టిక్‌టాక్ వీడియోలతో క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ స్థాయికి వచ్చిన బ్యూటీ దీపిక పిల్లి. ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆమె హల్దీ ఫంక్షన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మ్యారేజ్ చేసుకుంటున్నావా.. అయితే కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(పోస్ట్)
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఎమోషనల్‌గా ‘జూనియర్’ ట్రైలర్
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. జెనీలియా, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్య కథాంశంతో రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి.. తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే.. యాక్షన్, ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.
-
కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’.. ప్రమోషనల్ వీడియో రిలీజ్!
కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని తెరకెక్కిస్తున్న సినిమా ‘K-ర్యాంప్’. యుక్తీ తరేజా హీరోయిన్. హీరో క్యారెక్టరైజైషన్ (ది రిచెస్ట్ చిల్లర్ గాయ్)కు సంబంధించిన గ్లింప్స్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు.
-
‘సూపర్‌మ్యాన్’ ప్యాంట్‌పైనే డ్రాయర్ ఎందుకు?
ప్రస్తుతం ‘సూపర్‌మ్యాన్’ మూవీ థియేటర్స్‌లో సందడి చేస్తున్న నేపథ్యంలో సూపర్ మ్యాన్.. డ్రెస్‌పై ఎందుకు డ్రాయర్ వేసుకుంటాడని ప్రశ్న తలెత్తింది. 1930ల కాలంలో ప్రజలకు వినోదమంటే కథల పుస్తకాలు, కామిక్స్. ఈ క్రమంలోనే సూపర్‌మ్యాన్ కామిక్స్‌ను పరిచయం చేసే సమయంలో పాఠకులను ఆకట్టుకోవడానికి ఇతర పాత్రలకు భిన్నంగా ఆ పాత్రను డిజైన్ చేయాలనుకున్నారట. అలా అప్పటి నుంచి సూపర్‌మ్యాన్ డ్రెస్ కోడ్ అలా స్థిరపడిపోయిందని చెబుతారు.
-
‘కూలీ’ నుంచి పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో హీరోయిన్ పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘మోనిక’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
-
‘ద బిగ్ ఫోక్ నైట్ 2025’ ప్రోమో లాంచ్
‘ద బిగ్ ఫోక్ నైట్ -2025’ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ పోస్టర్, ప్రోమో లాంచ్ కార్యక్రమం మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. ఎలిమెంటల్ మీడియా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్‌నర్లుగా బిగ్‌టీవీ ‘ద బిగ్ ఫోక్ నైట్ కార్యక్రమం’ నిర్వహిస్తోంది. ఈ నెల 23న ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో 60 మంది తెలంగాణ జానపద రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు పాల్గొనబోతున్నారు.
-
24 నుంచి ‘కూలీ’ బుకింగ్స్ షురూ!
రజనీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న విడుదలకానుంది. అయితే అమెరికాలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్‌ను ఈనెల 24 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
-
నిర్మాతగా స్టార్ హీరో.. త్వరలో మూవీ ప్రకటన!
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వడ్డే నవీన్.. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయన చివరగా 2016లో ‘ఎటాక్’ సినిమాలో నటించారు. అయితే నవీన్ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కానీ నటుడిగా కాదు నిర్మాతగా. వడ్డే క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇందులో ఆయన కొత్త సినిమాను ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి త్వరలో వెల్లడించానున్నారు.
-
శ్రీలీల వీకెండ్ ట్రీట్.. ఫొటో వైరల్!
హీరోయిన్ శ్రీలీల అభిమానులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. ఇందులో పింక్ డ్రెస్‌లో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టింది.
-
‘రామాయణ’ నుంచి కాజల్ ఔట్!
బాలీవుడ్‌లో భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. ఇందులో రణబీర్‌కపూర్-సాయిపల్లవి సీతారాములుగా.. యాష్-రావణాసురుడిగా నటిస్తున్నారు. కాగా రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈమూవీ నుండి కాజల్‌ను తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ఎంపికైందనే న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాల్సివుంది.