెట్టి, బృందా ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో అభిషేక్ దీన్ని రూపొందిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. రూ.67వేలు దొంగతనం చేశాక హీరో ఎదుర్కొన్న పరిస్థితులేంటి అనే కామెడీ అంశంతో ఈ చిత్రం రూపొందినట్లు టీజర్ ఆధారంగా తెలుస్తోంది.
-
ఎవడొస్తాడో… రండి: సుజిత్
పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 25న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘‘OGతో రికార్డులన్నీ కొల్లకొడుతున్నాం… ఎవడొస్తాడో… రండి’’ అని సుజీత్ అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిరంజీవి ‘విశ్వంభర’, బాలయ్య ‘అఖండ-2’ సినిమాలు కూడా సెప్టెంబర్‌లోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో సుజీత్ కామెంట్స్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
-
నెట్‌ఫ్లిక్స్‌పై ప్రముఖ దర్శకుడి ఆగ్రహం
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సీఈవోల్లో ఒకరైన టెడ్ సరండోస్‌పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇండియన్ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారనే విషయంపై ఆ సంస్థకు పూర్తి అవగాహన లేదన్నారు. ‘‘భారతీయ కార్యాలయంలోని బృందం ఇచ్చే సూచనలను సంస్థ గుడ్డిగా నమ్మేస్తుంటుందన్నారు. మన టీవీల్లో వచ్చే చెత్త కంటెంట్‌నే వాళ్లు ఓటీటీ వేదికగా అందిస్తున్నారు’’ అని మండిపడ్డారు.
-
ఆ సమయంలో తినడానికి కూడా డబ్బుల్లేవు: రోనిత్ రాయ్
‘జై లవకుశ’లో విలన్‌గా నటించిన రోనిత్ రాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. ‘‘ సినిమాల్లోకి రాకముందు డబ్బుల్లేక కొన్నిసార్లు ఒక్కపూట మాత్రమే భోజనం చేసేవాడిని. నాకు ఇప్పటికీ గుర్తు బాంద్రా స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక దాబాలో ప్రతిరోజూ రెండు రోటీలు, కూర తినేవాడిని. ఓసారి నా వద్ద డబ్బుల్లేక కేవలం రోటీలు మాత్రమే తీసుకున్నా. విషయం అర్థం చేసుకున్న ఆ షాపు యజమాని కూర కూడా ఇచ్చారు’’అంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.
-
‘సూపర్ మ్యాన్’ డ్రెస్ వెనుక స్టోరీ ఇదే!
‘సూపర్‌మ్యాన్’ పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సూపర్ మ్యాన్ అందరి కంటే డిఫరెంట్‌గా డ్రాయర్ ప్యాంట్ పైన ధరిస్తాడు. సూపర్ ఫిట్‌గా ఉన్న శరీరానికి టైట్‌గా అంటుకొని ఉండేలా యూనిఫామ్లాంటి బ్లూ డ్రెస్ వేస్తే, చూసేందుకు అట్రాక్షన్‌గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇంకా అట్రాక్షన్‌గా మారాలని రెడ్ కలర్ డ్రాయర్, వెనుకవైపు ఎరుపు రంగు వేలాడే వస్త్రం (కేప్) ఉండేలా డిజైన్ చేశారంట.
-
ఇకపై రొమాంటిక్ సినిమాలు చేయను: మాధవన్
‘ఆప్ జైసా కోయి’తో నటుడు ఆర్.మాధవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను ఓకే చేసినప్పుడు తాను రొమాంటిక్ కథల్లో కూడా నటించగలనని అనుకున్నట్లు వెల్లడించారు. తాజా తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాధవ్ తెలిపారు.