Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రేమలో మార్పు కచ్చితంగా ఉంటుంది: రష్మిక

    ప్రేమ ఎవరినైనా మారుస్తుందని నటి రష్మిక అన్నారు. ప్రేమించిన వారికోసం మారడంలో ఆనందం ఉంటుందని వెల్లడించారు.

  • ‘అవతార్‌’ టెక్నాలజీని పరిచయం చేస్తాను: శంకర్

    ప్రముఖ దర్శకుడు శంకర్.. తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘వేల్పారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. ఇందులో అవతార్‌లో వాడిన టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఇది భారతీయ సినిమాకే గర్వకారణమని శంకర్ వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల శంకర్ నుంచి వచ్చిన ‘ఇండియాన్-2’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో ఈ సినిమాతోనైనా శంకర్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

  • నాకు మొదటి హిట్ ఇచ్చింది తెలుగు ప్రజలే: శ్రుతి హాసన్

    టాలీవుడ్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘గబ్బర్‌ సింగ్‌ మూవీ నా లైఫ్‌ని మలుపు తిప్పింది. మొదట హరీశ్‌ శంకర్‌ అడిగినప్పుడు నో చెప్పా. కానీ, ఆయన పట్టుబట్టడంతో ఓకే అన్నాను. నా ఎన్నో మూవీస్‌ మంచి హిట్‌ అయ్యాయి. కానీ, ఫస్ట్‌ హిట్‌ మాత్రం టాలీవుడ్‌, తెలుగు ప్రేక్షకుల నుంచే దక్కింది’’ అని చెప్పుకొచ్చారు.

  • పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర విమర్శలు

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దీ రాజ్యభాష అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ‘‘ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా ఛీ..ఛీ.. #justasking’’ అంటూ పవన్‌ మాట్లాడిన వీడియోను షేర్‌ చేశారు. ప్రకాశ్‌ ట్వీట్‌ను పలువురు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు.

  • కళకు కులం, మతం ఉండవు: రజినీకాంత్

    కళకు కులం, మతం అని తేడాలు తెలియవని సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించారు. రచయిత వెంకటేషన్ రాసిన ‘వేల్పరి’ నవల లక్ష కాపీలు అమ్ముడైన సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. కళా ప్రపంచంలో కుల మతాల హద్దుల పరిధికి బయటే ఉంటుందన్నారు. తమిళనాడు ప్రజలు ఎల్లప్పుడూ ఆర్టిస్టిక్ కమ్యూనిటీని హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తారని ప్రశంసించారు.

  • హాట్ లుక్‌లో కన్నడ బ్యూటీ!

    త్వరలో ‘విశ్వంభర’ సినిమాతో పలకరించబోతున్న కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. తాజాగా తన హాట్ ఫొటోను SMలో షేర్ చేసింది. బ్లక్ డ్రెస్‌లోని ఆమె పిక్ వైరలవుతోంది.

  • ‘ఆంధ్రా కింగ్ తాలుకా’.. షూట్‌లో భాగ్యశ్రీ ఎంట్రీ!

    రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలుకా’. మహేష్ బాబు. పి దర్శకుడు. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్‌లో భాగ్యశ్రీ, రామ్ ఎంట్రీ ఇచ్చారట. ఈ షెడ్యూల్‌లో వీరిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.

  • పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్‌లో ‘సిలా’.. ఆసక్తిగా పోస్టర్‌!

    బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణే నటిస్తున్న సినిమా ‘సిలా’. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఓముంగ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో సిలా పాత్రలో సాదియా ఖతీబ్ నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో సాదియా కోపంగా పవర్ లుక్‌లో కనిపిస్తోంది.

  • కుబేర.. ‘పోయిరా మావా’ ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్

    శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం సినీప్రియుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పోయిరా పోయిరా మావా’ ఫుల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఈ సాంగ్‌ను భాస్కరభట్ల రాయగా ధనుష్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

  • హాట్ అందాలతో శ్రద్ధాకపూర్!

    బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ తాజాగా ఇన్‌స్టాలో హాట్ ఫోటో పంచుకుంది. ఇందులో ఆమె రెడ్ కలర్ టాప్‌లెస్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతోంది.