Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘వింటారా సరదాగా’ టీజర్‌ రిలీజ్‌

    అశోక్‌ గల్లా, శ్రీ గౌరి ప్రియ నటిస్తోన్న చిత్రం ‘వింటారా సరదాగా’.  దర్శకుడు ఉద్భవ్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. అమెరికా నేపథ్యంలో సాగే సినిమా ఇది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాల్ని, వారి కలల్ని, ప్రేమ-స్నేహాల్ని, సందిగ్ధతల్ని ప్రేక్షకుల మనసుకు తాకేలా చూపించనున్నారు. ప్రేమ అంటే తప్పించుకోలేని ప్రాబ్లమ్‌..అంటూ సరదాగా హీరో తన ప్రేమ కథను వివరించారు.

     

  • సోషల్‌ మీడియాను ఊపేస్తున్న ‘మోనికా’ పాట

    హీరోయిన్‌ పూజా హెగ్డే ‘కూలీ’ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌తో మెరిశారు. ‘మోనికా’ అనే పాటలో పూజా రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో  వేసిన స్టెప్పులు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్‌ మ్యూజిక్‌ కూడా అదిరిపోయిందని నేటిజన్లు అంటున్నారు. రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా  ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది.

     

     

     

  • భగవద్గీతపై ఐదు నిమిషాల AI షార్ట్‌ఫిల్మ్‌.. త్వరలో రిలీజ్

    ప్రముఖ దర్శకుడు రామ్ మాధ్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న ఐదు నిమిషాల నిడివితో,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)సాయంతో త్వరలో విడుదల కానుంది. ఇందులో భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాలను సంక్షిప్తంగా, తాత్వికంగా, భావగర్భితంగా ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం త్వరలో యూట్యూబ్‌, OTT ప్లాట్‌ఫామ్స్‌, పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా విడుదల కానుంది.

  • మాటతో జాగ్రత్త: రజనీకాంత్

    ఇటీవల ఓ కార్యక్రమంలో సినీ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌.వెంకటేశన్‌ రచించిన ‘వేల్పారి’పుస్తకానికి విశేష పాఠకాదరణ లభించిన సందర్భంగా శుక్రవారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘మనం ఏం మాట్లాడాలనేది విజ్ఞానం.. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ.. ఎంత మాట్లాడాలనేది స్టేజ్‌.. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు’’అని అన్నారు.

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సంతోష్‌ శోభన్‌

    AP: తిరుమల శ్రీవారిని నటుడు సంతోష్‌ శోభన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులు సంతోష్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  • రిటైర్‌మెంట్‌ తర్వాత ఆ పుస్తకం పూర్తి చేస్తా: రజనీకాంత్‌

    ఎస్‌.వెంకటేశన్‌ రచించిన ‘వేల్పారి’ పుస్తకానికి విశేష పాఠకాదరణ లభించిన సందర్భంగా శుక్రవారం చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ రజనీకాంత్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  స్నేహితులు చెప్పడం వల్ల తాను ‘వేల్పారి’ పుస్తకాన్ని చదవడం ప్రారంభించానని ఇప్పటికే 25 శాతం పూర్తి చేశానన్నారు. సినిమా నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత ఆ పుస్తకం చదవడం పూర్తిచేస్తానని తెలిపారు.

     

  • ‘పెద్ది’లో శివన్న పాత్ర ఇదే!

    బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) నటిస్తున్నారు. ఇవాళ శివరాజ్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ‘పెద్ది’ టీమ్ విసెష్ చెప్పింది. ‘పెద్ది’లో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది.

  • కమెడియన్ భార్యకు అశ్లీల మెసేజ్‌లు.. చివరికి

    ప్రముఖ కన్నడ హాస్య నటుడు సంజు బసయ్య భార్య పల్లవి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఓ యువకుడు అసభ్య మెసేజ్‌లు పంపించాడు. సంజు ఫిర్యాదుతో బెళగావి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. అతడు విద్యార్థి అని తేలింది. దీంతో పోలీసు కేసు వల్ల విద్యార్థి కెరీర్‌ నాశనం కాకూడదని, నిందితుడకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టాలని పోలీసులను సంజు కోరారు. ఈమేరకు పోలీసులు అతడిని విడిచిపెట్టారు.

  • ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ టైటిల్ ఫిక్స్!

    చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్‌ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్‌.  ఈ మూవీలో కీలక పాత్రలో వెంకటేశ్‌ నటిస్తున్నారు.

     

  • ప్రముఖ నటుడి ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్

    ప్రముఖ టెలివిజన్ నటుడు ఫహ్మాన్ ఖాన్ సైబర్ దాడికి గురయ్యారు. తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని ఫహ్మాన్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన అభిమానులు, అనుచరులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనకు సంబంధించిన ఆయా అకౌంట్ల నుంచి వచ్చే సందేశాలను, పోస్ట్‌లను ఫాలో కావొద్దని కోరారు.